Moong Halwa : పెసరపప్పు హల్వా ఇలా చేయండి… రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం…!
Moong Halwa : పెసరపప్పు అనేది మన ఆరోగ్యానికి ఎంతో మంచిది అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే పెసరపప్పు తినడం వలన శరీరానికి ఎంతో చలవ చేస్తుంది. ఈ పెసర పప్పుతో ఎన్నో రకాల స్వీట్లు కూడా తయారు చేస్తారు. వాటిలలో మూంగ్ హల్వా కూడా ఒకటి. అయితే ఈ పెసరపప్పుతో చేసే హల్వా ఎంతో ఫేమస్. అలాగే అధికంగా ఫంక్షన్స్ లో ఈ మూంగ్ హల్వాని తయారు చేస్తూ ఉంటారు. ఈ హల్వా ఎంతో రుచిగా […]
ప్రధానాంశాలు:
Moong Halwa : పెసరపప్పు హల్వా ఇలా చేయండి... రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం...!
Moong Halwa : పెసరపప్పు అనేది మన ఆరోగ్యానికి ఎంతో మంచిది అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే పెసరపప్పు తినడం వలన శరీరానికి ఎంతో చలవ చేస్తుంది. ఈ పెసర పప్పుతో ఎన్నో రకాల స్వీట్లు కూడా తయారు చేస్తారు. వాటిలలో మూంగ్ హల్వా కూడా ఒకటి. అయితే ఈ పెసరపప్పుతో చేసే హల్వా ఎంతో ఫేమస్. అలాగే అధికంగా ఫంక్షన్స్ లో ఈ మూంగ్ హల్వాని తయారు చేస్తూ ఉంటారు. ఈ హల్వా ఎంతో రుచిగా ఉంటుంది. దీనిని చేయటం కూడా చాలా ఈజీ. ఈ హల్వా చేయడానికి కేవలం పెసరపప్పు ఒకటి ఉంటే చాలు. అలాగే అతి తక్కువ టైంలోనే ఈ మూంగ్ హల్వా ని కూడా తయారు చేసుకోవచ్చు. మరీ ఈ మూంగ్ హల్వ ని తయారు చేసేందుకు కావలసిన పదార్థాలు ఏమిటి.? మరీ దీనిని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
Moong Halwa మూంగ్ హల్వా తయారీకి కావలసిన పదార్థాలు
-పెసరపప్పు.
-డ్రైఫ్రూట్స్.
-యాలకుల పొడి.
– నెయ్యి.
-పంచదార.
– కుంకుమపువ్వు…
మూంగ్ హల్వా తయారీ విధానం : ముందుగా ఈ హల్వాను తయారు చేసేందుకు పెసరపప్పును శుభ్రంగా క్లీన్ చేసుకుని దాదాపు రెండు గంటలసేపు నానబెట్టుకోవాలి. అప్పుడే ఈ స్వీట్ ఎంతో రుచిగా ఉంటుంది. తర్వాత దీనిలో ఉన్న నీరు తీసేసి మిక్సీలో వేసి దీనిని పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ పెసర పప్పును ఉడకపెట్టలేని వారు కుక్కర్లో వేసి కూడా ఉడికించుకోవచ్చు. ఆ తర్వాత ఒక కడాయి తీసుకుని దీనిలో కొద్దిగా నెయ్యి వేసి చిన్న మంట పై పెట్టాలి. తర్వాత మిక్సీ పట్టిన పెసరపప్పుని వేసి బాగా వేయించుకోవాలి. దీనిని అడుగంటకుంట కలుపుతూ ఉండాలి. దానికి కొద్దిగా సమయం పడుతుంది. తర్వాత పెసరపప్పు అనేది వేగిన తర్వాత మంచి సువాసన వస్తుంది. ఈ పప్పు అనేది వేగాక దీంట్లో ఒక పావు కప్పు పాలు మరియు గోరువెచ్చని నీళ్లు వేసి పది నిమిషాల పాటు సన్నన మంటపై ఉడికించాలి. దాని తర్వాత ఒక కప్పు పంచదార మరియు పాలల్లో నానబెట్టిన కుంకుమ పువ్వు కూడా వేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. అంతే ఎంతో రుచిగా ఉండే పెసరపప్పు హల్వా రెడీ అయినట్లే. చివరగా కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే సరి పోతుంది…