Hearing Problem : మీలో వినికిడి శక్తి రోజురోజుకు తగ్గుతూ వస్తుందా… నివారణ చర్యలు ఏంటో తెలుసుకోండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hearing Problem : మీలో వినికిడి శక్తి రోజురోజుకు తగ్గుతూ వస్తుందా… నివారణ చర్యలు ఏంటో తెలుసుకోండి…!

 Authored By ramu | The Telugu News | Updated on :17 August 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Hearing Problem : మీలో వినికిడి శక్తి రోజురోజుకు తగ్గుతూ వస్తుందా... నివారణ చర్యలు ఏంటో తెలుసుకోండి...!

Hearing Problem : వినికిడి లోపం అనేది కొందరికి పుట్టినప్పుడు నుండి ఉండవచ్చు లేక కాలక్రమైన ఎప్పుడైనా వినికిడి బారిన పడవచ్చు. అయితే ఈ వినికిడి సమస్యని వాడుకు భాషలో చెముడు అని కూడా అంటారు. ఈ వినికిడి లోపం అనేది వ్యక్తి నుండి మరొక వ్యక్తికి కూడా మారవచ్చు. అలాగే లక్షణాలు మరియు వాటి ప్రభావాలు కూడా మారవచ్చు. అయితే మన భారతదేశంలో 18 ఏళ్లు లేక అంతకన్నా ఎక్కువ వయసు ఉన్నటువంటి ఆరుగురులో ఒకరికి వినికిడి లోపం ఉన్నట్లు నిపుణులు తెలిపారు. అయితే వయసు రీత్యా వినికిడి శక్తి అనేది తగ్గిపోవడమే కాక వినికిడి సమస్యకు మరొక ప్రధాన కారణం కూడా ఉంది. అదే పెద్ద పెద్ద శబ్దాలను వినడం. మీకు రోజురోజుకి వినికిడి శక్తి అనేది తగ్గుతుందా అయితే ఏం చేయాలో తెలుసుకోండి…

మన చుట్టూ పెద్ద శబ్దాలు మరియు కారు హారన్ల నుండి వాహనాలు చేసే శబ్దాలు లేక డీజే లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ శబ్ద కాలుష్యానికి కారణం అవుతాయి. అలాగే ఎక్కువసేపు భారీ శబ్దలకు గురికావడం కూడా వినికిడి పై ప్రభావం పడుతుంది. మరొక వైపు వయసు రీత్య కూడా మనిషిలో వినికిడి శక్తి అనేది తగ్గిపోతూ వస్తుంది. ఎవరైనా సరే 85 డేసి బుల్స్ కన్నా ఎక్కువ శబ్దాన్ని ఎక్కువసేపు వినట్లయితే వినికిడి లోపం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే హారన్ నాయిస్ నైట్ క్లబ్ లేక ఎక్కడైనా ప్లే చేస్తున్నటువంటి స్ట్రింగ్ బాక్స్ మరియు కిచెన్ మిక్సర్ సౌండ్ 19 నుంచి 120 డేసిబుల్స్ వరకు ఉండవచ్చు. కాబట్టి అలాంటి శబ్దలను ఎక్కువ కాలం వినడం వల్ల వినికిడి లోపం అనేది వస్తుంది. అయితే చాలామంది కాటన్ బడ్స్ మరియు హెయిర్ క్లిప్ లు సేఫ్టీ ఫిన్స్ తో చెవులను క్లీన్ చేసుకుంటూ ఉంటారు. అయితే విపరీతమైన చెవి కుట్లు కూడా వీటికి ప్రాణాంతకం కావచ్చు. ఇలా చేయడం వల్ల చెవి పోటు బారిన పడే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాక శరీర సమతుల్యతను రక్షించుకోవడంలో చెవి కూడా ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందుకే లోపల చెవి నష్టం శరీరంపై కూడా తీవ్రమైన ప్రభావాలను చూపించగలదు…

ఈ సమస్యలనేవి రాకుండా ఉండాలి అంటే. మీరు విటమిన్ డి మరియు విటమిన్ బి 12 ఎక్కువగా ఉండే ఆహారాలను అధికంగా తీసుకుంటే చాలా మంచిది. అంతేకాక పాలు, చీజ్, గుడ్లు ఇతర రకాల చేపలను కూడా తీసుకోవాలి. మీరు రోజు వారి ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు మరియు పండ్లను కూడా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే గవద బిళ్లలు, మీజిల్స్, టైఫాయిడ్ లాంటి వ్యాధుల బారిన పడే వారిలో కూడా ఈ సమస్యలనేవి ఎక్కువగా ఉంటాయి. ఇవి చెవి ఇన్ఫెక్షన్ మరియు చెవిలో చీము లేక చెవి నుండి నీరు కారటం లాంటివి వినికిడి లోపాన్ని కలిగిస్తాయి. అలాంటి టైమ్ లో డాక్టర్ వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. అలాగే మీరు ఎంతో ఆరోగ్యంగా ఉండాలి అంటే యోగ మంచి సాధనం అని చెప్పొచ్చు.

Hearing Problem మీలో వినికిడి శక్తి రోజురోజుకు తగ్గుతూ వస్తుందా నివారణ చర్యలు ఏంటో తెలుసుకోండి

Hearing Problem : మీలో వినికిడి శక్తి రోజురోజుకు తగ్గుతూ వస్తుందా… నివారణ చర్యలు ఏంటో తెలుసుకోండి…!

అయితే మార్జ రాసనం మరియు బలాసనం లాంటివి ఎంతో ప్రభావితంగా ఉంటాయి. అయితే ఈ ఆసనాలన్నీ చేసే ముందు వాటిని సరిగా నేర్చుకోవడం కూడా చాలా అవసరం. కావున శిక్షకుని సలహా తీసుకొనిఈ ఆసనాలను పాటించాల్సి ఉంటుంది. అలాగే అధికంగా సిగరెట్టు కాల్చేవారు మరియు మద్యపానం లేక ఇతర మందులు కూడా వినికిడిని ప్రభావితం చేయవచ్చు. కాబట్టి ఎవరికైనా సాధారణ మద్యపానం లేక దూమపానం అలవాటు ఉన్నట్లయితే వీలైనంతవరకు ఈ అలవాట్లను తగ్గించుకుంటే మంచిది. ఈ అలవాట్ల ను విడిచి పెడితే మొత్తం ఆరోగ్యం కూడా ఎంతో మెరుగుపడుతుంది. అలాగే కర్మాగారాలు లేక నైట్ క్లబ్బులు లాంటి బిగ్గరగా ఉండే వాతావరణంలో నిత్యం పనిచేసే వ్యక్తులు ఫోమ్ ఇయర్ ప్లగ్ లను ధరించటం చాలా అవసరం. అలాగే మురికి నీటిలో స్నానం చేయటం వల్ల కూడా చెవి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాక తరచుగా చెవులు ఇన్ఫెక్షన్ కు సోకితే నొప్పి లాంటి సమస్యలు ఏర్పడిన వెంటనే వైద్యుల ను సంప్రదించటం మంచిది…

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది