మామిడి పండు వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే మీరు అస్సలు వదలరు…!
Advertisement
Advertisement
ఎండాకాలం వచ్చిందంటే చాలు ముందుగా నోరూరించే పండు ఏంటో తెలుసా ! అదేనండి.. మన పండ్లలో రాజైన మన మామిడి పండు. ఈ పండుని ఇష్టపడని వారు ఉంటారా? ఏ సీజన్ లో లభించే పండు ఆ సీజన్ లో తప్పనిసరిగా తినాల్సిందే. సీజన్ వెల్లిపొయాకా ఎప్పుడు కావాలంటే అప్పుడు లభించవు. కాబట్టి తప్పనిసరిగా తినండి. వేడి అని.. గడ్డలు వస్తాయని తినడం మానేయకండి. మరీ ఎక్కువగా కాకుండా తక్కువగా తినండి, ముఖ్యంగా మామిడి పండునైతే అసలు వదలకండి. ఎందుకంటే ఈ పండు వల్ల మన శరీరానికి ఎన్ని ఉపయోగాలో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే.
Advertisement
మామిడి పండు వలన ఉపయెగాలు
mango health benefits
మామిడి పండ్ల వల్ల చర్మసౌందర్యం పెరుగుతుంది.
మామిడి పండును స్కిన్ మాస్క్ లా ముఖానికి రాసుకుంటే మొటిమల మంట తగ్గుతుంది.
ఈ పండు తో చర్మం పైన ఉన్న ముడతలను, నల్లమచ్చలను తొలగించడానికి ఉపయెగపడుతుంది.
ఈ పండు తినడం వలన అధికంగా మెగ్నిషియం లభిస్తుంది. అంతే కాదు చర్మంపైన ఉన్న జిడ్డుని మొటిమలని కూడా తొలగిస్తుంది.
మామిడి పండు లో విటమిన్-C ఎక్కువగా ఉంటుంది. పైబర్ కూడా ఉండటం వలన శరీరానికి హాని చేసే చెడు కొలస్ట్రాల్ ని తగ్గిస్తుంది.
ఈ పండు లో పొటాషియం, మెగ్నీషియం ఉండటం వల్ల అధిక రక్తపోటు నుంచి రక్షిస్తుంది.
మామిడి పండులో కాపర్ ఉండటం వల్ల ఎర్ర రక్తకణాలు వృధ్ధిచెందుతాయి.
ఈ పండు లో విటమిన్- C , విటమిన్ -A , విటమిన్ -B6, విటమిన్- K, ప్రోటిన్, పైబర్, పోలిక్ యాసిడ్, మెగ్నీషియం ఉంటాయి. వీటి వలన ఊబకాయం, మదుమేహం, గుండె జబ్బులు వంటివి దరిచేరవు.
ఈ పండు లో బిటాకెరోటిన్ అనే పదార్థం ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది, కాబట్టి కరోనాని కూడా రాకుండా అడ్డుకోనేందుకు మామిడి పండు ఎంతో దోహదపడుతుంది.
మామిడి పండు తినడం వల్ల శృంగార వాంఛలు పెరుగుతాయి.
సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల నుండి మన చర్మాన్ని కాపాడుకోవడానికి కూడా మామిడి పండు ఉపయోగపడుతుంది.
పంటి సమస్యలు ఉంటే తప్పనిసరిగా మామిడి పండును తినాలి. పంటి నుండి వచ్చే రక్తస్రావాన్ని ఇది తగ్గిస్తుంది, అంతే కాదు దంతాల మధ్య ఉన్న బ్యాక్టీరియాను కూడా ఇది నశింపచేస్తుంది. అలాగే.. దంతాల పైన వున్న ఎనామిల్ ని బలోపేతం చేస్తుంది.
మామిడి పండు వల్ల జుట్టు ఒత్తుగా ఆరోగ్యంగా, బలంగా పెరుగుతుంది.