Garlic : వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Garlic : వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు..!

 Authored By maheshb | The Telugu News | Updated on :19 May 2021,7:00 am

Garlic : భారతీయులు వెల్లుల్లి Garlic ని ఎంతో పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. వెల్లుల్లి Garlicలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. దీన్ని నిత్యం వంటల్లో వేస్తారు. దీంతో వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే వెల్లుల్లి వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. రోజూ వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

garlic health benefits

1. వెల్లుల్లిలో మన శరీరానికి అవసరం అయ్యే అనేక పోషకాలు ఉంటాయి. విటమిన్లు బి1, బి2, బి3, బి6, విటమిన్‌ సి, కాల్షియం, ఫోలేట్, ఐరన్‌, మెగ్నిషియం, మాంగనీస్‌, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్‌లు ఉంటాయి. ఇవి మనకు పోషణను అందిస్తాయి.

2. వెల్లుల్లిని రోజూ తీసుకోవడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి.

3. దగ్గు, జలుబు, ఫ్లూ సమస్యలతో బాధపడేవారు రోజూ వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంతో ఆయా సమస్యల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

4. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు ఉంటాయి. అందువల్ల శరీరంలోని కొలెస్ట్రాల్‌ స్థాయిలు, హైబీపీ తగ్గుతాయి. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.

5. వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో చేరే సూక్ష్మ క్రిములను నాశనం చేస్తాయి.

6. వెల్లుల్లిని రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల క్యాన్సర్లు రావు. ముఖ్యంగా పెద్ద పేగు క్యాన్సర్‌ రాదని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది.

7. వెల్లుల్లిలో ఉండే ఔషధ గుణాలు ఫ్రీ ర్యాడికల్స్‌ బారి నుంచి చర్మాన్ని, వెంట్రుకలను రక్షిస్తాయి. దీని వల్ల శిరోజాలు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి.

ఆస్తమా ఉన్నవారు వెల్లుల్లిని తినరాదు. అలాగే శస్త్ర చికిత్సలు చేయించుకోబోయే వారు వెల్లుల్లిని తీసుకోరాదు. రోజూ 2-3 వెల్లుల్లి రెబ్బలను తినవచ్చు. అధికంగా తీసుకోరాదు.

Advertisement
WhatsApp Group Join Now

maheshb

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది