Heart Attack : చిగుళ్ళు, దంతాల నొప్పి వస్తుందా.? అయితే కచ్చితంగా గుండెపోటు లక్షణమే..!!
Heart Attack : మనం జీవిస్తున్న జీవనశైలి కారణంగా గుండెపోటు కేసులు రోజు రోజుకి ఎక్కువవుతున్నాయి. దీని లక్షణాలు సకాలంలో తెలిస్తే వ్యక్తి జీవితాన్ని కాపాడవచ్చు. గుండెపోటుకు ముందు శరీరంలో 45 శాతం మందిలో కనిపించే మైనర్ హార్ట్ ఎటాక్ లక్షణాలైనా కొన్ని కనబడుతూ ఉంటాయి. దాన్ని గుర్తిస్తే ఆ వ్యక్తి ప్రాణాలను రక్షించవచ్చు. గుండెపోటు కు ముందు ఒక వ్యక్తి చేతిలో తీవ్రమైన కత్తిపోటు నొప్పి కలుగుతుంది.. అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది చిగుళ్ళు, దంతాలు నొప్పి వాపు వస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. కొన్ని సమయాలలో చిగుళ్ళు దంతాల నుండి రక్తశ్రావం కూడా అవ్వచ్చు. దానివలన దీర్ఘకాలిక పంటి నొప్పి చిగుళ్లలో రక్తస్రావం లాంటి సమస్యను అశ్రద్ధ చేయవద్దు..
ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే వెంటనే వైద్యున్ని సంప్రదించడం మంచిది.. చిగుళ్ళు దంతాలలో ఈ లక్షణాలు: తినేటప్పుడు దంతాల నొప్పి దంతాల సున్నితత్వం సమస్య, అధిక చమట, చిగుళ్లలో రక్తస్రావం దంతాల్లో స్థిరమైన నొప్పి.. ఇవన్నీ కూడా గుండెపోటు వచ్చేముందు కనిపించే లక్షణాలు.. గుండె సమస్యలు ఎక్కువ అవ్వడానికి కారణాలు: ఆహారంలో కొన్ని మార్పుల వలన దీనికి ప్రధాన కారణం అవుతుంది .. తగినంత నిద్ర లేకపోవడం, ఒత్తిడి అధిక రక్తపోటు, శారీరకంగా చురుగ్గా ఉండకపోవడం, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం, ధూమపానం అలవాటు మద్యం అలవాటు వలన గుండె సమస్యలు అధికమవుతున్నాయి..
గుండెపోటును తగ్గించే మార్గాలు: ఆరోగ్యకరమైన జీవన శైలి ని అలవాటు చేసుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. రోజు వ్యాయామం చేయాలి. శారీరికంగా చురుగ్గా ఉండాలి. మధుమేహాన్ని కంట్రోల్ చేసుకోవాలి. రక్తపోటును కంట్రోల్లో ఉంచుకోవాలి. బరువును అదుపులో ఉంచుకోవాలి. ధూమపానం చేయవద్దు. ఎక్కువ గా మద్యం సేవించవద్దు. మీ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, సీజనల్ పండ్లు గింజలు తప్పనిసరిగా ఉండాలి. బయట ఆహారాన్ని అధిక తీసుకోవద్దు. ఆరోగ్యకరమైన సాధారణ ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి… ఇవన్నీ పాటిస్తూ.. ఈ సంకేతాలు మీలో కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించి వెంటనే చికిత్స పొందితే మీ ప్రాణాలను కాపాడుకోవచ్చు..