Heart Attack : మీ శరీరంలో ఇది పెరిగిందా..? అయితే గుండెపోటు ఖాయం… ఉదయాన్నే ఇలా చేసి చెక్ పెట్టండి..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Heart Attack : మీ శరీరంలో ఇది పెరిగిందా..? అయితే గుండెపోటు ఖాయం… ఉదయాన్నే ఇలా చేసి చెక్ పెట్టండి..!!

 Authored By ramu | The Telugu News | Updated on :25 March 2024,9:00 am

ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న వ్యాధి హార్ట్ ఎటాక్. ఇది చిన్న వయసులో కూడా ఎంతోమంది ప్రాణాలను తీసింది. ఇలా గుండె ప్రమాదాలకి గురవకుండా ఉండాలంటే సరియైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. దీంతో ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా రక్షించుకోవచ్చు.. మనం జీవిస్తున్న జీవన శైలి విధానంలో చాలామంది పనిమీద శ్రద్ధ పెడుతున్నంతగా తినే ఆహారం మీద పెట్టడం లేదు. ఇది సరి అయింది కాదు.. మీరు ఉదయం ఆఫీస్ కి వెళ్లే ముందు ఆరోగ్యకరమైన వాటిని తప్పకుండా తీసుకోవాలి. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

అయితే అల్పాహారం తీసుకోకపోవడం వలన లిపో ప్రోటీన్ ఎల్డీఎల్ అధికమవుతుంది. చెడు కొలెస్ట్రాల్ పెరగడం పెరగడం వల్ల మధుమేహం అధిక రక్తపోటు, ఊబకాయం, గుండెపోటు లాంటి తీవ్రమైన వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి మనం అల్పాహారంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం… ఈ ఆహారం తీసుకుంటే కొలెస్ట్రాల్ కి చెక్ పెట్టినట్టే… ఆరెంజ్ ఫ్రూట్: సహజంగా అన్ని చోట్ల దొరికే పండు కమలాపండు. దీని రసంలో విటమిన్షి అధికంగా ఉంటుంది. దానిలో ఫైబర్ ఫుడ్లతో కలిపి తీసుకోవడం చాలా మంచిది. దాని ద్వారా పుష్కలంగా ఫైబర్ మన శరీరానికి లభిస్తుంది. దీని జ్యూస్ చేసి తాగితే ఎన్నో ఉపయోగాలు పొందవచ్చు.. గుడ్డులోని తెల్ల సోన: మీరు న్యూట్రిషన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్ కోసం చూస్తున్నట్లయితే గుడ్డులోని తెల్లసోన ను తప్పకుండా తినాలి. ఎందుకంటే దీని తినడం వల్ల కొలెస్ట్రాల్ అస్సలు పెరగదు.

మంచి మొత్తంలో ప్రోటీన్ కూడా పొందవచ్చు.. ఇది గుండెపోటు ప్రమాదాన్ని చాలా వరకు కంట్రోల్ చేస్తుంది.. శాల్మన్ ఫిష్: సాల్మన్ ఫిష్ ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ అధికంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు మంచి కొలెస్ట్రాల్ని అధికం చేస్తాయి.. దీనికోసం టమోటాలు, పిపర్లు, నువ్వులు వంటి ఇతర ఆహారాలతో సల్మాన్ ఫిష్ ను కాల్చి తీసుకోవచ్చు.. ఇది ఆరోగ్య కోణం నుండి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.. ఓట్ మిల్: బ్రేక్ ఫాస్ట్ లో ఓట్ మిల్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే దీన్లో కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మీ జీర్ణ వ్యవస్థలో ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ను పెరగకుండా కంట్రోల్ చేస్తుంది. మీ శరీరం హై కొలెస్ట్రాలను తొలగించడంలో ఉపయోగపడుతుంది. సరైన ఆపిల్ ,పియర్ లేదా కొన్ని చెర్రీస్ లేదా స్ట్రాబెరీ లను దీనిలో జోడించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఫైబర్ కంటెంట్ అధికమవుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది