Curry Leaves | కరివేపాకు తీసివేస్తున్నారా … ఆరోగ్యానికి అద్భుత ఔషధం!
Curry Leaves | పలుచటి ఆకులు అయినా, ఇందులోని ఆరోగ్య గుణాలు మాత్రం అపారంగా ఉన్నాయి. కరివేపాకు మన భారతీయ వంటకాలలో సుగంధద్రవ్యంగా మాత్రమే కాకుండా, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకున్న ఆయుర్వేద ఔషధంగా కూడా విస్తృతంగా ఉపయోగిస్తారు.ఆయుర్వేద నిపుణుల ప్రకారం, పచ్చి కరివేపాకుని ఖాళీ కడుపుతో నమిలితే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇప్పుడు వాటిపై ఒకసారి చూద్దాం…

#image_title
కరివేపాకులో పోషకాలు
కరివేపాకు అనేక విలువైన పోషకాలను కలిగి ఉంటుంది:
విటమిన్లు: విటమిన్ A, B, C, E, B12
ఖనిజాలు: ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, కాల్షియం
ప్రోటీన్లు, పీచు (ఫైబర్)
యాంటీ ఆక్సిడెంట్లు
కరివేపాకు ఆరోగ్య ప్రయోజనాలు
డీటాక్స్ గుణం
ఖాళీ కడుపుతో తింటే మూత్రపిండాల్లో పేరుకుపోయిన టాక్సిన్లను బయటకు తొలగిస్తుంది.
ఫాస్ఫరస్ అధికంగా ఉండడం వల్ల శరీరాన్ని శుభ్రపరిచే గుణం కలిగి ఉంది.
కంటి ఆరోగ్యం
విటమిన్ A సమృద్ధిగా ఉండటం వల్ల చూపు మెరుగవుతుంది.
కంటి సమస్యలు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఇమ్యూనిటీ బలోపేతం
ప్రోటీన్, విటమిన్ C వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
వైరల్, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తుంది.
గుండె ఆరోగ్యం
చెడు కొలెస్ట్రాల్ (LDL) ను తగ్గించి హార్ట్ హెల్త్ మెరుగుపరుస్తుంది.
బీపీ నియంత్రణలో కూడా సహాయపడుతుంది.
జీర్ణక్రియకు మేలు
ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధకం నివారించడంలో ఉపయోగపడుతుంది.
అయితే ఎక్కువగా తీసుకుంటే డయేరియా వచ్చే అవకాశముంది.
రక్తహీనత నివారణ
ఐరన్, ప్రోటీన్ అధికంగా ఉండటంతో రక్తహీనత, ప్రోటీన్ లోపాన్ని తగ్గిస్తుంది.
జుట్టు & చర్మ ఆరోగ్యం
జుట్టు రాలడం, చుండ్రు, ఫంగల్ ఇన్ఫెక్షన్ల నివారణలో సహాయపడుతుంది.
జుట్టు కుదుళ్ల బలానికి, నిగారింపుకు ఉపకరిస్తుంది.
చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతుంది.
మానసిక ఆరోగ్యం
కరివేపాకు వాసన మానసిక ఆందోళన, ఒత్తిడిని తగ్గిస్తుందట.
జ్ఞాపకశక్తిని మెరుగుపరచి అల్జీమర్స్ వంటి వ్యాధులను నివారించవచ్చు.
క్యాన్సర్, నాడీ సంబంధిత వ్యాధుల నివారణ
ఇందులోని యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి.
నాడీ సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి.