Health Tips : బ్రేక్ ఫాస్ట్ లో ఇవి తిన్నారంటే… ఈజీగా బరువు తగ్గుతారు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Tips : బ్రేక్ ఫాస్ట్ లో ఇవి తిన్నారంటే… ఈజీగా బరువు తగ్గుతారు…

Health Tips : ప్రస్తుతం చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు. జీవనశైలిలో వచ్చిన మార్పుల వలన బరువు పెరగడం నేడు సాధారణ సమస్యగా మారింది. అధిక బరువు కొన్నిసార్లు ఇబ్బంది కూడా కలిగిస్తుంది అంతేకాదు బరువు పెరగడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగించే అనేక సమస్యలు కూడా వస్తాయి. దీని వలన డయాబెటిస్, థైరాయిడ్, గుండె సంబంధిత వ్యాధులు కూడా వస్తాయి. కాబట్టి బరువును కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. చాలామంది బరువు తగ్గించుకోవడానికి వివిధ రకాల […]

 Authored By aruna | The Telugu News | Updated on :18 August 2022,7:30 am

Health Tips : ప్రస్తుతం చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు. జీవనశైలిలో వచ్చిన మార్పుల వలన బరువు పెరగడం నేడు సాధారణ సమస్యగా మారింది. అధిక బరువు కొన్నిసార్లు ఇబ్బంది కూడా కలిగిస్తుంది అంతేకాదు బరువు పెరగడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగించే అనేక సమస్యలు కూడా వస్తాయి. దీని వలన డయాబెటిస్, థైరాయిడ్, గుండె సంబంధిత వ్యాధులు కూడా వస్తాయి. కాబట్టి బరువును కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. చాలామంది బరువు తగ్గించుకోవడానికి వివిధ రకాల ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు. అయిన పెద్దగా ప్రభావం ఉండదు. ఈజీగా బరువు తగ్గాలంటే తినే ఆహారంలో డైట్ మెనూ ఫాలో అవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రతిరోజు ఉదయాన్నే తేలికపాటి ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించాలి. కొంతమంది ఉదయాన్నే పూరీలు, పరోటాలు తినడానికి ఇష్టపడతారు. వాటికి బదులుగా అల్పాహారంలో డ్రై ఫ్రూట్స్ ఎంచుకుంటే అది మీకు పూర్తి పోషకాహారాన్ని అందిస్తుంది. అలాగే బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అధిక బరువుతో బాధపడేవారు ఉదయాన్నే కొవ్వు, కార్బోహైడ్రేట్లు ఉన్న పదార్థాలను తినకూడదు. లేకపోతే బరువు మరింత పెరగడం ప్రారంభమవుతుంది. డ్రైఫ్రూట్స్ తినడం వలన జీవక్రియ పెరుగుతుంది. అలాగే బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.

Health Tips eat nuts and dry fruits in breakfast for weight loss

Health Tips eat nuts and dry fruits in breakfast for weight loss

వాల్ నట్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇది కొవ్వులు కరిగించేందుకు పనిచేస్తుంది. అల్పాహారంలో వాల్ నట్లను తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే అధిక బరువును తగ్గిస్తుంది. ఇది కాకుండా వాల్ నట్లు గుండెజబ్బుల నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. వాల్ నట్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో కొవ్వును తగ్గిస్తాయి. అలాగే ఖర్జూరాలను కూడా అల్పాహారంలో తీసుకోవాలి. ఖర్జూరం బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే విటమిన్ బి కలిగి ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. బరువు తగ్గించడంలో బాగా సహాయపడుతుంది.అలాగే బరువు తగ్గటానికి తప్పనిసరిగా పిస్తాలను తినాలి. పిస్తా పప్పులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీని వలన శరీరంలో శక్తి దిట్టంగా చేరుకుంటుంది. ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తుంది. దీంతో కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఇది కూడా పదేపదే ఆకలిని కలిగించదు. దీన్ని ఉదయం అల్పాహారంలో తప్పనిసరిగా తీసుకోవాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది