Proteins: ప్రొటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారా? పోషక ఆహారం ఎక్కువైతే ఈ వ్యాధులు వస్తాయి?
Proteins : ప్రొటీన్స్.. మన శరీరానికి ఎంతో ముఖ్యమైనవి. రోజూ మనం తినే ఆహారంలో ఖచ్చితంగా ప్రొటీన్ ఫుడ్ ఉండాల్సిందే. ప్రొటీన్ ఫుడ్ ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం. బలంగా ఉంటాం. లేదంటే రోజంతా నీరసమే. శరీరానికి కావాల్సిన శక్తిని ప్రొటీన్ ఫుడ్డే ఇస్తుంది. ప్రొటీన్ సరిపోయేంతగా తీసుకుంటేనే ఆరోజంతా యాక్టివ్ గా ఉంటాం. ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టగలుగుతాం. అయితే.. ప్రొటీన్ తింటే మంచిది కదా అని చెప్పి.. ప్రొటీన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తింటుంటారు చాలామంది. అది చాలా డేంజర్ అట.ప్రొటీన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే చాలా సమస్యలు వస్తాయట. నిజానికి ప్రొటీన్ మన శరీరానికి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. దానికి మించి తీసుకోకూడదు. అలా తీసుకుంటే లేనిపోని సమస్యలు రావడమే తప్పితే ఇంకేం ఉండదు. శరీరానికి కావాల్సినంత ప్రొటీన్ మాత్రమే తీసుకోవాలి. అంతకు మించి ఎక్కువ తీసుకుంటే సమస్యల్లో పడ్డట్టే.
Proteins : జీర్ణ సమస్యలు, కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లు ఎక్కువ ప్రొటీన్ తీసుకోకూడదు
ముఖ్యంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వాళ్లు.. జీర్ణ సమస్యలతో బాధ పడుతున్న వాళ్లు.. ప్రొటీన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోకూడదు. దాని వల్ల.. వాళ్లకు ఆ సమస్యలు ఇంకాస్త ఎక్కువవుతాయి. వాళ్లకు కావాల్సినంత మోతాదు మేరకు మాత్రమే ప్రొటీన్ తీసుకోవాల్సి ఉంటుంది. అధికంగా ప్రొటీన్ తీసుకోవడం వల్ల.. కిడ్నీలకు ఇన్ఫెక్షన్ వస్తుంది. అధికంగా ప్రొటీన్ శరీరంలో చేరడం వల్ల.. అమైనో ఆమ్లాల నుంచి విడుదలయ్యే నత్రజనిని నాశనం చేయడానికి.. కిడ్నీలు విపరీతంగా కష్టపడాల్సి వస్తుంది. వాటి పని ఓవర్ లోడ్ అవ్వడం వల్ల.. అవి దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.
Proteins : అధిక ప్రొటీన్ తీసుకుంటే.. ఎక్కువ నీరు తాగండి
ఒకవేళ.. అధికంగా ప్రొటీన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే మాత్రం.. ఎక్కువగా నీళ్లను తాగడం బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు. రోజులో కనీసం 3 లీటర్ల నీటిని తీసుకోవాలి. దాని వల్ల.. అధిక ప్రొటీన్ తీసుకున్నా.. అది మూత్రపిండాల మీద బారం పడకుండా నీళ్లు ఆపగలుగుతాయి. ఇతర విష పదార్థాలను నాశనం చేయడాన్ని నీరు సులభతరం చేస్తుంది. అందుకే.. ఏ ఆహారం తినాలి? ఏ ఆహారం తినకూడదు? అనే విషయాలను ముందే తెలుసుకోవాలి. ఎందులో ఎక్కువ ప్రొటీన్ ఉంటుందో తెలుసుకొని.. దాని ప్రకారం ఆహారపు నియమాలను పాటిస్తే మంచిది.