Healthy Lungs : ఊపిరితిత్తులు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి.. ఏం తినాలో తెలుసుకోండి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Healthy Lungs : ఊపిరితిత్తులు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి.. ఏం తినాలో తెలుసుకోండి..!

 Authored By jagadesh | The Telugu News | Updated on :19 May 2021,6:40 pm

Healthy Lungs : ప్రస్తుతం ఎక్కడ చూసినా ఊపిరితిత్తుల గురించే చర్చ. నిజానికి.. మానవ శరీరంలో ఊపిరితిత్తులకు చాలా వాల్యూ ఉంటుంది. శరీరంలోని ప్రతి అవయవం విలువైనదే. కానీ.. ఊపిరితిత్తులకు ఏమాత్రం చిన్న సమస్య వచ్చినా.. చిన్నపాటి ఇన్ ఫెక్షన్ వచ్చినా.. శ్వాసకు సంబంధించిన సమస్యలు రావడం, విపరీతంగా దగ్గురావడం జరుగుతుంది. శ్వాసకు సంబంధించిన సమస్యలు వస్తే.. వెంటనే ఆక్సిజన్ ను అందించాల్సి ఉంటుంది. అటువంటి సమయంలో సరిపడా ఆక్సిజన్ అందుబాటులో లేకపోతే ఇక అంతే.. మనిషి ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం కరోనా వల్ల ఎక్కువగా సమస్యల్లో చిక్కుకునేది ఊపిరితిత్తులే. కరోనా కొత్త స్ట్రెయిన్ డైరెక్ట్ గా లంగ్స్ మీద ప్రభావం చూపిస్తోంది. దీంతో శ్వాస సమస్యలు, ఇతర సమస్యలు వస్తున్నాయి. అందుకే.. కరోనా రాకుండా మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామో.. ఊపిరితిత్తులను కూడా అంతే ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అప్పుడే ఈ మహమ్మారి నుంచి బయటపడగలుగుతాం.

how to keep lungs healthy tips telugu

how to keep lungs healthy tips telugu

మనిషి వయసు పెరుగుతున్నా కొద్దీ.. ఊపిరితిత్తుల సామర్థ్యం కూడా తగ్గుతుంటుంది. అందుకే.. ఊపిరితిత్తులు వాటికి కావాల్సినంత ఆక్సిజన్ లేవల్స్ ను మెయిన్ టెన్ చేయలేవు. దాని వల్ల ఆక్సిజన్ లేవల్స్ సమస్య ఉత్పన్నమవుతుంది. అలాగే.. శ్వాస సంబంధ సమస్యలు ఉత్పన్నమవుతాయి. నిజానికి.. ఊపిరితిత్తులను ప్రతి రోజూ సంరక్షించుకుంటూ ఉండాలి. అప్పుడే ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయగలుగుతాయి. ఎప్పుడైతే మనకు శ్వాసకు సంబంధించిన సమస్యలు వస్తాయో.. లంగ్స్ లో ఇన్ఫెక్షన్ వస్తుందో అప్పుడే ఊపిరితిత్తుల విలువ మనకు తెలుస్తుందట. ఏది ఏమైనా.. ప్రస్తుతం కరోనా మహమ్మారి కూడా లంగ్స్ ప్రాధాన్యతను తెలియజెప్పింది. అందుకే.. ప్రతి ఒక్కరు ఊపిరితిత్తులను మంచిగా కాపాడుకోవాలి. దాని కోసం ఏం చేయాలి? ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి? ఎటువంటి వ్యాయామాలు చేయాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Healthy Lungs : మన శరీరాన్ని శుభ్రం చేసుకున్నట్టే.. లంగ్స్ ను కూడా క్లీన్ చేస్తూ ఉండాలి

మనం రోజూ స్నానం చేస్తాం. శరీరాన్న శుభ్రంగా ఉంచుకుంటాం. అలాగే.. మన ఊపిరితిత్తులను కూడా అంతే క్లీన్ గా ఉంచుకోవాలి. అంటే.. కలుషితమైన గాలిని పీల్చుకుండా ఉండటం, సిగరేట్ పొగకు దూరంగా ఉండటం, శరీరంలో ఉండే ఇతర విష పదార్థాలను లేకుండా చేసుకోవడం, వాతావరణంలో ఉండే దుమ్ము, దూళి.. ఇలా వీటన్నింటికీ దూరంగా ఉండగలిగితే.. లంగ్స్ వాటంతట అవే క్లీన్ అవుతాయి. అలాగే.. ఊపిరితిత్తులు ఎప్పుడూ క్లీన్ గా, ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ బ్రీతింగ్ వ్యాయామాలు చేయాల్సిందే. అవేంటంటే..

Diaphragmatic breathing  – డయాఫ్రగ్మాటిక్ బ్రీతింగ్

డయాఫ్రగ్మాటిక్ బ్రీతింగ్ అంటే.. ముక్కు ద్వారా గాలిని లోపలికి వీలైనంత పీల్చి.. మళ్లీ వదలడం అన్నమాట. ఇలా రోజూ ఓ ఐదు నిమిషాల పాటు ఉదయాన్నే చేస్తే.. లంగ్స్ ఆరోగ్యంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బ్రీతింగ్ వ్యాయామాల్లో ఇదీ ఒకటి. దీని కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరమే లేదు. ప్రశాంతంగా కూర్చొని.. డీప్ గా శ్వాస పీల్చుకొని వదిలేయడమే. దాని వల్ల స్వచ్ఛమైన గాలి.. ఊపిరితిత్తుల వరకు వెళ్లి.. ఊపిరితిత్తులను క్లీన్ చేస్తుంది.

Deep breathing exercises – డీప్ బ్రీతింగ్ వ్యాయామాలు

రోజూ ఉదయం లేవగానే.. ఓ 20 నిమిషాల పాటు డీప్ బ్రీతింగ్ వ్యాయామాలు చేయాల్సిందే. డీప్ బ్రీతింగ్ వ్యాయామాల్లో ప్రధానమైనవి… ప్రాణాయామం, కపలవర్తి, అనులోమ్ విలోమ్.. ఇవి… యోగాసనాలు. ఇవి ప్రతి రోజు క్రమం తప్పకుండా వేస్తూ ఉండాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే ఖచ్చితంగా ఊపిరితిత్తులు క్లీన్ అవ్వడంతో పాటు ఆరోగ్యంగా ఉంటాయి.

Balloon Breathing – బెలూన్ బ్రీతింగ్

మనలో చాలామందికి తెలియని వ్యాయామం ఇది. అదే బెలూన్స్ ఊదడం. బెలూన్స్ ఊదడం అనేది లంగ్స్ కు మంచి వ్యాయామం అట. రీసెర్చర్స్ దీన్ని అప్రూవ్ కూడా చేశారు. బెలూన్స్ గట్టిగా ఊదడం కోసం.. మనం గాలిని వేగంగా పీల్చుకొని మళ్లీ బెలూన్ లోకి వదలాల్సి ఉంటుంది. దీని వల్ల మనకు తెలియకుండానే మన ఊపిరితిత్తులకు వ్యాయామం జరుగుతుంది.

Food – ఆహారం

ఫుడ్ అలవాట్లు అనేవి చాలా ముఖ్యం. ఏ ఫుడ్ తింటున్నామనేది చాలా ముఖ్యం. మన జీవన విధానం మారాలి. మన ఆహార అలవాట్లు మారాలి. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ లాంటి వాటి జోలికి పోకుండా.. ఎక్కువగా పండ్లు, కూరగాయలు తీసుకుంటే.. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. కివీ పండ్లు, యాపిల్స్, నిమ్మకాయ, మామిడి, పాలకూర, క్యాబేజీ, బెర్రీ పండ్లు.. ఎక్కువగా తీసుకుంటే.. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండటంతో పాటు.. శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అంటే.. విటమిన్ సీ ఎక్కువగా ఉండే ఫుడ్ తో పాటు లైసోపీన్ ఎక్కువగా ఉండే టమాటాలు, కెరటోనాయిడ్స్ ఎక్కువగా ఉండే క్యారెట్స్, పాలకూర, మిరియాలు, ఆంథోకియానిన్స్ ఎక్కువగా ఉండే బెర్రీ పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. దీని వల్ల లంగ్స్ కెపాసిటీ కూడా పెరుగుతుంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది