Health Problems : ఈ 8 సంకేతాలు మీలో కనిపిస్తే తక్షణమే వైద్యున్ని సంప్రదించాలి.. లేకపోతే ప్రమాదంలో పడినట్లే…!!
Health Problems : ప్రస్తుతం మనం జీవించే జీవనశైలి విధానంలో ఎన్నో మార్పుల వలన అనారోగ్య సమస్యలు రోజురోజుకి ఎక్కువవుతున్నాయి. చాలామంది అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడటం మనం చూస్తూనే ఉండడం దానికి వారు పాటిస్తున్న ఆహారపు అలవాట్లే కారణం అవుతున్నాయి. అయితే వాటి వలన వచ్చే వ్యాధులలో ముఖ్యమైనది గుండెపోటు. ఈ వ్యాధి అందర్నీ భయ్యా బ్రాంతులకు గురిచేస్తుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలకి కారణమవుతున్న మహమ్మారి క్యాన్సర్. ఈ సమస్యకి ఔషధాలు చికిత్స ఉన్నప్పటికీ సరియైన సమయంలో గుర్తించకపోతే క్యాన్సర్ ప్రమాదకరమవుతుంది. దీని మొదటి దశలోనే గుర్తించటం ఎంతో ప్రధానమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్యాన్సర్ను ప్రాథమిక దశలో గుర్తించేందుకు కొన్ని రకాల సంకేతాలు శరీరంలో
కనిపిస్తాయని చెప్తున్నారు.అ నేపద్యంలో ప్రధానంగా ఈ ఎనిమిది లక్షణాలు క్యాన్సర్ను చూసిస్తాయని ఆయా లక్షణాలు కనబడితే ఎటువంటి ఆలస్యం లేకుండా వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. అని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మూత్రంలో రక్తం : బ్లాడర్కు కూడా క్యాన్సర్ సోకుతుందని తెలిసింది. ఈ తరహా క్యాన్సర్ తో ఇబ్బంది పడేవారిలో మూత్రంలో రక్తం పడుతూ ఉంటుంది. ఇలా మూత్రంలో రక్తం వచ్చేటప్పుడు ఎటువంటి నొప్పి ఉండకపోవచ్చని కానీ మూత్రంలో రక్తం పడడం బ్లాడర్ క్యాన్సర్కు లక్షణంగా చెప్తున్నారు. తగ్గని నొప్పులు : సాధారణంగా ఏదైనా శారీరిక శ్రమ చేసినప్పుడు ఒళ్ళు నొప్పులు సాధ్యమే అయితే ఎటువంటి పనిచేయకుండానే నొప్పులు కలిగితే దానికి క్యాన్సర్ లక్షణంగా అనుకోవచ్చు.
ఇటువంటి నొప్పులు వారాలు నెలలు తరబడి వేధిస్తున్నాయా అలాగే నీరసం మంటలు పుడుతున్నట్లు నొప్పులు ఉంటే ఎట్టి పరిస్థితులను నిర్లక్ష్యం చేయకూడదు.. కారణం లేకుండా బరువు తగ్గడం : క్యాన్సర్ చూపిన వ్యక్తులు ఎటువంటి ప్రత్యేక కారణం లేకుండానే బరువు తగ్గుతుంటారు. క్యాన్సర్ తో ఇబ్బంది పడే వ్యక్తులలో కనిపించే తొలి లక్షణం ఇదేనట ప్రధానంగా పెంక్రియాస్, ఆహారవాహిక, ఊధరం ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకితే గణనీయంగా బరువు తగ్గుతారని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ చెప్తున్నారు. ఆహారం మింగడంలో ఇబ్బంది : ఆహారం తీసుకునేటప్పుడు ఆ సౌకర్యం కలిగితే దాన్ని తేలిగ్గా తీసుకురాదు. దీన్ని డిస్ప్లేజియా అని పిలుస్తారు. క్యాన్సర్ రోగులలో మెడలో పెరిగే కనితి వల్ల ఈ పరిస్థితి వస్తుంటుంది.
దీనివలన అన్నవాహిక కుంచుకుపోయి మింగడం ఇబ్బందికరంగా మారుతుంది. గడ్డలు, వాపులు : శరీరంలో అసాధారణ రీతిలో గడ్డలు వాపులు కనిపిస్తే దాన్ని తీవ్రంగా పరిగణించాల్సిందే అన్ని రకాల గడ్డలు క్యాన్సర్ కాకపోవచ్చు. కానీ పెద్దగా గట్టిగా స్పర్శ లేనట్టుగా ఉండే గడ్డలు క్యాన్సర్ సంకేతాలుగా అనుకోవచ్చు. ఇటువంటివి ఎక్కువగా వృషణాలు, రొమ్ములు, మెడ ,చేతులు ,కాళ్ళలో వస్తుంటాయి. విడవని దగ్గు : పలు కారణాలతో దగ్గు వస్తుంది. అంటే వైరల్ ఇన్ఫెక్షన్లు అస్తమా సి ఓ పి డి గ్యాస్ట్రో పగల్ రిప్లెక్స్ దగ్గుకు కారణం అవుతాయి. అయితే అదే పనిగా దగ్గు వస్తుంటే జాగ్రత్త పడాల్సిందే.
ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్ అవ్వచ్చు అని నిపుణుల మాట.. పుట్టుమచ్చలలో మార్పులు : శరీరంపై పుట్టుమచ్చలు ఉండడం సహజం అయితే ఆ పుట్టుమచ్చలు మార్పులు వస్తే శరీరంలో క్యాన్సర్ లక్షణాలని గుర్తించాలి. పుట్టుమచ్చ పరిమాణం రంగు మారితే మెలనుమాకు లక్షణం అవ్వచ్చు. మెలనోమ అంటే ఓ రకమైన చర్మపు క్యాన్సర్. పేగుల కదలికలలో మార్పులు ; బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీసెస్ ప్రకారం ఓ మనిషికి పేగు క్యాన్సర్ సోకితే అనేక సంకేతాలు కనిపిస్తాయి. తరచుగా మలవిసర్జనకు వెళ్లాల్సి రావడం మనం జారిపోతున్నట్లుగా వెలుపలికి రావడం మదంలో రక్తం కనిపించడం లాంటివి ఆ లక్షణాలలో ప్రధానమైనది..