Hot Water Bath : ప్రతిరోజు వేడి నీళ్లు లేనిదే స్నానం చేయరా… ఇది ఆరోగ్యానికి మంచిదేనా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hot Water Bath : ప్రతిరోజు వేడి నీళ్లు లేనిదే స్నానం చేయరా… ఇది ఆరోగ్యానికి మంచిదేనా…?

 Authored By ramu | The Telugu News | Updated on :3 July 2025,7:00 am

ప్రధానాంశాలు:

  •  Hot Water Bath : ప్రతిరోజు వేడి నీళ్లు లేనిదే స్నానం చేయరా... ఇది ఆరోగ్యానికి మంచిదేనా...?

Hot Water Bath : ప్రతి ఒక్కరు కూడా వేడి నీటి స్నానం అలవాటుగా ఉంటుంది. వేడి నీళ్లు లేనిదే స్నానం అస్సలు చేయరు. ధరైతే చలికాలం వర్షాకాలంలో ఎక్కువగా స్నానం చేస్తే, కొందరు ఎండాకాలం వర్షాకాలం చలికాలం ఏ కాలమైనా వేడి నీళ్లు లేనిదే స్నానం చేయరు. కానీ ఇలా చేస్తే మంచిదేనా. వేడి నీటి స్నానానికి లాభాలు,నష్టాలు గురించి తెలుసుకుందాం. వేడినీళ్ల స్థానం చేస్తే శరీరం చాలా రిలాక్స్ అవుతుందని చేస్తుంటారు. ప్రతిరోజు మితిమీరిన వ్రత కలిగిన నీటితో మనం చేస్తే కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉంది. చాలామంది ఉదయం, సాయంత్రం వేడి నీళ్లతో స్నానం చేయడం అలవాటు. వేడి నీళ్లతో స్నానం చేస్తే శరీరం రిలాక్స్ అవుతుందని,ఈ ప్రక్రియ మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందని ఆలోచించాల్సిన అవసరం ఉంది. వేడి నీటితో స్నానం చేస్తే దానివల్ల కలిగే ప్రయోజనాలు ప్రమాదాలు కూడా తెలుసుకుందాం…

Hot Water Bath ప్రతిరోజు వేడి నీళ్లు లేనిదే స్నానం చేయరా ఇది ఆరోగ్యానికి మంచిదేనా

Hot Water Bath : ప్రతిరోజు వేడి నీళ్లు లేనిదే స్నానం చేయరా… ఇది ఆరోగ్యానికి మంచిదేనా…?

Hot Water Bath శరీర విశ్రాంతికి వేడి నీరు

మన శరీరం పనులు చేసి అలసినప్పుడు, నారాలు, కండరాలు ఒత్తిడికి గురవుతాయి. అలాంటప్పుడు, తక్కువ ఉష్ణోగ్రతతో వేడి నీటితో స్నానం చేస్తే శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ముఖ్యంగా, శారీరకంగా అలసిపోయినా రోజుల్లో ఇది ఉపశమనంలా పనిచేస్తుంది.

శరీర ఉష్ణోగ్రతలో మార్పులు : తీవ్రమైన వేడి నీటితో ప్రతిరోజు స్నానం చేస్తే, శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితి నుండి తప్పిపోతుంది.ఇది ఒళ్ళు మత్తుగా అనిపించడంతోపాటు అలసటను కలిగిస్తుంది. ఎక్కువ వేడి నీరు శరీరంలోని నీటి సమతుల్యతను కూడా ప్రభావితం చేయవచ్చు.

చర్మ సమస్యలకు ఆహ్వానం : వేడి నీరు చర్మం మీద ఉన్న సహజ నూనె పదార్థాలను తొలగించే శక్తిని కలిగి ఉంటుంది.కాబట్టి,చర్మం పొడి బారవచ్చు.చికాకు కలిగించవచ్చు. ముఖ్యంగా, చర్మం సహజంగా పొడిగా ఉంటే రోజు వేడి నీరు మితిమీరిన సమస్యలను తెచ్చిపెడుతుంది.

కీళ్ల సమస్యలపై ప్రభావం : ఆర్దరైటీస్ లేదా కీళ్ల నొప్పుల వల్ల బాధపడుతున్న వారికి, ఎక్కువ ఉష్ణోగ్రత గల నీటితో స్నానం చేస్తే అంత మంచిది కాదు.వీటి వల్ల కీళ్లల్లో వాపు పెరిగే అవకాశం మరింత పెరుగుతుంది. తక్కువ ఉష్ణోగ్రత గల నీటిని ఉపయోగిస్తే మంచిది. అంటే గోరువెచ్చ నీటిని వాడితే మంచిది.

నిద్రకు,మానసిక ప్రశాంతతకు వేడి నీరు : పడుకునే ముందు నెమ్మదిగా వేడి నీటితో స్నానం చేస్తే మానసికంగా ప్రశాంతత కలుగుతుంది ఇది నిద్ర పట్టడంలో సహాయపడుతుంది మెదడు కూడా కొంత విశ్రాంతిగా మారి మంచి నిద్రకు దోహదం చేస్తుంది. గోరువెచ్చని నీటితోనే స్నానం చేయాలి.

అధిక వేడి నీరు : ప్రతి రోజు స్నానం చేయడం తప్పు కాదు. కానీ, ఉష్ణోగ్రత శరీర అవసరానికి తగినట్లుగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ వేడి ఉన్న నీటిని తీసుకుంటే ప్రయోజనాలు కన్నా దాని దుష్ప్రభావాలే ఎక్కువ. అందుకే మితమైన ఉష్ణోగ్రత, గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే ఉత్తమం. స్నానం చేస్తే మనకు చాలా ప్రయోజనాలు కలుగుతాయి. మితంగా వేడి ఉన్న నీటితో మాత్రమే ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అమితమైన ఉష్ణోగ్రత నీటితో స్నానం అప్రయోజనాన్ని కలిగిస్తుంది. అవసరమైతే వైద్యుని సలహా తీసుకుంటే మంచిది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది