Lip Care : మీ పెదాలు గులాబీ రంగులో అందంగా మెరిసిపోవాలంటే … రోజు ఈ చిట్కా పాటించండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Lip Care : మీ పెదాలు గులాబీ రంగులో అందంగా మెరిసిపోవాలంటే … రోజు ఈ చిట్కా పాటించండి…!

 Authored By ramu | The Telugu News | Updated on :12 December 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Lip Care : మీ పెదాలు గులాబీ రంగులో అందంగా మెరిసిపోవాలంటే ... రోజు ఈ చిట్కా పాటించండి...!

Lip Care : చాలామందికి గులాబీ రంగులో పెదాలు అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ కొందరుకు ఇది సాధ్యం కాదు. దీంతో రకరకాల చిట్కాలు ఫాలో అవుతుంటారు. అయితే ఈ విధంగా సింపుల్ చిట్కాని ట్రై చేసి చూడండి. వారం రోజుల్లోనే మీకు అందమైన పింక్ లిప్స్ మీ సొంతం అవుతాయి. అందమైన గులాబీ పెదవులు ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి. అందరికీ అందంగా ఉండాలని అనిపిస్తుంది. కానీ కొందరికి అది సాధ్యం కాదు. అలాంటి సమయంలోనే కొన్ని చిట్కాలను ప్రయోగం చేస్తే అందం మీ సొంతం చేసుకోవచ్చు. అలాగే అందమైన గులాబీ పెదవులు ముఖ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తాయి. అందుకే అమ్మాయిలు తమ వెధవలు మృదువుగా అందంగా ఉంచుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ కొంతమందికి కొన్నిసార్లు పెదవులపై తెల్లటి మచ్చలు కూడా ఏర్పడుతుంటాయి. అయితే ఇటువంటి తెల్ల మచ్చల్ని సులభంగా పోగొట్టుకోవడానికి ఈ క్రింది హోమ్ రెమెడీస్ ను ప్రయత్నించండి.

Lip Care మీ పెదాలు గులాబీ రంగులో అందంగా మెరిసిపోవాలంటే రోజు ఈ చిట్కా పాటించండి

Lip Care : మీ పెదాలు గులాబీ రంగులో అందంగా మెరిసిపోవాలంటే … రోజు ఈ చిట్కా పాటించండి…!

Lip Care గులాబీ రంగు పెదాలకు హోమ్ రెమెడీస్

కొన్ని నీటిలో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసి, కాటన్ బాల్ అందులో వేసి బాగా నానబెట్టాలి. అనంతరం దానితో పది నుంచి పదిహేను నిమిషాల పాటు పెదాలపై ఉంచాలి. ఇలా చేయటం వల్ల తెల్ల మచ్చలు సులభంగా తొలగిపోతాయి. రెమిడి చాలా ఈజీగా ఉంది కదా. ఈ రెమిడి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ముందుగా వెల్లుల్లి రెబ్బలను దంచి అందులో బాదం నూనె వేసి, బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత దీన్ని రోజు మీ పెదవులపై అప్లై చేయాలి. పెదాలపై అప్లై చేసిన తర్వాత కొన్ని నిమిషాలకు గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇది ఒక ఎఫెక్టివ్ హోమ్ రెమిడి. ఇది పెదాలను చాలా అందంగా మృదువుగా మారుస్తాయి. పెదాలపై ఏర్పడే తెల్లటి మచ్చలపై కొబ్బరి నూనెను రాసి మర్దన చేస్తే, రెండు వారాల్లో మచ్చలు పోతాయి. రెండు చెంచాల ఆవాల నూనెను, ఒక చెంచా అరసిపొడిని కలిపి మచ్చలపై రాసిన మచ్చలు తొలగిపోతాయి.

ఈ చిట్కా చాలా సులభమైనది. అలాగే ఆపిల్ సైడర్, వెనిగర్ ను ఒక బౌల్లో వేసి దానిలో ఒక కాటన్ బాల్ ఉంచాలి. ఆ కాటన్ బాల్ను తీసుకొని పెదవులపై మచ్చలు ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. పది నిమిషాలు అలాగే ఉంచి గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. పెదవులు మరకలు ఉన్న ప్రదేశంలో ఆలివ్ ఆయిల్ రాసి గంట సేపు అలాగే ఉంచి గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ఇంటి చిట్కాని రోజుకి రెండు లేదా మూడు సార్లు అప్లై చేస్తే మచ్చలు సులువుగా తొలగిపోతాయి. అలాగే పెదవులు లేత గులాబీ రంగులో ఉండడమే కాకుండా మృదువుగా అందంగా కనిపిస్తాయి. మీ అందం మరింత రెట్టింపు అవుతుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది