Healthy Ice Cream : హెల్ది ఐస్ క్రీమ్ ని షుగర్ లేకుండా ఎప్పుడైనా తిన్నారా… ఇలా ట్రై చేయండి…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Healthy Ice Cream : హెల్ది ఐస్ క్రీమ్ ని షుగర్ లేకుండా ఎప్పుడైనా తిన్నారా… ఇలా ట్రై చేయండి…?

 Authored By ramu | The Telugu News | Updated on :17 March 2025,8:00 am

ప్రధానాంశాలు:

  •  Healthy Ice Cream : హెల్ది ఐస్ క్రీమ్ ని షుగర్ లేకుండా ఎప్పుడైనా తిన్నారా... ఇలా ట్రై చేయండి...?

Healthy Ice Cream : ఎండాకాలం వచ్చిందంటే చల్ల చల్లగా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. అయితే,ప్రస్తుత కాలంలో ఐస్ క్రీమ్ లో కూడా కల్తీ ఉంటుంది. స్వచ్ఛమైన ఎటువంటి హానికర రసాయనాలను ఉపయోగించకుండా స్క్రీన్ ని ఇంట్లో ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చు. అలాగే చక్కెరను కూడా అస్సలు వాడుకోకుండా ఐస్ క్రీమ్ ని తయారు చేయవచ్చు. క్రీమీ పుచ్చకాయ డ్రై ఫ్రూట్ తో తయారుచేస్తారు. ఈ ఐస్క్రీమ్ ఎంతో రుచిని, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే సమ్మర్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ ని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎవ్వరైనా సరే ఇష్టంగా తింటారు. ఐస్ క్రీములు ఎక్కువగా తిన్న ఏదైనా సమస్యలు వస్తాయేమో అని భయాందోళనకు గురవుతుంటాం. ఐస్ క్రీమ్ తినాలనుకునే వారికి ఆ కోరికను చంపుకోవాలంటే చాలా కష్టం . నా పిల్లలు ఐస్క్రీమ్ ని చూస్తే మారం చేస్తారు. వారికి తప్పనిసరిగా మార్కెట్లో దొరికే ఏదో ఒక ఐస్క్రీం తెచ్చి ఇవ్వందే వారిని ఓదార్చలేము.

Healthy Ice Cream హెల్ది ఐస్ క్రీమ్ ని షుగర్ లేకుండా ఎప్పుడైనా తిన్నారా ఇలా ట్రై చేయండి

Healthy Ice Cream : హెల్ది ఐస్ క్రీమ్ ని షుగర్ లేకుండా ఎప్పుడైనా తిన్నారా… ఇలా ట్రై చేయండి…?

అలా కాకుండా మనం తేలిక ఇంట్లోనే కళ్ళముందే హెల్తి ఐస్ క్రీమ్ తయారు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. కూడా షుగరు లేకుండా చేసుకుంటే ఇంకా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పుచ్చకాయ, డ్రై ఫ్రూట్స్ వంటి వాటితోనే, తేలిగ్గా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇది ఎంతో రుచిగా కూడా ఉంటుంది. సోషల్ మీడియాలో కొందరు దుండగులు ఐస్ క్రీమ్ ను కల్తీగా తయారు చేస్తున్న వీడియోలు కొన్ని మనం చూసాం.. ఆ వీడియో ఎంతో వైరల్ అయింది. అది చూశాక ఐస్ క్రీమ్ కొని తినాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు ప్రజలు. వంటి పరిస్థితుల్లో ఐస్ క్రీమ్ ని బయట కొని తేవడం కంటే, లోనే అప్పటికప్పుడు తాజా ఐస్ క్రీమ్ ను తయారు చేసుకొని తింటే ఉత్తమం. ఐస్ క్రీమ్ ప్రియులు ఇంకా ఆలస్యం చేయరాదు. వెంటనే చక్కెర లేని ఐస్ క్రీమ్ ని తయారు చేసుకునేందుకు, పుచ్చకాయ ఐస్ క్రీమ్, డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో తీసుకుందాం…

Healthy Ice Cream పుచ్చకాయ ఐస్ క్రీం

కావలసిన పదార్థాలు :
. పుచ్చకాయ ఒకటి.
. నిమ్మరసం ఒకటి.
. తేనె మూడు టేబుల్ స్పూన్లు.

ఐస్ క్రీమ్ తయారీ విధానం

– పుచ్చకాయ ఐస్ క్రీంను తయారు చేయుటకు ముందుగా ఒక పుచ్చకాయని తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి.
– వాత ఆ పుచ్చకాయ ముక్కల్లో ఉండే గింజలను తీసేసి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి.
– ఈ మిక్సీ జార్ లో నిమ్మరసం. నేనే వేసి జ్యూస్ చేయాలి.
– ఆ ద్రావణాన్ని ఐస్ క్రీమ్ మౌల్డ్ లో లేదా మీ ఇంట్లో ఉండే చిన్న గ్లాసుల వేసుకొని గాలి లోపలికి వెళ్లకుండా మూత బిగించండి.
– వీటిని డీప్ ఫ్రిజ్లో పెట్టి ఒక 10 గంటల పాటు ఉంచండి.
అంతే ఇక మీకు కావాల్సిన హెల్తి అండ్ టేస్టీ ఐస్ క్రీమ్ రెడీ అయినట్లే.
డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్ (Dry Fruits Icecream) :
కావలసిన పదార్థాలు:
– బాదంపప్పు ఒక కప్పు.
– జీడిపప్పు ఒక కప్పు.
– ఫూల్ మఖాన ఒక కప్పు.
– ఖర్జూరం 10 నుంచి 15.
– కోక్ పౌడర్ అరకప్పు.
– వెన్నెల ఎసెన్స్ అర టీ స్పూన్.
– పాలు ఒక కప్పు.
– వేడి నీళ్లు.

డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ తయారీ విధానం :
. డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడానికి ముందు ఒక మిక్సీ జార్ ని తీసుకోవాలి.
. మిక్సీ జార్ లో బాదంపప్పులు, జీడిపప్పులు, మఖాన వెయ్యండి. దీనిలో అవి మునిగేంత వరకు వేడి నీళ్లు పోసుకుని పక్కకు పెట్టుకోండి.
. అరగంటసేపు వీటిని నానబెట్టి తర్వాత మిక్సీ జార్ లోకి వెయ్యాలి.
. ఈ మిక్సీ జార్ లో ఖర్జూరాలు లేకోకుండా తీసి వేయాలి. కోక్ పౌడర్, వెన్నెల ఎసెన్స్ తో పాటు, కప్పు పాలను పోసి చిక్కటి పేస్టులా అయ్యే విధంగా మిక్సీ పట్టుకోవాలి.
. ఈ మిశ్రమాన్ని ఒక గ్లాస్ కంటైనర్ లో గాని లేదా ఐస్ క్రీమ్ మౌల్డ్స్ లో గాని వేసి మూత గట్టిగా బిగించండి.
. రెడ్డి ఫ్రిజ్లో 8 నుంచి 10 గంటల పాటు ఉంచాలి.
ఆ తరువాత దాన్ని తీసి చూశారంటే. హెల్దీ అండ్ టేస్టీ డ్రైఫ్రూట్ ఐస్ క్రీమ్ రెడీ అయినట్లే.
మీ కుటుంబ సభ్యులతో ఎటువంటి ఆందోళన, ఎటువంటి అనారోగ్య సమస్యలు కలగకుండా భయం లేకుండా ఐస్ క్రీమ్ ని ఆనందంతో ఆస్వాదిస్తూ తినొచ్చు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది