Health Tips : ఎండాకాలంలో గుడ్లు పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?
Health Tips : ఎండాకాలం వచ్చిందంటే అన్నం, కూర పాడవుతుంటాయి. గది ఉష్ణోగ్రతలు పెరిగి పోవడం వల్ల ఉదయం వండిన అన్నం, కూరలు సాయంత్రానికి వాసన వచ్చేస్తాయి. అలాగే కోడి గుడ్లు కూడా ఎండకాలంలో పాడవుతుంటాయి. ఎక్కువ రోజులు నిల్వ చేసేందుకు ఏమాత్రం వీలు ఉండదు. చాలా మంది డజను లేదా ఒక ట్రే గుడ్లను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. కూరగాయలతో సమానంగా ఎగ్ కర్రీ వండుకుంటారు. రోజుకో ఆపిల్ తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం […]
Health Tips : ఎండాకాలం వచ్చిందంటే అన్నం, కూర పాడవుతుంటాయి. గది ఉష్ణోగ్రతలు పెరిగి పోవడం వల్ల ఉదయం వండిన అన్నం, కూరలు సాయంత్రానికి వాసన వచ్చేస్తాయి. అలాగే కోడి గుడ్లు కూడా ఎండకాలంలో పాడవుతుంటాయి. ఎక్కువ రోజులు నిల్వ చేసేందుకు ఏమాత్రం వీలు ఉండదు. చాలా మంది డజను లేదా ఒక ట్రే గుడ్లను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. కూరగాయలతో సమానంగా ఎగ్ కర్రీ వండుకుంటారు. రోజుకో ఆపిల్ తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదని చాలా మంది చెబుతారు. అలాగే రోజుకో గుడ్డు తింటే కూడా చాలా వ్యాధులకు దూరంగా ఉండవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. పిల్లల నుండి పెద్ద వారి వరకూ ప్రతి ఒక్కరూ కనీసం రోజుకో గుడ్డు తినాలని వైద్యులు సూచిస్తుంటారు.
గుడ్డులో పోషకాలు మెండుగా ఉంటాయి. పచ్చ సొనలో కొలెస్ట్రాల్ ఉంటుందని చాలా మంది దానిని తినడానికి ఇష్టపడరు. కానీ.. గుడ్డు మొత్తాన్ని తినేయవచ్చని, ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన పని లేదని వైద్యులు పదే పదే చెబుతారు. రోజుకో గుడ్డు తిన్న వారికి పోషకాలు సమృద్ధిగా అందుతాయని అంటారు. గుడ్డులో తొమ్మిది రకాల ప్రోటీన్లు, శరీరానికి అవసరమైన 9 అమైనో ఆమ్లాలు, బి కాంప్లెక్స్ విటమిన్లు అనేకం ఉంటాయి. అందుకే గుడ్డును మల్టీ విటమిన్ గా చూస్తారు. గుడ్డు తింటే శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచడానికి దోహదపడుతుంది. చాలా మంది గుడ్డును ఇష్టంగా తింటుంటారు. డజన్లు, ట్రేల కొద్దీ కొని ఇంట్లో పెట్టుకుంటారు. కానీ వేసవి కాలంలో గుడ్లు చెడిపోతాయి. ఒకటి రెండు రోజులు అయినా చెడిపోయి విపరీతమైన వాసన వస్తుంది. గుడ్లు అలా పాడవకుండా ఎక్కువ రోజులు ఉంచుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
శుద్ధి చేసిన నూనెను కోడి గుడ్డును ఎక్కువ కాలం భద్రపరచడానికి ఉపయోగించవచ్చు. వంటకు ఉపయోగించే రిఫైన్డ్ ఆయిల్ కొన్ని చుక్కలు తీసుకుని… దానిని గుడ్డు పెంకుపై మెల్లిగా రుద్దాలి. ఇలా చేస్తే గుడ్డు కనీసం 10 నుండి 12 రోజుల వరకు పాడై పోకుండా ఉంటుంది. గుడ్లను కొంత మంది ఫ్రిజ్ లో పెడుతుంటారు. ఇలా అస్సలే చేయకూడదు. గుడ్డు లోపల సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా పెరుగుదల చల్లని ప్రదేశంలో జరుగుతుంది. కాబట్టి గుడ్డును ఫ్రిజ్లో ఉంచినప్పుడు బ్యాక్టీరియా గుడ్డుపైనే కాకుండా ఫ్రిజ్లో నిల్వ ఉంచిన ఇతర వస్తువులు, కూరగాయలకు కూడా వ్యాపిస్తుంది. కాబట్టి గుడ్లను ఫ్రిజ్లో పెట్టడం మానుకోండి. అలాగే కొంత మంది గుడ్లు చాలా కొనుగోలు చేసి ఫ్రీజర్లో భద్రపరుస్తారు. అలా ఉంచినప్పుడు అధిక చలి కారణంగా గుడ్డు పెంకు పగిలిపోయే అవకాశం ఉంది. గుడ్లు ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలంటే వాటిని విడిగా తీసుకుని టిష్యూ పేపర్లో చుట్టాలి.