Weight Loss : చపాతీలను ఇలా తీసుకోండి… ఈజీగా వెయిట్ లాస్ అవ్వండి…!
ప్రధానాంశాలు:
Weight Loss : చపాతీలను ఇలా తీసుకోండి... ఈజీగా వెయిట్ లాస్ అవ్వండి...!
Weight Loss : ప్రస్తుతం మనం తీసుకునే చెడు ఆహారం మరియు జీవన శైలి ఆధారంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఈ సమస్యలలో ఒకటి అధిక బరువు. అధిక బరువుతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. బరువు తగ్గాలి అనుకుంటే ఫుడ్, వర్కౌట్ ఈ రెండు చాలా అవసరం. బరువు తగ్గడానికి షుగర్,కార్బోహైడ్రేట్స్ అదుపులో ఉంచాలి. దీనికోసం ఎంతో మంది చపాతీలను తింటూ ఉంటారు. అయితే చపాతీలు తీనడం వలన బరువు తగ్గుతారు. కానీ ఎలా తింటే మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఏ పిండి : మనకు మార్కెట్లో చపాతీలు చేసుకునేందుకు రకరకాల పిండి పదార్థాలు అందుబాటులో ఉంటాయి. అయితే మల్టీ గ్రైయిన్. అంటే. కలిపి జొన్నలు, రాగులు అన్నింటిని కలిపి చేస్తారు. ఇతర రకాల పిండిలో వేరువేరు గుణాలు కలిగి ఉన్నాయి..
Weight Loss మల్టీ గ్రైయిన్ చపాతీలు
దీనిలో క్యాలరీలు దాదాపుగా 8 నుండి 100 వరకు ఉంటాయి. వీటిలో ఎక్కువగా ధాన్యాలు కలిసి ఉండటం వలన పోషకాలు అనేవి బాగా అందుతాయి. జొన్న చపాతీలు 50 నుండి 60 కేలరీలు ఉన్నాయి. ఇది గ్లూటేన్,ఫ్రీ గ్లూ టేన్ అలర్జీ ఉన్నటువంటి వారు దీనిని తీసుకోవచ్చు. షుగర్ ఉన్న వారికి కూడా ఇది చాలా మంచిది. రాగి చపాతీలను 80 నుండి 90 క్యాలరీలు ఉన్నాయి. ఇది మొత్తం కాలుష్యం,ఫైబర్ తో నిండి ఉంటుంది..
జొన్న : బరువు తగ్గాలి అనుకునే వారికి జొన్న రొట్టెలు చాలా మంచిది. దీనిలో ఫైబర్ అనేది అధికంగా ఉంటుంది. దీని వలన షుగర్ కూడా అదుపులో ఉంటుంది. వీటి కారణం వలన ఆకలి అనేది తగ్గుతుంది. రక్తంలో కూడా చక్కెర అనేది అదుపులో ఉంటుంది. జీర్ణ వ్యవస్థకు కూడా చాలా మంచిది.
నెయ్యి : అధిక బరువును నియంత్రించడానికి చపాతీలు చాలా అవసరం. వీటిని నెయ్యితో కనుక కలిపి తీసుకున్నట్లయితే చాలా మంచిది. దీని వలన జీర్ణ క్రియ అనేది కూడా ఎంతో మెరుగుపడుతుంది. రక్తంలోని చక్కెరను కూడా నెమ్మదిగా విడుదల చేయడం జరుగుతుంది. ఆకలిని కూడా అదుపులో ఉంచుతుంది. దీని వలన బరువు కూడా వెంటనే తగ్గుతారు. అయితే చపాతీలను తక్కువగా తీసుకోవడం చాలా మంచిది. అన్నం మానేసిన కూడా అధిక చపాతీలు తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉండవు. కావున తక్కువ మోతాదులో తీసుకోవటం ఆరోగ్యానికి చాలా మంచిది…