మామిడి పండు వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే మీరు అస్సలు వదలరు…!
ఎండాకాలం వచ్చిందంటే చాలు ముందుగా నోరూరించే పండు ఏంటో తెలుసా ! అదేనండి.. మన పండ్లలో రాజైన మన మామిడి పండు. ఈ పండుని ఇష్టపడని వారు ఉంటారా? ఏ సీజన్ లో లభించే పండు ఆ సీజన్ లో తప్పనిసరిగా తినాల్సిందే. సీజన్ వెల్లిపొయాకా ఎప్పుడు కావాలంటే అప్పుడు లభించవు. కాబట్టి తప్పనిసరిగా తినండి. వేడి అని.. గడ్డలు వస్తాయని తినడం మానేయకండి. మరీ ఎక్కువగా కాకుండా తక్కువగా తినండి, ముఖ్యంగా మామిడి పండునైతే అసలు వదలకండి. ఎందుకంటే ఈ పండు వల్ల మన శరీరానికి ఎన్ని ఉపయోగాలో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే.
మామిడి పండు వలన ఉపయెగాలు
- మామిడి పండ్ల వల్ల చర్మసౌందర్యం పెరుగుతుంది.
- మామిడి పండును స్కిన్ మాస్క్ లా ముఖానికి రాసుకుంటే మొటిమల మంట తగ్గుతుంది.
- ఈ పండు తో చర్మం పైన ఉన్న ముడతలను, నల్లమచ్చలను తొలగించడానికి ఉపయెగపడుతుంది.
- ఈ పండు తినడం వలన అధికంగా మెగ్నిషియం లభిస్తుంది. అంతే కాదు చర్మంపైన ఉన్న జిడ్డుని మొటిమలని కూడా తొలగిస్తుంది.
- మామిడి పండు లో విటమిన్-C ఎక్కువగా ఉంటుంది. పైబర్ కూడా ఉండటం వలన శరీరానికి హాని చేసే చెడు కొలస్ట్రాల్ ని తగ్గిస్తుంది.
- ఈ పండు లో పొటాషియం, మెగ్నీషియం ఉండటం వల్ల అధిక రక్తపోటు నుంచి రక్షిస్తుంది.
- మామిడి పండులో కాపర్ ఉండటం వల్ల ఎర్ర రక్తకణాలు వృధ్ధిచెందుతాయి.
- ఈ పండు లో విటమిన్- C , విటమిన్ -A , విటమిన్ -B6, విటమిన్- K, ప్రోటిన్, పైబర్, పోలిక్ యాసిడ్, మెగ్నీషియం ఉంటాయి. వీటి వలన ఊబకాయం, మదుమేహం, గుండె జబ్బులు వంటివి దరిచేరవు.
- ఈ పండు లో బిటాకెరోటిన్ అనే పదార్థం ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది, కాబట్టి కరోనాని కూడా రాకుండా అడ్డుకోనేందుకు మామిడి పండు ఎంతో దోహదపడుతుంది.
- మామిడి పండు తినడం వల్ల శృంగార వాంఛలు పెరుగుతాయి.
- సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల నుండి మన చర్మాన్ని కాపాడుకోవడానికి కూడా మామిడి పండు ఉపయోగపడుతుంది.
- పంటి సమస్యలు ఉంటే తప్పనిసరిగా మామిడి పండును తినాలి. పంటి నుండి వచ్చే రక్తస్రావాన్ని ఇది తగ్గిస్తుంది, అంతే కాదు దంతాల మధ్య ఉన్న బ్యాక్టీరియాను కూడా ఇది నశింపచేస్తుంది. అలాగే.. దంతాల పైన వున్న ఎనామిల్ ని బలోపేతం చేస్తుంది.
- మామిడి పండు వల్ల జుట్టు ఒత్తుగా ఆరోగ్యంగా, బలంగా పెరుగుతుంది.