Diabetes : షుగర్ వ్యాధిగ్రస్తులు అలెర్ట్ శరీరంలోని ఆ భాగాలపై షుగర్ ఎఫెక్ట్.. అలెర్ట్ అవ్వకపోతే డేంజర్ లో పడినట్లే…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Diabetes : షుగర్ వ్యాధిగ్రస్తులు అలెర్ట్ శరీరంలోని ఆ భాగాలపై షుగర్ ఎఫెక్ట్.. అలెర్ట్ అవ్వకపోతే డేంజర్ లో పడినట్లే…!!

 Authored By prabhas | The Telugu News | Updated on :25 January 2023,7:40 am

Diabetes ; ప్రస్తుత కాలంలో వయసు తరహా లేకుండా చాలామందిని ఎంతో బాధ పెడుతున్న వ్యాధి షుగర్. ఈ షుగర్ శరీరంలోని కొన్ని అవయవాలను తీవ్రంగా ఎఫెక్ట్ చేస్తుంది. ఫలితంగా ఆయా శరీర భాగాలతో సంబంధం ఉన్న జబ్బులు ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడానికి కారణమవుతోంది. ఒకప్పుడు పెద్దవాళ్లకి పరిమితమైన ఈ వ్యాధి ప్రస్తుతం 30 ఏళ్ల వారిలోనూ కనిపిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం మనదేశంలో 18 ఏళ్ల పై పడిన వారిలో సుమారు ఏడు కోట్ల మందికి పైగా షుగర్ తో ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా మరో రెండున్నర కోట్ల మంది ఫ్రీ డయాబెటిస్తో బాధపడుతున్నారు. దీనిని సాధారణ రోగంలో అని వదిలేయడానికి లేదు బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని ఎప్పటికప్పుడు కంట్రోల్లో ఉంచకపోతే దీర్ఘకాలంలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది.

కొన్నిసార్లు ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. ఇది జీవనశైలి వ్యాధి కనుక ఒకసారి వచ్చిందంటే జీవితాంతం తొలగించడం కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ షుగర్ ని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. అని నిపుణులు తెలుపుతున్నారు. నరాలు: షుగర్ రెటినో పతి నెప్రోపతి మాదిరిగానే బ్లడ్ లో అధిక షుగర్లు డయాబెటిక్ న్యూరోపతి అని పిలిచే నరాల దెబ్బతీయడానికి కారణమవుతుంది. ఈ పరిస్థితిలో తిమ్మిరి లేదా నొప్పి ఉష్ణోగ్రతను అనుభవించే సామర్థ్యం తగ్గిపోవడం, నొప్పులు మంట లాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే తీవ్రమైన పాదాల పోతలు, అంటువ్యాధులు లాంటి మరిన్ని లక్షణాలకి దారితీస్తాయి.. చిగుళ్ళు: ఇది బ్లడ్ లో అధిక చక్ర తో ముడిపడి ఉన్న ఒక సాధారణ పరిస్థితి ఇది సాధారణ చిగుళ్ళకు రక్తానికి తీసుకెళ్లే రక్తనాళాలు మందంగా తయారవడం వలన సంభవిస్తుంది. దీంతో కండరాలు కూడా బలహీనపడతాయి. చిగుళ్లలో రక్తస్రావం నొప్పి అంటే లక్షణాలు కనిపిస్తాయి.

Diabetics alert to the effect of sugar on those parts of the body

Diabetics alert to the effect of sugar on those parts of the body

గుండె రక్తనాళాలు : అధిక బ్లడ్ షుగర్ రక్తనాళాలకు ప్రమాదం కలిగిస్తుంది. కావున షుగర్ వల్ల స్ట్రోకు గుండె జబ్బులతో పాటు కార్డియో మాస్కర్ సమస్యలు ప్రమాదం ఉంటుంది. షుగర్ ఉన్న వ్యక్తులు అధిక రక్తపోటుతో పాటు గుండె జబ్బులు ప్రమాదాన్ని పెంచే ఇతర పరిస్థితులను కూడా కలిగి ఉంటుంది.కళ్ళు : రక్తంలో అధిక చక్కెర లెవెల్స్ ను కంటి రెటీనాలోని రక్తనాలపై ప్రభావం చూపుతాయి. ఈ సమస్యకు చికిత్స చేయకుండా నిర్లక్ష్యంగా వదిలేస్తే దృష్టి నష్టం కలగడంతో పాటు అందత్వానికి కూడా దారితీస్తుంది. మూత్రపిండాలు : మూత్రపిండాలు శరీరంలోని విష పదార్థాలు వ్యర్ధాలను ఫిల్టర్ చేయడంలో ఉపయోగపడతాయి. కిడ్నీలలో ఉండే చిన్న రక్తనాళాలకు బ్లడ్ లో అధిక చక్కెర హాని కలిగిస్తుంది. కావున మూత్రంలో ప్రోటీన్ మాత్రం విసర్జన అవసరం పెరగడం రక్తపోటు నియంత్రణ మరి దిగజారటం అలసట ఎన్నో లక్షణాలు ఇలా కనిపిస్తూ ఉంటాయి. పాదాలు : షుగర్ పాదాలపై కూడా ఎఫెక్ట్ చూపుతుంది. నరాలు దెబ్బ తినడం

అనేది పాదం ఎలాంటి అనుభూతిని పొందకుండా చేస్తుంది. దీనికి చికిత్స చేయకుండా వదిలేస్తే కాలక్రమమైన పాదాలను తొలగించాల్సి వచ్చే ప్రమాదం ఉంటుంది.ఈ ఆహారాలు కి దూరంగా ఉండాలి : బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్లయితే ఈ ఆహారాల్లో నియమాలను పాటించడం అవసరం. ఆహారాలు వైట్ రైస్, రొట్టెలు, పాస్తా, రుచిగల పెరుగు, తియ్యటి త్రుణాదన్యాయాలు, డ్రై ఫ్రూట్స్ ఇలా మొదలైనవి తినడం మానుకోవాలి. ఈ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ప్రోటీన్లు పీచు పదార్థాన్ని తీసుకోవడం చాలా మంచిది. ఈ షుగర్ వ్యాధికి నివారణ : షుగర్ సమస్య ఎవరికైనా వచ్చే అవకాశం ఉంటుంది. నాణ్యతమైన ఆహారం జీవన శైలి లేకపోవడం, కూడా మధుమేహాన్ని వెల్కమ్ చెప్పినట్లే.. అయితే షుగర్ రాకుండా జాగ్రత్త పడడానికి ఎన్నో దారులు ఉన్నాయి. ఆరోగ్యకరమైన జీవన శైలిని అనుసరించడం వలన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. డయాబెటిస్తో పాటు దీర్ఘకాలిక అనారోగ్యాలు ప్రమాదం తగ్గించడానికి ఆరోగ్యకరమైన పోషకమైన తక్కువ ప్రాసెస్ చేయబడిన ఆహారాన్ని తప్పనిసరిగా మానుకోవాలి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది