Health Tips : పొట్ట ,నడుము చుట్టు కొవ్వు తగ్గి స్లిమ్ గా అవ్వాలనుకుంటున్నారా.? అయితే ఈ రసం రోజు తాగితే చాలు…!!
Health Tips : బరువు పెరగడం అనేది ఈజీగా పెరుగుతారు. కానీ బరువు తగ్గాలనుకుంటే మాత్రం అస్సలు సాధ్యం అవ్వని పని.. ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. చాలామంది అదిక రక్త పోటు, కొలెస్ట్రాల్, హార్ట్ఎటాక్ లాంటి సమస్యలతో ఎంతో సతమతమవుతున్నారు.. ఆహారపు అలవాట్లను మార్చుకోవడం వలన ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే కొన్ని చిట్కాలను పాటించడం వలన మంచి ఉపయోగం ఉంటుంది.. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. కరివేపాకు జ్యూస్ : కరివేపాకు జ్యూస్ తయారు చేయడానికి ముందుగా కరివేపాకులను కడిగి నీళ్లలో ఉడికించాలి.
కొద్దిసేపు తర్వాత ఈ నీళ్లను వడకట్టి గోరువెచ్చగా తీసుకోవాలి. రుచి కోసం నిమ్మరసం తేనె కూడా కలుపుకోవచ్చు దీనిని పరిగడుపున మాత్రమే తీసుకోవాలి.. ఈ జ్యూస్ కొవ్వు కరిగించడానికి ముఖ్య పాత్ర వహిస్తుంది.. పొట్ట, నడుము చుట్టు పేరుకున్న కొవ్వు కరగాలంటే కరివేపాకు జ్యూస్ తాగాలి. దీనిలో ఉండే ఆల్క లాయిడ్లు సహాయంతో లిపిడ్ ఫ్యాట్ కరుగుతుంది. కరివేపాకు జ్యూస్ తీసుకోవడం వలన గ్లిజరైడ్స్ తగ్గించుకోవచ్చు. దాంతోపాటు బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. కరివేపాకుతో అధిక బరువుకి చేక్ పెట్టవచ్చు.. కరివేపాకు మంచి సువాసన కలిగిన పదార్థం.
దక్షిణాదిన చాలా వంటలలో కరివేపాకును వాడుతుంటారు. ఇది రుచిని పెంచడానికి గొప్పగా ఉపయోగపడుతుంది. అది సమయంలో కరివేపాకుతో శరీరంలో చాలా సమస్యలు కూడా తగ్గిపోతాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. కరివేపాకులో ఉండే పోషకాలు: కరివేపాకులు పోషక పదార్థాలు అధికంగా ఉంటాయి. ఫాస్పరస్, విటమిన్ సి, క్యాల్షియం, ఐరన్ లాంటి న్యూట్రియంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి లాభాన్ని చేకూరుస్తూ ఉంటాయి. ప్రధానంగా కరివేపాకును బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ గా చెప్పడం జరిగింది. కావున కరివేపాకు వినియోగంతో చర్మర సంరక్షణ కేశాలు మీ సొంతం అవుతుంది.. అలాగే అధిక బరువుతో బాధపడే వాళ్ళకి ఈ కరివేపాకు చాలా బాగా సహాయపడుతుంది…