Diabetes : షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ అన్నం తింటే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Diabetes : షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ అన్నం తింటే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :2 February 2023,7:00 am

Diabetes : షుగర్ ఉన్న పేషెంట్లు ను రైస్ చాలా తక్కువగా తినాలి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే అన్నం తినడం వలన షుగర్ పెరుగుతూ ఉంటుంది. కావున అన్నం తక్కువగా తినాలి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే వైట్ రైస్ లో గ్లైసోమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది. కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. నిత్యం వాటిని తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ పెరుగుతూ ఉంటుంది. కావున షుగర్ పేషెంట్లు ఈ అన్నాన్ని రోజు తీసుకోకూడదు. అయితే ఇటువంటి టైంలో ఎటువంటి అన్నం తింటే మంచిది మనం చూద్దాం.. షుగర్ వచ్చింది అన్న రోజు నుంచి టెన్షన్ మొదలవుతూ ఉంటుంది. దీంతో ఇంట్లోవాళ్లు తెలిసినవారు కనిపించినవారు. ఇచ్చే సలహాలతో ఇంకా ఆందోళన ఎక్కువవుతూ ఉంటుంది. దీంతో మనకంటే ముందు ఇంట్లో వాళ్లను మనం తినే ఆహారంపై ఆంక్షలు పెడుతూ ఉంటారు.

If you eat this rice Diabetes will be under control

If you eat this rice Diabetes will be under control

వాళ్లు చెప్పడమే కాదు వైద్యులు కూడా అదే చెప్తున్నారు. సమయానికి నిద్రపోండి సరియైన ఆహారం తీసుకోండి. అని చెప్తూ ఉంటారు. అయితే ప్రధానంగా ఆహారం పానీయాలు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కొంచెం జాగ్రత్తగా ఉన్నా షుగర్ పెరిగిపోతూ ఉంటుంది. అన్నం ఇష్టపడి తినేవాళ్ళకి మరింత కష్టంగా మారుతూ ఉంటుంది. వైట్ రైస్, బ్రౌన్ రైస్ కాకుండా మీరు ఇతర రకాల బియ్యం తీసుకోవచ్చు. శుభవార్త ఏమిటంటే ఈ అన్నాన్ని రోజు తీసుకోవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల బ్లడ్ లో షుగర్ పెరగకుండా కంట్రోల్ లో ఉంటుంది. అసలు ఈ అన్న ఏంటి దాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఏ పదార్థాలతో తినవచ్చు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ సామల అన్నం ఎలా తయారు చేయాలి… ముందుగా సామ బియ్యాన్ని శుభ్రంగా కడుక్కోవాలి.

ఇప్పుడు వాటిని 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని పాన్ లేదా ఓపెన్ పాత్రలో ఉడికించుకోవాలి. మీరు తీసుకున్న అన్నం కంటే ఒక ప్లేట్ తో కప్పి తక్కువ మంటపై ఉడికించుకోవాలి. ఈ బియ్యం మాడిపోకుండా సమానంగా ఉడుకుతుందని తెలుసుకోవడానికి మధ్యమధ్య కలుపుతూ ఉండాలి. అలాగే పప్పు, కూరగాయలు, చట్నీ ఊరగాయతో వాటిని తీసుకోండి. చాలా రుచిగా ఉంటూ ఉంటుంది. షుగర్ బాధితులు ఈ అన్నం ఎలా తీసుకోవాలి. షుగర్ ఉన్నట్లయితే మీరు నిత్యం వైట్ రైస్ మానేసి వీటికి బదులు కొన్నిసార్లు బ్రౌన్ రైస్ కొన్నిసార్లు సామల రైస్ తీసుకుంటే చాలా మంచిది. సామలబియాన్ని మిల్లెట్ రైస్ అని కూడా పిలుస్తుంటారు. ఇక నిత్యం ఇటువంటి అన్నాన్ని తీసుకోవచ్చు.

Diabetic Diet: మధుమేహంతో బాధపడేవారు ఈ అన్నం తింటే షుగర్ అస్సలు పెరగదు..  కంట్రోల్ చేస్తుంది.. | If diabetics also eat this Sama Rice, sugar will not  increase and it will be controlled | TV9 ...

ఎందుకంటే సామల బియ్యం ఇండెక్స్ 50 కంటే తక్కువ అంటే అవి చాలా వేగంగా గ్లూకోస్ లెవెల్స్ ని పెంచదు దీని మూలంగా బ్లడ్ లో షుగర్ తక్కువగా ఉంటుంది. ఈ బియ్యాన్ని బార్నియార్డ్ మిల్లెట్ అని కూడా అంటారు. దీనిలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే పైటో కెమికల్స్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వలన అవి శరీరాన్ని నిర్విష్కరణ చేయడానికి కూడా సహాయపడతాయి. శరీరం నుంచి హానికరమైన అంశాలు అనవసరమైన పదార్థాలను తొలగించుకోవచ్చు. అయితే వాటిని నిత్యం పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. ఎక్కువ తినడం వల్ల బ్లడ్ లో షుగర్ చాలా తక్కువ అవుతుంది..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది