Health Tips : ఏ వ్యక్తికి అయితే తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య మెలకువ వస్తుందో వారికి జరిగేది ఇదే… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Tips : ఏ వ్యక్తికి అయితే తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య మెలకువ వస్తుందో వారికి జరిగేది ఇదే…

Health Tips : మనిషి కి నిద్ర సరిగ్గా లేకపోతే ఆ వ్యక్తి చాలా బలహీనంగా ఉంటాడు. రోగాలు చుట్టూ ముడతాయి. ఎప్పుడు నీరసంగా ఉంటూ ఏ పని మీద ధ్యాస ఉండకుండా ఉంటాడు. ఒక మనిషి రోజులో కనీసం ఆరు నుంచి ఏడు గంటలు నిద్రపోతే చాలా ఆరోగ్యంగా ఉంటారుఅనేది డాక్టర్లు చెప్పే మాట. నిద్ర మనిషిని శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. మన మెదడు అభివృద్ధికి మరియు జీవితంలో విజయం సాధించడానికి […]

 Authored By aruna | The Telugu News | Updated on :5 August 2023,8:00 am

Health Tips : మనిషి కి నిద్ర సరిగ్గా లేకపోతే ఆ వ్యక్తి చాలా బలహీనంగా ఉంటాడు. రోగాలు చుట్టూ ముడతాయి. ఎప్పుడు నీరసంగా ఉంటూ ఏ పని మీద ధ్యాస ఉండకుండా ఉంటాడు. ఒక మనిషి రోజులో కనీసం ఆరు నుంచి ఏడు గంటలు నిద్రపోతే చాలా ఆరోగ్యంగా ఉంటారుఅనేది డాక్టర్లు చెప్పే మాట. నిద్ర మనిషిని శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. మన మెదడు అభివృద్ధికి మరియు జీవితంలో విజయం సాధించడానికి మంచి నిద్ర అవసరం. రాత్రి ప్రథమార్గంలో నిద్రపోయి బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలని పురాణాల్లో చెప్పబడింది. అంటే రాత్రి 7 9 గంటల సమయంలో బ్రహ్మ ముహూర్తం అంటే 3 నుంచి 5 గంటల మధ్యలో అన్నమాట కానీ ఆధునిక జీవనశైలి వల్ల అది సాధ్యం కావడం లేదు. ఒకవేళ ఎవరైనా త్వరగా నిద్రపోవాలనుకున్న సోషల్ మీడియా లాంటిది అతని నిద్రపోనివ్వవు. నిద్ర లేకపోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.

ప్రతిరోజు ఒక నిర్దిష్ట సమయంలో నిద్ర పోవాలి. దీనిని అస్సలు అలెక్షన్ చేయకూడదు. మనిషి నిద్రలో ఏదైనా కలను చూసిన ఆ కలకి కచ్చితంగా ఎంతో కొంత అర్థం ఉంటుందని చెప్పబడింది. కొంత మంది సరిగా నిద్రపోరు ఒకవేళ నిద్ర పోయినా ఎక్కువ సేపు నిద్రపోలేరు. ఒకవేళ నిద్ర పోయినా కూడా ఉలిక్కిపడి లేస్తూ ఉంటారు. ఒకసారి నిద్రపోతే మళ్లీ మనకు నిద్ర అంత త్వరగా రాదు. సరైన సమయం తెల్లవారుజామున 3 నుండి 5 గంటల మధ్య ఉండే సమయాన్ని అమృత ఘడియ అంటారు. కాబట్టి మీ జీవితం గురించి తెలిసిన మిమ్మల్ని సంప్రదించడానికి ఏదో ఒక అదృశ్య శక్తి ప్రయత్నించే అవకాశం ఉంది. ఈ తెలియని శక్తి ఎల్లప్పుడూ మిమ్మల్ని అప్రమత్తంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది.

Health Tips wakes up between 3 am and 5 am

Health Tips wakes up between 3 am and 5 am

ఇది మీ జీవితంలో రాబోయే పెద్ద మార్పును సూచిస్తుంది. జీవితంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతుంది. రాబోయే మార్పులను ఎదురుకోవడానికి సిద్ధంగా ఉందాం.. తెల్లవారుజామున 3, 5 గంటల మధ్య మీరు నిద్ర లేస్తుంటే మాత్రం మీ ఇంటిలో సంపద వృత్తి చెందుతుంది. మీ ఇంట్లో ఆనందం రాబోతుంది అని అర్థం. తెల్లవారుజామున నిద్ర లేవడం మనసుకు మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది.లక్ష్మి దేవి మీ ఇంటికి వచ్చేలా ఇంటి ప్రాంగణాన్ని సరిగ్గా శుభ్రం చేయండి.

ఉదయం లేచిన తర్వాత ముందుగా భగవంతుని నామస్మరణ చేసి కృతజ్ఞతలు చెప్పాలి. అలాగే భూమిపై అడుగుపెట్టే ముందు భూమాతను ప్రార్థించండి. ఈ విధంగా రోజు నిద్ర లేవగానే దేవుని ప్రార్థిస్తే మీ ఇంట్లో ఆనందం మరియు సంతోషం ఎప్పుడూ ఉంటుంది. సరైన నిద్ర మనిషిని పూర్తి ఆరోగ్యవంతుడిని చేస్తుంది. అంతేకాదు ఆరోగ్యం ఉంటేనే వారు చాలా చురుగ్గా పనిచేస్తారు. ఆ తర్వాత సంపద కూడా వారి దగ్గరకు వస్తుంది.

Tags :

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది