Monsoon Season : అసలే వర్షాకాలం… ఈ టైంలో ఇలాంటి అలవాట్లు మీ కొంపముంచుతాయి…?
ప్రధానాంశాలు:
Monsoon Season : అసలే వర్షాకాలం... ఈ టైంలో ఇలాంటి అలవాట్లు మీ కొంపముంచుతాయి...?
Monsoon Season : వర్షాకాలంలో కొన్ని పనులు అస్సలు చేయకూడదు.కొన్ని ఆహారపు అలవాట్ల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండి, జాగ్రత్తగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. సాధారణంగా చాలామంది కూడా వర్షాకాలంలో నీరు చాలా తక్కువగా తాగుతారు. ఎందుకంటే వాతావరణం చల్లగా ఉంటుంది. కాబట్టి దాహం తక్కువగా కావడంతో నీళ్లు తక్కువగా తీసుకుంటారు.ఇలాంటి అలవాటు మార్చుకోవడం చాలా మంచిదన్నారు ఆరోగ్య నిపుణులు. లేకుంటే త్వరలో మీకు అనారోగ్య సమస్యలు ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. దాహం వెయ్యకుండా సరే నీరు తాగే అలవాటు తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకున్న వారవుతారు. వర్షాకాలంలో సాధారనంగా దాహం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి, నీళ్లు చాలా తక్కువ తీసుకుంటారు. ఇలాంటి అలవాటు ఉంటే వెంటనే మార్చుకుంటే మంచిది. లేకుంటే మీకు అనారోగ్యం రావడం తథ్యం. మీరు ప్రతి రోజు దాహం వేయకుండానే నీటిని తాగారో మీ ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో నీటిని తక్కువగా తీసుకుంటే మాత్రం చాలా ప్రమాదం వాటిల్లుతుంది. వర్షాకాలంలో తక్కువ నీటిని తీసుకుంటే కలిగే అనారోగ్య సమస్యలు ఏమిటో తెలుసుకుందాం…
Monsoon Season : అసలే వర్షాకాలం… ఈ టైంలో ఇలాంటి అలవాట్లు మీ కొంపముంచుతాయి…?
Monsoon Season శరీర బలహీనత :
రోజు ఉత్సాహంగా పని చేయాలంటే శరీరానికి తగినంత నీరు అవసరం అలాగే శక్తి అవసరం కాబట్టి,దీనికోసం క్రమం తప్పకుండా ప్రతిరోజు నీరు తాగడం అవసరం. లేకపోతే చిన్న పనులు చేసినా కూడా త్వరగా అలసిపోతారు.
మలబద్ధకం : శరీరంలో తగినంత నీటి శాతం లేకపోతే మలబద్ధకం వంటి సమస్య తలెత్తుతుంది. కాబట్టి, సరైన మందులు సకాలంలో తీసుకోవాలి. మూల శంఖం వంటి వ్యాధులు కూడా వస్తాయి. అందుకే వర్షాకాలంలో తక్కువ నీరు తాగడం దీర్ఘ సమస్యలకు దారితీస్తుంది.
చర్మ సంబంధిత సమస్యలు : ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం..తక్కువ నీటి శాతం శరీరంలో ఉంటే చర్మం దాని మెరుపును కోల్పోతుంది.ముఖంలో ప్రకాశం ఉండదు. మొటిమలు ఇతర చర్మ సంబంధిత సమస్యలు ప్రారంభమవుతాయి.శరీరంలో వేడి పెరుగుతుంది.నీరు తాగే అలవాటు చర్మానికి హైడ్రేటుగా ఉంచుతుంది. చర్మం పొడి వారికుంట చేస్తుంది తద్వారా చర్మ సమస్యలు ఎలర్జీస్ రావు.
మూత్ర పిండాల సంబంధిత సమస్యలు : మూత్ర పిండాలు మన శరీరం నుంచి విషాన్ని తొలగించి వేస్తుంది. కానీ శరీరంలో నీటి కొరత ఉంటే అది మూత్రపిండాల ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. చాలామందికి తెలియకుండా తక్కువ నీరు తాగుతుంటారు. ముద్రపిండాల సమస్యలను ఆహ్వానిస్తారు.
మూత్రనాల ఇన్ఫెక్షన్లు :శరీరంలో నీటి స్థాయి తగ్గితే మూత్రణాల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజుకు కనీసం మూడు లీటర్ల నీరు తాగాలి. కాబట్టి,ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగినంత నీరు తాగాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చల్లటి వాతావరణం అయినా నీటిని తాగడం మాత్రం మానవద్దు.