Health Benefits : కాలీఫ్లవర్ కన్నా దాని ఆకులు, వేర్ల ఆరోగ్య రహస్యం తెలిస్తే మీరు అస్సలు వదిపెట్టరు..!
Health Benefits : శీతాకాలంలో బాగా దొరికి ఫ్లవర్ క్యాలీఫ్లవర్. క్యాలీఫ్లవర్ తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న వెజిటేబుల్. దీంతో పచ్చళ్ళు, కూరలు, పరోటాలు, బజ్జీలు కూడా వేస్తూ ఉంటారు. అయితే కొంతమంది తెల్లటి బాగానే మాత్రమే తినడానికి ఎక్కువగా మక్కువ చూపుతూ ఉంటారు. అయితే దీని ఆకులు వేర్లు కూడా ఎంతో గొప్ప ఔషధ గుణాలు కలిగి ఉన్నాయని మీకు తెలియదు.. ఈ క్యాలీఫ్లవర్ కోసేటప్పుడు దాని ఆకులు వేర్లు తీసి పడేస్తూ ఉంటారు.. అయితే ఈ ఆకుల గురించి కొన్ని రహస్యాలు తెలుసుకోవాలి. క్యాలీఫ్లవర్ ఆకులు ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడతాయి. దీనిలో క్యాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఫ్లవర్ కంటే రెండు రెట్లు అధికంగా ఫైబర్, ప్రోటీన్ ఫాస్ఫరస్ మూడు రెట్లు ఖనిజాలను కలిగి ఉంటుంది.
దీన్ని నిత్యం వాడడం వలన ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. క్యాలీఫ్లవర్ వండుకొని తింటూ ఉంటారు. కానీ కోసే ముందు దాని ఆకులు మాత్రం తీసి వేస్ట్ గా పడేస్తుంటారు. వాస్తవానికి క్యాలీఫ్లవర్ ఆకులలో ఎన్నో పోషకాలు ఉంటాయి. కాలీఫ్లవర్ ఆకులతో కళ్ళకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ జనరల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇంజనీరింగ్ రీఛర్చ్ ప్రకారం క్యాలీఫ్లవర్ ఆకులలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. అని తెలియజేశారు. దీనిని వాడడం రెటీనలో లెవెల్స్ పెరుగుతుంది. ఇది కళ్ళు ఆరోగ్యంగా ఉంచడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఈ ఆకులలో తక్కువ మొత్తంలో కార్బోహైడ్రేటులతో పాటు అధిక ప్రోటీన్లు ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి. కావున దీనిని తీసుకోవడం వలన రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. షుగర్ వ్యాధిగ్రస్తులు అయితే దానిని ఎన్నో మార్గాలలో ఆహారంలో చేర్చుకోవచ్చు..
ఈ ఆకులు యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇంప్లిమెంటరీ లక్షణాలతో నిండి ఉంటుంది. ఇవి అనేక రకాల తీవ్రమైన గుండె జబ్బుల నుంచి రక్షించడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా దీనిలో తక్కువ కొవ్వు అధిక ఫైబర్ కంటెంట్ మూలంగా ఇది కార్డియాకు సహాయంగా ఉంటుంది. ఈ ఆకులు క్యాల్షియం యొక్క ఉత్తమ మూలం దీని మూలంగా ఎముకలు నొప్పి, మోకాలు నొప్పి, బోలె ఎముకలు వ్యాధితో ఇబ్బంది పడుతున్న వాళ్లు క్యాలీఫ్లవర్ ఆకులు తీసుకోవడం వలన ఎంతో మేలు జరుగుతుంది. క్యాలీఫ్లవర్ ఆకుల్లో ఐరన్, క్యాల్షియం అధికంగా ఉంటాయి. ఇతర కూరగాయలతో పోల్చి చూస్తే క్యాలీఫ్లవర్ ఆకుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది.
దీనిలో ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇవి ఎముకలను దృఢంగా ఉంచడమే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.అలాగే శరీరంలో జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. 100 గ్రాముల క్యాలీఫ్లవర్ ఆకుల్లో 600 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. డైరీ ప్రొడక్షన్ అంటే అలర్జీ ఉన్నవాళ్లు క్యాలీఫ్లవర్ ఆకులను ఆహారంలో చేర్చుకుంటే శరీరంలో క్యాల్షియం బ్యాలెన్స్ జరుగుతుంది. ఒక పరిశోధన ప్రకారం క్యాలీఫ్లవర్ ఆకులను ఖనిజాలకు మంచి నిలయం. ఇవి పిల్లలు పెరుగుదల అభివృద్ధికి చాలా బాగా ఉపయోగపడతాయి.
పుల్లటి ఆకులను రోజు తీసుకోవడం వలన పోషక ఆహార లోపం ఉన్న పిల్లలకు ఆరోగ్య ఉపయోగాలు పొందుతారు. ఇది వాళ్ళ బరువు, హిమోగ్లోబిన్, ఎత్తు లెవెల్స్ కూడా పెంచుతాయి. అలాగే న్యూట్రిషన్ డయాబెటిస్ విభాగం ప్రచురించిన ఒక పరిశోధన ప్రకారం క్యాలీఫ్లవర్ ఆకులు ఐరన్ యొక్క గొప్ప మూలం. అలాంటి పరిస్థితులలో దానిని తీసుకోవడం వలన రక్తం లోపాన్ని కూడా తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. 100 గ్రాముల ఈ ఆకులను 40 ఎంజి ఇనుము అందిస్తుంది. అలాగే శాస్త్రీయ పరిశోధనలో రక్తహీనత చికిత్సలో క్యాలీఫ్లవర్ ఆకులను బాగా ఫలితాలను ఇస్తున్నట్లు బయటపడింది…