viral video: నిజం గడప దాటే లోపు..అబద్ధం ఊరంతా ఊరేగి వస్తుందంటే ఇదేనేమో..సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న వీడియో..!
ప్రధానాంశాలు:
viral video: నిజం గడప దాటే లోపు..అబద్ధం ఊరంతా ఊరేగి వస్తుందంటే ఇదేనేమో..సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న వీడియో..!
viral video: సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో కేరళలో Kerala తీవ్ర విషాదానికి దారి తీసింది. బస్సులో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఓ మహిళ పోస్ట్ చేసిన వీడియో కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కోజికోడ్‌లో జరిగింది. ఈ ఘటన సోషల్ మీడియా ట్రయల్ ఎంత ప్రమాదకరమో మరోసారి చాటిచెప్పింది. కోజికోడ్ జిల్లా గోవిందపురం ప్రాంతానికి చెందిన దీపక్ యు (42) ఓ ప్రైవేట్ టెక్స్‌టైల్ కంపెనీలో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 16వ తేదీన కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ KSRTC బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఒక మహిళ తన పట్ల లైంగిక ఉద్దేశంతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో క్షణాల్లోనే వైరల్ అయి దీపక్‌ను తీవ్ర విమర్శలు అనుమానాల మధ్యకు నెట్టేసింది.
viral video: నిజం గడప దాటే లోపు..అబద్ధం ఊరంతా ఊరేగి వస్తుందంటే ఇదేనేమో..సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న వీడియో..!
వీడియో వైరల్ అయిన తర్వాత దీపక్ Deepak తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన కుటుంబ సభ్యుల వద్ద తీవ్రంగా ఖండించినట్లు సమాచారం. తాను ఎలాంటి తప్పు చేయలేదని వీడియోలో కనిపిస్తున్న విషయం వక్రీకరణేనని చెప్పుకున్నా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఆయనను తీవ్రంగా కుంగదీసింది. పని ప్రదేశంలోనూ సమాజంలోనూ అవమాన భావన ఎదురవుతుందనే భయం ఆయనను వెంటాడినట్లు బంధువులు తెలిపారు. ఈ నేపథ్యంలో జనవరి 18న ఆదివారం ఉదయం దీపక్ తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు స్థానికులు గది తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు గుర్తించారు. ఈ ఘటన కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది.
సమాచారం అందుకున్న కోజికోడ్ మెడికల్ కాలేజీ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
viral video: నిజం గడప దాటే లోపు..అబద్ధం ఊరంతా ఊరేగి వస్తుందంటే ఇదేనేమో..సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న వీడియో..!
సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం ముందస్తు తీర్పులే (సోషల్ మీడియా ట్రయల్) దీపక్ మృతికి కారణమని అతడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు లోతైన దర్యాప్తు ప్రారంభించారు. మృతికి దారితీసిన పరిస్థితులు వీడియో ఎలా సర్క్యులేట్ అయింది. ఎవరు ఎలాంటి ఉద్దేశంతో షేర్ చేశారు అన్న అంశాలపై కూడా విచారణ జరుగుతుందని అధికారులు తెలిపారు. మరోవైపు సదరు మహిళ మరో వీడియో విడుదల చేసి ఈ ఘటనపై తాను ఇప్పటికే వడకర పోలీసులకు ఫిర్యాదు చేశానని వెల్లడించారు. బస్సులో దీపక్ ఉద్దేశపూర్వకంగానే తనను తాకాడనే నమ్మకంతోనే వీడియో పోస్ట్ చేశానని ఆమె స్పష్టం చేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో ఆరోపణలు చేయడం నిజానిజాలు తేలకముందే వ్యక్తులను దోషులుగా ముద్ర వేయడం ఎంత ప్రమాదకరమో స్పష్టంగా చూపిస్తోంది. చట్టపరమైన విచారణకు ముందు జరిగే సోషల్ మీడియా ట్రయల్స్ అనేక జీవితాలను నాశనం చేస్తున్నాయన్న చర్చకు ఈ ఘటన మరో ఉదాహరణగా నిలిచింది.
నిజం గడప దాటే లోపు. అబద్ధం ఊరంతా ఊరేగి వస్తుందంటే ఇదేనేమో పాపం
బస్సులో అసభ్యంగా తాకాడంటూ ఓ యువతి సోషల్ మీడియాలో వీడియో పెట్టగా అది వైరల్ అయింది.
దీంతో మనస్తాపానికి గురైన దీపక్ ఆత్మహత్య చేసుకున్నాడు pic.twitter.com/ANZUJ3oGVh
— greatandhra (@greatandhranews) January 19, 2026