Stress : స్ట్రెస్ లేదా ఒత్తిడి Stress.. దీన్ని జయించడం అనేది అంత ఈజీ కాదు. ఒత్తిడితో ఒక్కసారి సతమతమవుతున్నామంటే.. జీవితం గందరగోళంగా తయారవుతుంది. అందుకే.. ఒత్తిడి Stress అనేది చాలా భయంకరమైనది. దాని నుంచి ఎలాగైనా తప్పించుకునే మార్గాలు వెతుక్కోవాలి. లేదంటే అది జీవితాన్నే నాశనం చేయగలదు. నిజానికి ఒత్తిడి Stressని జయించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ.. మనం ఇప్పుడు చెప్పుకోబోయేది చాలా డిఫరెంట్. ఎందుకంటే.. ఒత్తిడి అనగానే చాలామంది ఇచ్చే సలహాలు.. మెడిటేషన్, యోగా, వ్యాయామం లాంటివి. కానీ.. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది మాత్రం వాటి గురించి కాదు.
మీకు సువాసన గురించి తెలుసా? సువాసన అంటే మంచి వాసన. సాధారణంగా మంచి వాసనలు సెంట్, పర్ ఫ్యూమ్, స్ప్రేల నుంచి వస్తాయి. ఆ వాసనలు శరీరానికి ఎంతో ఉల్లాసాన్ని కలిగిస్తాయట. మంచి వాసనను పీల్చినప్పుడు శరీరంలో కొన్ని హార్మోన్లు రిలీజ్ అయి.. శరీరంలో ఉన్న టెన్షన్ ను తగ్గిస్తాయట.
స్ట్రెస్ అనేది మానసిక ఆరోగ్యానికి సంబంధించింది. స్ట్రెస్ కు ఎక్కువగా గురి కావడం వల్ల.. మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. మనిషి.. అంతా పిచ్చి పిచ్చి చేస్తాడు. ఎవరితో మాట్లాడడు. బాగా డిస్టర్బ్ అవుతాడు. ఏ పనీ చేయలేడు. మెంటల్ టెన్షన్ కు గురయితే ఇక అంతే. అందుకే.. స్ట్రెస్ ను వెంటనే తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేయాలి. అందుకే.. దానికి బెస్ట్ ట్రీట్ మెంట్.. సుగంధ ద్రవ్యాలు. ఇది ఇప్పుడు కాదు.. మన పూర్వీకుల కాలం నుంచి ఒత్తిడిని జయించడానికి.. సుగంధ ద్రవ్యాలను ఉపయోగిస్తున్నారట. ఇది ఒక ఆయుర్వేద ట్రీట్ మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. మంచి వాసనను మనం పీల్చగానే.. అది మెదడుకు చేరుతుంది. ఆ తర్వాత మెదడులో నిక్షిప్తం అయి ఉన్న.. మన భావాలు, ఎమోషన్స్ అన్నింటిపై అది మంచి ప్రభావం చూపిస్తుంది. దీంతో ఒత్తిడి ఒక్కసారిగా తగ్గిపోయి.. ప్రశాంతత చేకూరుతుంది.మంచి వాసన అనేది పూల నుంచి కూడా పొందొచ్చు.
కొన్ని రకాల పూలు.. సువాసనను వెదజల్లుతాయి. వాటిని పీల్చినా కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. దీన్నే వైద్య భాషలో అరోమా థెరపీ అంటారు. ఆయుర్వేదంలో దీనికి ట్రీట్ మెంట్ కూడా ఉంది. మీకు తెలుసా? చాలామంది తమ ఇంట్లో ఎప్పుడూ మంచి వాసన వచ్చేలా ఏర్పాట్లు చేస్తుంటారు. స్ప్రే చేయడం.. సెంట్ చల్లడం, అగరబత్తీలు వెలిగించడం.. ఇంట్లో సువాసన వెదజల్లితే.. ఆ రోజంతా ప్రశాంతంగా ఉంటుందని వాళ్ల నమ్మకం.
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
This website uses cookies.