Health Benefits : ఈ ఆకు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.. ఇంకా ఎన్నో లాభాలూ ఉన్నాయి.. తెలిస్తే వదిలిపెట్టరు.
Health Benefits : పెద్ద పెద్ద హోటళ్లలో భోజనం చేసిన తర్వాత కిల్లీ ఇస్తారు. ఈ పద్ధతి చాలా కాలం నుంచే ఉంది. అన్నం తిన్న తర్వాత తమలపాకుతో చేసిన కిల్లీ తింటారు. భోజనం తర్వాత పాన్ లేదా తమలపాకు నమలడం దేశంలో పురాతన కాలం నుండి వస్తున్న ఆహార సాంప్రదాయం. ఇలా తమలపాకుల కిల్లీ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. తిన్న ఆహారం మంచిగా జీర్ణం అవుతుంది. ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు పూజలు, పునస్కారాలు చేసుకున్నప్పుడు దేవుని దగ్గర తమలపాకులు పెడతారు. దేవుని దగ్గర పెట్టినవేవీ పడేయకుండా అందరికీ ప్రసాదంగా ఇస్తుంటారు. ఇలా తమలపాకు ఇవ్వడం వెనక పెద్ద వాళ్లు ఉంచిన రహస్యం ఏమిటంటే ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు
చాలా రకాల వంటలు నూనెలో వేయించిన ఆహారాలు, మసాలాలు నిండినవి వడ్డిస్తుంటారు. ఇలా తినడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆహారాన్ని జీర్ణం చేసుకోవడంలో ఇబ్బంది అవుతుంది.దాని వల్ల గ్యాస్, అజీర్ణం, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. తమలపాకు తినడం వల్ల జీర్ణ వ్యవస్థకు చాలా బాగా సహాయపడుతుంది. కడుపులోని ఆమ్లం అన్న వాహికకు తిరిగి పైకి ప్రవహించినప్పుడు అజీర్ణం వస్తుంది. దీనికి సరైన చికిత్స అందించకపోతే నొప్పి, వికారం వంటివి తలెత్తి తీవ్ర అనారోగ్యానికి దారి తీస్తుంది. తమలపాకులు తాత్కాలికంగా సమస్యను పరిష్కరిస్తాయి కాబట్టి పూర్తిగా మందులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.తమలపాకు మంచి నోరు ఫ్రెషనర్ లాగా కూడా ఉపయోగపడుతుంది.
ఆయుర్వేదం ప్రకారం భోజనం తర్వాత తమలపాకు నమలడం ద్వారా జీర్ణక్రియకు శ్రమను తగ్గిస్తుంది. కడుపులో ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని దూరం చేస్తుంది. అలాగే పేగుల్లోని పరాన్నజీవులను నాశనం చేస్తుంది.తమలపాకు సులభంగా అరుగుతుంది. పుదీనా లాంటి ఘాటైన వాసన, రుచి ఇష్టపడనివారు… తమలపాకు నుండి నూనె తయారు చేసి, ఆ నూనెను పొట్టపై మసాజ్ చేయడం ద్వారా కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయి. తమలపాకుల్లో విటమిన్-సి, నియాసిన్, రిబోఫ్లేవిన్ మరియు కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రాత్రి లేత తమలపాకును నీటిలో నానబెట్టి ఉదయమే ఆ నీటిని తాగాలి. దానితోపాటు ఆ లేత తమలపాకును నమిలినా మంచి ప్రయోజనాలు ఉంటాయి.