Monsoon Season : వర్షాకాలంలో ఈ జ్యూస్… ఆరోగ్యానికి భలేగా పనిచేస్తుందండోయ్… వ్యాధులన్ని హమ్ ఫట్…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Monsoon Season : వర్షాకాలంలో ఈ జ్యూస్… ఆరోగ్యానికి భలేగా పనిచేస్తుందండోయ్… వ్యాధులన్ని హమ్ ఫట్…?

 Authored By ramu | The Telugu News | Updated on :11 August 2025,8:00 am

Monsoon Season : సాధారణంగా వైద్యులు వర్షాకాలంలో కొన్ని రకాల పండ్లను తినాలని చెబుతుంటారు. వర్షాకాలంలో కొన్ని రకాల జ్యూసులు తాగితే కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముసంబి జ్యూస్ అంటే బత్తాయి జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు నిపుణులు. ఈ బత్తాయి జ్యూస్ తాగినట్లయితే ఎన్నో రకాల వ్యాధులను నిర్మూలించవచ్చు. సీజనల్గా వచ్చే వ్యాధులను అరికడుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే అంటూ వ్యాధులకు ఇంకా దీర్ఘకాలిక వ్యాధులకు చెక్ పెడుతుంది. ఈ బత్తాయి చూసి క్రమం తప్పకుండా వర్షాకాలంలో తీసుకున్నట్లయితే ఈ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.మరి ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం…

Monsoon Season వర్షాకాలంలో ఈ జ్యూస్ ఆరోగ్యానికి భలేగా పనిచేస్తుందండోయ్ వ్యాధులన్ని హమ్ ఫట్

Monsoon Season : వర్షాకాలంలో ఈ జ్యూస్… ఆరోగ్యానికి భలేగా పనిచేస్తుందండోయ్… వ్యాధులన్ని హమ్ ఫట్…?

Monsoon Season బత్తాయి జ్యూస్ లో పోషకాలు

పొటాషియం కంటెంట్ అధికంగా ఉండడం చేత రక్తపోటును నియంత్రిస్తుంది అధిక రక్త పోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గ్యాలరీలు చాలా తక్కువ,దాంతో కడుపు నిండిన అనుభూతి కూడా ఉంటుంది.ఇది ఆహారంలో చేర్చుకుంటే ఫలితం ఉంటుంది. ఇది మీ ఆహారంలో తప్పకుండా తీసుకుంటే జీర్ణ సమస్యలు, పేగు కదలికలు,మలబద్దక వంటి సమస్యలు నయమవుతాయి.

బత్తాయి జ్యూస్ ప్రయోజనాలు : వైద్యులు సిఫారసు చేసేది ఏమిటంటే వర్షాకాలంలో బత్తాయి జ్యూస్ తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు కలుగుతాయి అంటున్నారు. ఈ కాలంలో జ్యూస్ లేదా పండును నేరుగా తీసుకున్న కూడా ప్రయోజనాలు అందుతాయి అంటున్నారు. బత్తాయిలో విటమిన్ సి పాస్పరస్ పొటాషియం అంటివి పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల రోగనిరోధక శక్తి జరుగుతుంది. ఎక్కువగా వర్షాకాలంలోనే లభిస్తుంది కాబట్టి దీనిని తీసుకున్నట్లయితే అనారోగ్య సమస్యలను పారద్రోలవచ్చు.వర్షా కాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడుటకు ఈ బత్తాయి జ్యూస్ బాగా సహకరిస్తుంది.

ముసాంబి జ్యూస్ ని క్రమం తప్పకుండా తీసుకుంటే జీర్ణ సమస్యలు, పేగు కదలికలు, మలబద్ధకం వంటి సమస్యలు పూర్తిగా తగ్గుతాయి. విసర్జన వ్యవస్థలో ఉన్న మలిన పదార్థాలను తొలగించడానికి బత్తాయి జ్యూస్ ఎంతో సహకరిస్తుంది. ఇంకా విరోచనాలు, వాంతులు వికారం కూడా తగ్గిపోతుంది.బత్తాయి జ్యూస్, యాంటీ ఆక్సిడెంట్లు,యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండడంతో కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. బత్తాయి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.మీకు రక్త ఫోటు సమస్యను రాకుండా చేస్తుంది. లేదా రక్త పోటు సమస్య ఉంటే దానిని హృదయ స్పందన వ్యాధుల బారిన పడకుండా మిమ్మల్ని రక్షిస్తుంది. ఈ జ్యూస్ లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ లో వృద్ధాప్య సంకేతాలను నిర్మిస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. పర్యావరణ కారకాల వల్ల చర్మం దెబ్బ తినకుండా నిరోధిస్తుంది. తద్వారా ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందవచ్చు. పొటాషియం కంటెంట్ ఉండడం చేత రక్తపోటును నియంత్రిస్తుంది.అధిక రక్తపోటు ప్రమాదానికి దారి తీయకుండా కాపాడుతుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది