Health Benefits : ఈ రెండు ముక్కలు కలిపి తీసుకుంటే అధిక బరువు మటుమాయం.. ఇలా చేసి చూడండి
Health Benefits : ప్రస్తుత జీవన శైలిలో అధిక ఒత్తిడి.. టైమ్ కి తినకపోవడంతో ఎక్కువమంది అధిక బరువు, ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు. చాలామంది అధిక బరువు సమస్య నుంచి విముక్తి పొందడానికి మెడిసిన్ వాడితే.. మరికొందరు సర్జరీని ఆశ్రయిస్తున్నారు. కొందరు జిమ్ తో కుస్తి పడుతున్నారు. అయితే ఇవ్వన్నీ ఆరోగ్యానికి, దీర్ఘకాలిక వ్యాధులకు కారకలే అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇలా అధిక బరువులో బాధపడేవారు ఇంట్లోనే సహజంగా చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే.. పొట్ట, తొడల దగ్గర ఉన్న అధిక కొవ్వు కరిగిపోతుంది.అల్లం మన శరీరంలో వేడిని తగ్గిస్తుంది, ఆహారం జీర్ణం అయ్యేలా చేస్తుంది. ఆకలిని తగ్గిస్తుంది.
అందువల్లే అల్లం వాడితే బరువు తగ్గడం గ్యారెంటీ. అల్లాన్ని ఆయుర్వేదం, హోమియోపతి వంటి సాంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తారు. దీనిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ముఖ్యంగా అల్లం నీరు అనేక ఆరోగ్యప్రయోజనాలను చేకూరస్తుంది. ఇక అధిక బరువు.. శరీరంలోని కొవ్వు కరగాలంటే అల్లం, ఖర్జూరం డ్రింక్ మంచి ఫలితాన్ని ఇస్తుంది.ముందుగా నాలుగు లేదా ఐదు ఖర్జూరాలు తీసుకోవాలి. వీటిని చిన్న ముక్కలుగా తరగాలి. వీటితో పాటు ఒక అల్లంముక్క శుభ్రంగా కడిగి పొట్టు తీసేసి చిన్నగా తరగాలి. తరువాత వీటిని ఒక గిన్నె లో వేసి గ్లాసు నీరు పోసి బాగా మరిగించాలి. గోరు వెచ్చగా ఉండగా ఫిల్టర్ చేసుకుని తాగాలి. ఇలా డైలీ మార్నింగ్ తాగడంవలన మంచి ఫలితం ఉంటుంది.
Health Benefits : ఇలా మిశ్రమాన్ని తయారు చేసుకుంటే..
20 గ్రాముల అల్లాన్ని ముక్కలు చేసి మిక్సీలో వేసి అరకప్పు నీరు పోసి గ్రైండ్ చెయ్యాలి. ఈ నీటిని ఫిల్టర్ చేసి అందులో నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా రోజూ రెండు లేదా మూడుసార్లు తాగాలి.తక్కువ సమయంలో ఎక్కువ బరువు తగ్గడానికి కీరదోస ఉపయోగపడుతుంది. కీర దోసలో తక్కువ కేలరీలు ఉంటాయి. అలాగే ప్రోటీన్లు కూడా తక్కువగానే ఉంటాయి. కీర దోస ముక్కలను ఎక్కువగా తీసుకోవాలి. అలాగే రోజుల్లో ఆకలి అనిపించిన ఎన్నిసార్లు అయినా కీర దోస ముక్కలు తినొచ్చు. దీంతో మంచి ఫలితం ఉంటుంది.కొన్ని అల్లం ముక్కలు, కీర ముక్కలు మిక్స్ లో వేసి జ్యూస్ తయారుచేసుకోవాలి. దీన్ని ఫిల్టర్ చేసుకునిడైలీ మార్నింగ్ పరగడుపున తీసుకోవాలి. ఈలా చేస్తే తిన్న ఆహారం కొవ్వుగా మారకుండా శక్తిని ఇస్తుంది.