Homemade Fertilizer : మీ ఇంట్లో నీ మొక్కలు పుష్పాల, ఫలాలు ఇవ్వాలన్నా… ఈ బెస్ట్ ఎరువును వెయ్యండి.. ఎలా ఉపయోగించాలి…?
ప్రధానాంశాలు:
Homemade Fertilizer : మీ ఇంట్లో నీ మొక్కలు పుష్పాల, ఫలాలు ఇవ్వాలన్నా... ఈ బెస్ట్ ఎరువును వెయ్యండి.. ఎలా ఉపయోగించాలి...?
Homemade Fertilizer : ఇంటి చుట్టూ అందమైన పూల మొక్కలను, వివిధ రకాల చెట్లను పెంచుకోవడం అందరికీ ఇష్టమే. వాటిని ఎంతో అపురూపంగా చూసుకుంటాం. దాని నుంచి వచ్చే ప్రతి పువ్వు, ఫలం మనకు చెప్పలేనంత ఆనందాన్ని ఇస్తుంది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇంట్లో చెట్లు పెంచుకొనుటకు సరైన స్థలం లేక వీటిని పెంచడం మానేస్తున్నారు. కొందరు అపార్ట్మెంటు సంస్కృతిలో రోజు రోజుకి పెరిగిపోతూ.. ఇంటి ఆవరణలో మొక్కలు పెంచుకునే అవకాశం కరిగిపోతున్న… ఇంట్లో మొక్కలను పెంచుకునేందుకు రకరకాల ప్రయత్నాలు ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు టెర్రస్ల పైనే కాదు.. ఏంటి బాల్కనీలో ఎక్కడ పువ్వుల మొక్కలను పెంచుకునే అవకాశం ఉంటే అక్కడ కుండీలు పెట్టుకొని మొక్కలను పెంచుకుంటున్నారు. ఒకసారి ఈ మొక్కలని కుండీలలో పెంచడం చేత ఒకసారి పువ్వులు పూచే తర్వాత మళ్ళీ పోయడం ఆగిపోతాయి. కొన్ని మొక్కలు ఎండిపోతాయి కూడా. అలాంటప్పుడు ఏదో ఒక ఎరువుని వేయాల్సి వస్తుంది. అప్పుడు ముందుగా మనకు గుర్తొచ్చేది ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఎరువులు తయారు చేయడం. అయినా కానీ ప్రయోజనం కనిపించదు. అలాంటప్పుడు ఈ చిట్కా అని ట్రై చేసి చూడండి.. ఎండిన చెట్టు మళ్ళీ వికసిస్తుంది.

Homemade Fertilizer : మీ ఇంట్లో నీ మొక్కలు పుష్పాల, ఫలాలు ఇవ్వాలన్నా… ఈ బెస్ట్ ఎరువును వెయ్యండి.. ఎలా ఉపయోగించాలి…?
Homemade Fertilizer అది ఎలానో తెలుసుకుందాం..
మొక్కలను పెంచుకునే వారి గురించి ఎంత చెప్పినా తక్కువే.. తమకు ఎంత స్థలము ఉంటే అంత స్థలము మేరకు మొక్కలను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొన్ని మొక్కలు కుండీలలో పెంచుకుంటున్నప్పుడు, పువ్వులు ఒకసారి వికసించిన తరువాత మళ్ళీ మొగ్గ తొడగదు. ఒక్కొక్కసారి మొక్కలు ఎండిపోతాయి. కొందరు మొక్కల సంరక్షణ కోసం మార్కెట్లలో అందుబాటులో లభించే అన్ని రకాల ఎరువులతో పాటు, టీ పొడిని, కూరగాయలు కడిగిన నీరు, కూరగాయల తొక్కలు, గుడ్ల గుల్లలు వంటి వాటిని కూడా మొక్కలకు ఎరువుగా వేస్తారు. అయినప్పటికీ, ఎటువంటి ప్రయోజనం కనబడకపోతే.. ఒకప్పుడు రకరకాల రంగురంగుల పువ్వులతో అందంగా కనిపించే మీ తోట… ఒక్కసారిగా ఎండిన చెట్లతో దర్శనమిస్తుంది.
మొక్కలకి నీరు ఎంత ముఖ్యమో ఎరువులు కూడా అంతే ముఖ్యం. సెంద్రీయ రసాయన ఎరువులు రెండు అందుబాటులో ఉన్నాయి. అయితే, మీ మొక్కలని మళ్ళీ వికసింప చేయాలి అంటే.. ఒక గుప్పెడు బియ్యం చెట్లను కాపాడటంలో.. అవి మళ్లీ పుష్పించే ఎలా చేయడంలో మంచి ఎరువు అని మీకు తెలుసా… బియ్యం మొక్కలోని పోషక విలువలను పెంచుతుంది. మానవులకు మంచి ఆరోగ్యం కోసం పొటాషియం, కాల్షియం, జింక్, సోడియం ఖనిజాలు అవసరమైనట్లయితే, మొక్కలను నత్రజని, బాస్వరం, పొటాషియం అవసరం. ఈ మూలకాలను మొక్కలకు బియ్యం అందించండి.
Homemade Fertilizer బియ్యంతో ఎరువుని ఎలా తయారుచేయాలి
ఒక గాజు గిన్నెలో ఒక గుప్పెడు బియ్యాన్ని తీసుకోండి. బియ్యంలో కొంచెం నీరు పోయండి. ఆ తరువాత మూత పెట్టి ఇంట్లో చీకటిగా చల్లగా ఉండే ప్రదేశంలో, గాజు గిన్నెను నిల్వ చేయండి. ఇలా మూడు నుంచి నాలుగు రోజులు ఈ బియ్యంతో ఉన్న గిన్నెను ఉంచండి. తరువాత బియ్యాన్ని వడకట్టి, నీరు వేరు చెయ్యండి. ఇప్పుడు ఆ బియ్యం నీరుని ఒక స్ప్రే బాటిల్ లో నింపి. మొక్కలపై పిచికారి చేయాలి. చేయడం వల్ల మొక్క తాజాగా ఉంటుంది. బియ్యాన్ని మొక్క నేల భాగంపై పొయ్యండి. సరోజంతా అలాగే ఉంచి.. మర్నాడు చెట్టు దగ్గర ఉన్న బియ్యాన్ని తీసి శుభ్రం చేయండి. లేకపోతే.. చీమలు పట్టే అవకాశం ఉంది. ఇలా రోజు చేస్తే చాలా కాలం నుంచి పువ్వులు పూయడం మానేసిన మొక్క మళ్ళీ మొగ్గలు వేయడం మొదలు పెడుతుంది. పుష్కలంగా పువ్వులు వికసిస్తాయి. ఇలా కనీసం నెలకు రెండు సార్లు అయినా చేయండి. మీ పెరట్లో ఉన్న మొక్కలన్నీ అందమైన పువ్వులతో వికసిస్తూ ఉంటాయి.