vitamin D : శరీరానికి విటమిన్ డి లభించాలంటే… ఎంతసేపు ఎండలో ఉండాలి… ఏ టైంలో ఉండాలి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

vitamin D : శరీరానికి విటమిన్ డి లభించాలంటే… ఎంతసేపు ఎండలో ఉండాలి… ఏ టైంలో ఉండాలి…!

 Authored By ramu | The Telugu News | Updated on :16 August 2024,10:00 am

vitamin D : మన శరీరానికి విటమిన్ డి అనేది చాలా అవసరం. ఎందుకు అంటే. ఇది మన ఎముకలను బలంగా చేసేందుకు మరియు రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఎంతో మేలు చేస్తుంది. ఈ విటమిన్ డి కి ఉత్తమమైన మార్గం సూర్యకాంతి. కానీ ఒక ప్రశ్న ఏమిటి అంటే. మన శరీరానికి అవసరమైన విటమిన్ డి లభించాలంటే ఎంతకాలం ఎండలో ఉండాలి. ఎప్పుడూ ఉండాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం…

ఎండలో ఎంతసేపు ఉండాలి : రోజుకు 15 నుండి 30 నిమిషాల పాటు ఎండలో ఉండడం వలన మన శరీరానికి విటమిన్ డి అనేది బాగా అందుతుంది. ఈ టైంలో మీ చర్మం రంగు అనేది సూర్యకాంతి యొక్క తీవ్రత పై ఆధారపడి ఉంటుంది. లేత చర్మ ఉన్నవారు మాత్రం 15 నుండి 20 నిమిషాల పాటు ఎండలో ఉండాలి. అలాగే నల్లటి చర్మం ఉన్నవారు అయితే 20 నుండి 30 నిమిషాల పాటు ఎండలో ఉంటే చాలు. అయితే ఈ సూర్యరశ్మిని తీసుకునేందుకు ఉదయం పూట ఉత్తమం అని చెబుతారు. ఎందుకంటే ఈ టైంలో విటమిన్ డి ని ఉత్పత్తి చేసే UVB కిరణాలు ఎక్కువ ప్రభావంతంగా ఉంటాయి…

 vitamin D ఏ సమయంలో ఉండాలి

మనం సూర్యకాంతిని తీసుకునేందుకు ఉత్తమమైన టైమ్ ఉదయం 8 నుండి 11 గంటల మధ్య చాలా మంచిది అని చెబుతారు. ఈ టైంలో సూర్యుడి యొక్క కిరణాలలో UVB కిరణాలు అనేవి అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరంలోని విటమిన్ డి ని ఉత్పత్తి చేసేందుకు ఎంతో మేలు చేస్తాయి. మన చర్మంపై ఈ కిరణాలు అనేవి పడినప్పుడు శరీరం అనేది విటమిన్ డి ని ఉత్పత్తి చేస్తుంది. ఈ కిరణాలు అనేవి ఎముకలను బలంగా చేసేందుకు మరియు రోగనిరోక శక్తి పెంచేందుకు సహాయపడతాయి…

శరీరంలో ఏ భాగాలు సూర్యరశ్మికి గురి కావాలి : మన శరీరంలో 20 నుండి 30% వరకు చేతులు మరియు కాళ్లు లేక విపి సూర్యరశ్మికి గురి కావాలి. దీంతో మీ శరీరానికి తగినంత విటమిన్ డి అనేది దొరుకుతుంది.

vitamin D శరీరానికి విటమిన్ డి లభించాలంటే ఎంతసేపు ఎండలో ఉండాలి ఏ టైంలో ఉండాలి

vitamin D : శరీరానికి విటమిన్ డి లభించాలంటే… ఎంతసేపు ఎండలో ఉండాలి… ఏ టైంలో ఉండాలి…!

జాగ్రత్తలు : సూర్యరశ్మికి ఉండటం వలన మన ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ కూడా ఎక్కువ సేపు సూర్య రశ్మిలో ఉండటం వల్ల చర్మం దెబ్బ తినే అవకాశం కూడా ఉంది. అలాగే చర్మం కూడా కాలిపోతుంది లేదంటే టాన్ కూడా కావచ్చు. అందుకే మీరు 30 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఎండలో ఉన్నట్లయితే లైట్ సన్ స్క్రీన్ ను అప్లై చేసుకోవటం చాలా అవసరం….

విటమిన్ డి ఇతర వనరులు : మీరు గనక ఎండలో బయటికి వెళ్లలేకపోతే అప్పుడు మీరు విటమిన్ డి ని ఇతర వనరుల నుండి కూడా పొందవచ్చు. అవి చేపలు మరియు సల్మాన్, ట్యూనా లాంటి వాటికే మంచి మూలం. ఇవి మాత్రమే కాక విటమిన్ డి అనేది గుడ్డు పచ్చ సోన లో కూడా ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే పుట్ట గొడుగులు కూడా సహజం మూలం అని చెప్పొచ్చు. ఇవి మన శరీరానికి విటమిన్ డి ని అందిస్తాయి. అలాగే ఈ ఆహారాల నుండి మీకు తగిన విటమిన్ డి అనేది అందకపోతే అప్పుడు మీరు వైద్యుల సలహాతో విటమిన్ డి యొక్క సప్లిమెట్లను తీసుకోవచ్చు…

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది