Fruits : పండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగుతున్నారా? అయితే.. మీరు డేంజర్ లో ఉన్నట్టే?

0
Advertisement

Fruits : వేసవి కాలంలో ఎక్కువగా పండ్లను తింటుంటారు. దానికి కారణం.. తీవ్ర వేడిని తట్టుకోవడం కోసం.. డీహైడ్రేషన్ ను తట్టుకోవడం కోసం అలా చేస్తాం. అవి శరీరానికి కావాల్సిన ఫైబర్ ను, విటమిన్లను అందించడమే కాకుండా.. శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా కాపాడుతాయి. అయితే.. చాలామంది పండ్లు తినగానే.. నీళ్లు తాగుతారు. కొందరు పండ్లు తినేముందు ఫుల్లుగా నీళ్లు తాగుతారు. అసలు.. పండ్లు తిన్నాక నీళ్లు తాగాలా? వద్దా? నీళ్లు ఎప్పుడు తాగాలి? ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.మనం పైన చెప్పుకున్నట్టు.. పండ్లలో హైడ్రేటింగ్ శక్తి విపరీతంగా ఉంటుంది. మీకు చాలా దాహం వేసినప్పుడు పండ్లు తిన్నా కూడా దాహం తీరుతుంది. మళ్లీ నీళ్లు తాగాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు పుచ్చకాయను తిన్నారనుకోండి. మీకు అస్సలు దాహమే వేయదు ఇక.

can we drink water after eating fruits
can we drink water after eating fruits

పండ్లు తిన్నాక దాహం తీరాక కూడా మళ్లీ నీళ్లు తాగితే శరీరంలో లేనిపోని సమస్యలు వస్తాయట. కోరి సమస్యలను తెచ్చుకున్నట్టేనట. ఒకవేళ పండ్లు తిన్నాక కూడా విపరీతంగా దాహం వేస్తే.. కనీసం 30 నిమిషాల పాటు వెయిట్ చేయాలి. ఆ తర్వాత దాహం తీర్చుకోవాలి. దాహం వేయకపోతే.. కనీసం ఓ గంట సేపు ఆగి నీళ్లు తాగాలట.

Fruits : ఎందుకు పండ్లు తినగానే నీళ్లు తాగకూడదు?

పండ్లు తినగానే నీళ్లు ఎందుకు తాగకూడదు అంటే.. పండ్లు తినగానే అవి డైరెక్ట్ గా జీర్ణాశయంలోకి వెళ్తాయి. అక్కడ జీర్ణ ప్రక్రియ కోసం.. తిన్న పండ్లను అరిగించడం కోసం జీర్ణ వ్యవస్థ కొన్ని ఆమ్లాలను విడుదల చేస్తుంది. ఆ ఆమ్లాలు.. వెంటనే తిన్న పండ్లను జీర్ణం చేస్తాయి. ఒకవేళ మీరు పండ్లు తినగానే.. నీళ్లు తాగితే.. ఆ నీళ్లు.. విడుదలైన జీర్ణ ఎంజైమ్ లను పలుచన చేస్తాయి. దీంతో జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయదు. తిన్న పండ్లు జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. దాన్ని జీర్ణం చేయడానికి.. జీర్ణ వ్యవస్థ ఎక్కువ సేపు కష్టపడాల్సి వస్తుంది. దాని వల్ల.. గ్యాస్ రావడం, కడుపులో మంట రావడం.. ఇతర సమస్యలు వస్తాయి.

can we drink water after eating fruits
can we drink water after eating fruits

Fruits : అతిసారం వచ్చే ప్రమాదం

పండ్లు తినగానే నీటిని తాగితే.. అతిసారం వస్తుందట. పండ్లలో ఎక్కువ నీరు ఉండటం, నీరు తాగగానే మరోసారి శరీరంలో నీటి కంటెంట్ ఎక్కువవుతుంది. దాని వల్ల.. పేగుల కదలికలు సులభతరం అయి.. అతిసారానికి దారి తీస్తుంది. అలాగే.. శరీరంలోని పీహెచ్ స్థాయిలు కూడా తగ్గిపోతాయి. పీహెచ్ స్థాయి ఆమ్లతను సూచిస్తుంది. పండ్లు తినగానే నీరు తాగితే.. పీహెచ్ స్థాయిలు కూడా పలుచన అవుతాయి. దాని వల్ల కూడా జీర్ణ సమస్యలు, కడుపు నొప్పి వస్తుంది. అందుకే.. పండ్లు తినగానే అస్సలు నీళ్లు తాగకూడదు.

Advertisement