Curry Leaves : ప్రతిరోజు ఖాళీ కడుపుతో 5 కరివేపాకు ఆకులను తిన్నారంటే… తరువాత మీరు ఆశ్చర్యపోవాల్సిందే…?
ప్రధానాంశాలు:
Curry Leaves : ప్రతిరోజు ఖాళీ కడుపుతో 5 కరివేపాకు ఆకులను తిన్నారంటే... తరువాత మీరు ఆశ్చర్యపోవాల్సిందే...?
Curry Leaves : కరివేపాకుని ఎక్కువగా వంటలలో వినియోగిస్తూ ఉంటారు. కానీ ఈ కరివేపాకు ఆకులని ఉదయానే పరిగడుపున నాలుగు లేదా ఐదు నమిలి తిన్నారంటే, ఆ తర్వాతి ప్రయోజనాలు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి.ఈ కర్వేపాకు కు తీపి వేప అని పేరుతో పిలుస్తారు అనే నిపుణులు చెబుతున్నారు. ఇది సహజ సిద్ధమైన ఔషధమే. రోజువారి ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కరివేపాకు ఆకులు శాస్త్రీయ నామం ముర్రాయ కోయెనిగి. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో మూడు లేదా నాలుగు తాజా కరివేపాకు ఆకులను నమ్మితే అనేక వ్యాధుల నుంచి శరీరం రక్షించబడుతుంది. ఇంకా,శరీరానికి కావలసిన పోషకాలను కూడా సమృద్ధిగా అందిస్తుంది. కరివేపాకు ఆకులను తింటే 5 రకాల ప్రధాన ప్రయోజనాలు ఉన్నాయి.

Curry Leaves : ప్రతిరోజు ఖాళీ కడుపుతో 5 కరివేపాకు ఆకులను తిన్నారంటే… తరువాత మీరు ఆశ్చర్యపోవాల్సిందే…?
ఈ కర్వేపాకులో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపుకి ఎంతో అవసరం. ఇది చీకటి, ఇతర కంటి సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. తప్పకుండా ఈ కరివేపాకును తీసుకుంటే దృష్టిలోపాలు తొలిగుతాయి.. కంటి ఆరోగ్యం కుదుటపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారికి కరివేపాకు దివ్య ఔషధం. ఇందులో హైపోగ్లైసిమిక్ లక్షణాలు ఉన్నాయి. మీ రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రిస్తాయి. శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఫైబర్, ఆంటీ ఆక్సిడెంట్లు, జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఇది అసిడిటీ, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. పరిగడుపున కరివేపాకు నమలడం వల్ల కడుపు శుభ్రం అవుతుంది. తద్వారా, జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
కరివేపాకులో బీటా కెరోటిన్, ఉండుట చేత జుట్టును బలపరుస్తుంది. ఇది స్కాల్ప్ సమస్యలను తొలగిస్తుంది. కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. వేపాకు పొడిని కొబ్బరి నూనెతో కలిపి రాయడం వల్ల జుట్టు పొడవుగా. మందంగా బలంగా మారుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫలమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది కొలెస్ట్రాలు స్థాయిలను తగ్గించి, అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. తద్వారా, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాలు తగ్గుతాయి. ఉదయం ఖాళీ కడుపుతో 3 నుంచి 4 తాజా కరివేపాకులను నమలవచ్చు. కరివేపాకు రసం తాగటం ప్రయోజనకరంగా ఉంటుంది. వీటిని నీటితో తీసుకోవచ్చు. కరివేపాకులను క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చండి.