Health Tips : ప్రస్తుతం చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు. జీవనశైలిలో వచ్చిన మార్పుల వలన బరువు పెరగడం నేడు సాధారణ సమస్యగా మారింది. అధిక బరువు కొన్నిసార్లు ఇబ్బంది కూడా కలిగిస్తుంది అంతేకాదు బరువు పెరగడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగించే అనేక సమస్యలు కూడా వస్తాయి. దీని వలన డయాబెటిస్, థైరాయిడ్, గుండె సంబంధిత వ్యాధులు కూడా వస్తాయి. కాబట్టి బరువును కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. చాలామంది బరువు తగ్గించుకోవడానికి వివిధ రకాల ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు. అయిన పెద్దగా ప్రభావం ఉండదు. ఈజీగా బరువు తగ్గాలంటే తినే ఆహారంలో డైట్ మెనూ ఫాలో అవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రతిరోజు ఉదయాన్నే తేలికపాటి ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించాలి. కొంతమంది ఉదయాన్నే పూరీలు, పరోటాలు తినడానికి ఇష్టపడతారు. వాటికి బదులుగా అల్పాహారంలో డ్రై ఫ్రూట్స్ ఎంచుకుంటే అది మీకు పూర్తి పోషకాహారాన్ని అందిస్తుంది. అలాగే బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అధిక బరువుతో బాధపడేవారు ఉదయాన్నే కొవ్వు, కార్బోహైడ్రేట్లు ఉన్న పదార్థాలను తినకూడదు. లేకపోతే బరువు మరింత పెరగడం ప్రారంభమవుతుంది. డ్రైఫ్రూట్స్ తినడం వలన జీవక్రియ పెరుగుతుంది. అలాగే బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.
వాల్ నట్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇది కొవ్వులు కరిగించేందుకు పనిచేస్తుంది. అల్పాహారంలో వాల్ నట్లను తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే అధిక బరువును తగ్గిస్తుంది. ఇది కాకుండా వాల్ నట్లు గుండెజబ్బుల నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. వాల్ నట్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో కొవ్వును తగ్గిస్తాయి. అలాగే ఖర్జూరాలను కూడా అల్పాహారంలో తీసుకోవాలి. ఖర్జూరం బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే విటమిన్ బి కలిగి ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. బరువు తగ్గించడంలో బాగా సహాయపడుతుంది.అలాగే బరువు తగ్గటానికి తప్పనిసరిగా పిస్తాలను తినాలి. పిస్తా పప్పులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీని వలన శరీరంలో శక్తి దిట్టంగా చేరుకుంటుంది. ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తుంది. దీంతో కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఇది కూడా పదేపదే ఆకలిని కలిగించదు. దీన్ని ఉదయం అల్పాహారంలో తప్పనిసరిగా తీసుకోవాలి.
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
This website uses cookies.