Health Tips : ఈ 2 రూపాయల కర్పూరంతో ఎన్ని వ్యాధులకు చెక్ పెట్టవచ్చో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…!!
Health Tips : మనం సహజంగా కర్పూరం అంటే దేవుడు పూజకు వాడుతూ ఉంటాం. అయితే ఈ కర్పూరంలో ఎన్నో వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. అని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.. పూజలో వాడే కర్పూరాన్ని ఆయుర్వేదంలో ఔషధంగా కూడా వాడుతూ ఉంటారు. ఎందుకనగా కర్పుపురంలో ఎన్నో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి.. మన హిందూ సాంప్రదాయాలలో రోజు పూజలలో వంటలలో వాడే పదార్థాలు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో మనకి తెలిసే ఉంటుంది. అయితే వాటి ప్రయోజనాల గురించి తెలిసే వాటిని పవిత్రంగా భావిస్తుంటారు. మన పూర్వీకులు అలాంటి పదార్థాలు వస్తువులలో కర్పూరం కూడా ఒకటి. దీనిని అధికంగా దేవుడికి హారతి ఇవ్వడానికి వాడుతూ ఉంటారు.
పూజలో వాడే ఈ కర్పూరాన్ని ఆయుర్వేదంలో ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. ఈ కర్పూరంలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. రెండు రూపాయలకే లభించే సహజ కర్పూరం శరీరంలో ఎన్నో సమస్యలను దూరం చేయడంతో పాటు ఎన్నో ఆరోగ్య ఉపయోగాలను కూడా కలగిస్తుంది. ఈ కర్పూరం ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. దాని వాసన పరిమళం మనసుకి మనశ్శాంతిని చేకూరుస్తుంది. ఈ కర్పూరంతో ఎన్నో సమస్యలకి చెక్ పెట్టవచ్చు. ఆ సమస్యలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… కర్పూరం వలన కలిగే ఉపయోగాలు: *పాదాలలో నొప్పి వాపు సమస్య ఉంటే కర్పూరంలో నూనె కలిపి మసాజ్ చేసుకోవడం వలన మంచి ఉపశమనం కలుగుతుంది.
*వేడి నీటిలో కర్పూరం వేసి ఆవిరి పెట్టడం వల్ల జలుబు తగ్గుతుంది. *ప్రస్తుత రోజులలో జుట్టు ఊడిపోతుంది. ఈ సమస్యకు కర్పూరంతో చెక్ పెట్టవచ్చు. ఇబ్బంది పడేవాళ్లు కొబ్బరి నూనెలో కర్పూరం కలిపి రాసుకుంటే ఎంతో ఉపయోగం ఉంటుంది. *కర్పూరంతో కూడిన భామ్ ను అప్లై చేస్తే మెడ నొప్పి క్షణాల్లో తగ్గిపోతుంది. *ఆర్థరైటిస్ నొప్పి నుండి ఉపశమనం కలపడానికి కర్పూరం మిశ్రమాన్ని లేపినంగా వాడుతుంటారు. *బ్లడ్ సర్కులేషన్స్ మెరుగుపరచడంలో కర్పూరం నూనె గొప్పగా ఉపయోగపడుతుంది.. *మొహంపై మచ్చలు, మొటిమలు ఏదైనా ఉంటే దాన్ని కర్పూరంతో తొలగించుకోవచ్చు. కొబ్బరి నూనెలో కర్పూరం కలిపి ముఖానికి అప్లై చేస్తే మచ్చలు పోతాయి. *సొంటి, అర్జున బెరడు తెల్లచందనంతో కలిపి కర్పూరం అప్లై చేస్తే తలనొప్పి తగ్గుతుంది.