Pigmentation Marks : వీటిని రోజు వారి ఆహారంలో తీసుకుంటే చాలు… ముఖం పై ఉన్న తెల్ల మచ్చలకు చెక్ పెట్టినట్లే…!!
Pigmentation Marks : మహిళలు చాలా మంది చర్మ సౌందర్యం కోసం తెగ తారాసపడతారు. ముఖ్యంగా మచ్చలు పులిపెర్లు, మొటిమలు, ముడతలు ఇలాంటివి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఏవేవో ఫేస్ ప్యాక్ లు కూడా ట్రై చేస్తూ ఉంటారు. అయితే కొందరిలో కొన్ని విటమిన్స్ లోపాల వలన కూడా మచ్చలు అనేవి ఏర్పడతాయి. దీనిని ప్రిగ్మెంటేషన్ అని కూడా అంటారు. దీని వలన చిన్న వయసులోనే పెద్దవారిగా కనిపిస్తూ ఉంటారు.
ముడతలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి.. దీనికోసం ఎన్నో వ్యయా ప్రయాసలు పడుతూ కాస్మోటిక్స్ వాడుతూ ఐరానా పడిపోతూ ఉంటారు. మరికొందరు అయితే ముఖం చూపించేందుకు కూడా ఇష్టపడరు. కొందరు ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు కూడా పరదాలు వేసుకుంటూ కవర్ చేసుకుంటారు. అలాంటి వారు ఎలాంటి లేపనాలు మరియు చర్మ సౌందర్య సాధనాలు వాడకుండా సింపుల్ గా మచ్చలు తొలగించుకోవచ్చు. కేవలం ప్రతిరోజు 10 బాదంపప్పులను తీసుకోవడం వలన కూడా ఈ సమస్యలను అధిగమించవచ్చు.
మరీ ఎక్కువగా తీసుకున్న కూడా గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి..బాదం పప్పులో విటమిన్ – ఇ తో పాటుగా ఎన్నో పోషక పదార్థాలు ఎక్కువగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే. అన్ శ్యాచురేటెడ్ కొవ్వులు ఈ మచ్చలు తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇలా బాదం పప్పులు ఎక్కువగా తినడం వలన తెల్లని మచ్చలకు దూరం చేసుకోవచ్చు..