Health Problem : జాగ్రత్త… మీ శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఈ వ్యాధి సోకినట్లే… ఈ చిన్న చిట్కాతో సెట్…!!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 25 March 2024, 12:00 pm

Health Problem : వేసవికాలంలో అడుగుపెట్టేసాం. ఈ మండే ఎండల్లో బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే శరీరం డిహైడ్రేషన్ గురవుతూ ఉంటుంది.. కాబట్టి ఈ ఎండల్లో బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి.. అయితే ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్ని వ్యాధులు ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపిస్తూ ఉంటాయి. ఈ సమయంలో అందర్నీ వేధించే సమస్య కామెర్లు.. ఈ కామెర్లు నెమ్మదిగా వ్యాపిస్తుంటాయి. ఈ వ్యాధి మొదట్లో ఎటువంటి లక్షణాలు కనబడవు.. ఇటువంటి పరిస్థితుల్లో కొంచెం అశ్రద్ధ చూపిన ప్రాణాలకే ప్రమాదం. అందువలన ఈ వ్యాధిని మొదట్లోనే గుర్తిస్తే త్వరగా తగ్గించుకోవచ్చు.. నిజానికి కామెర్లు ఉన్న మనిషి శరీరం పూర్తిగా రంగు మారిపోతూ ఉంటుంది. లివర్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ ఆరోగ్య సమస్య వస్తుంది.

జ్వరం, చలి అలసట, నీరసం, కీళ్ల నొప్పులు వికారం వాంతులు, పసుపు రంగు మూత్రం ,తలనొప్పి గోళ్లు రంగులు మార్పులు, కళ్ళు చర్మం పూర్తిగా మార్పులు ఈ వ్యాధి లక్షణాలు.. కామెర్లు ఉన్నప్పుడు ఆ వ్యక్తి కళ్ళు పసుపు రంగులోకి మారడంతో పాటు అతను ముఖం పసుపు రంగులోకి వస్తుంది. ఈ లక్షణాలు ఉంటే కామెర్లు ఉన్నట్లే ఈ వ్యాధికి ఆహారంలో మార్పులతో పాటు మందులు తీసుకోవడం చాలా అవసరం. చిన్నపాటి నిర్లక్ష్యం చేసిన ప్రాణాలు పోగొట్టుకున్నట్లే..

ఈ కామెర్లకు నివారణ చిట్కాలు :

*కామెర్లు ఉన్న వ్యక్తులు శరీరంలో తగినంత నీరు ఉండేలా చూసుకోవాలి. నిమ్మరసం, పుచ్చకాయ రసం తీసుకోవాలి.
*ఒక గ్లాస్ చెరుకు రసంలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల కామెర్ల నుంచి ఉపశమనం కలుగుతుంది.

*టమాటో రసాన్ని ఉప్పు పంచదార కలిపి నిత్యం తాగడం వలన కామెర్లు త్వరగా తగ్గుతాయి..
*జామకాయ కషాయాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కామెర్లు తగ్గుముఖం పడతాయి.
*గ్రీన్ టీ కాఫీ మితమైన వినియోగం ఖాళీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ వ్యాధిని కంట్రోల్ చేయడానికి చాలా బాగా సహాయపడతాయి.
*కామెర్ల నుండి త్వరగా కోలుకోవాలంటే ఆహారంలో 3-4 వెల్లుల్లి రెబ్బలు చేర్చుకోండి. దీనివలన మంచి ఫలితం ఉంటుంది..
*కొబ్బరినీళ్ళతో తయారుచేసిన వెనిగర్ తీసుకోవడం వల్ల మంట తగ్గుతుంది. ఇది కాలేయం దెబ్బతినే ప్రమాదాన్ని తగ్గిస్తుంది..
*నల్ల జీలకర్ర కషాయాలను తీసుకోవడం వల్ల కూడా మంచి ఉపశమనం కలుగుతుంది.
*కామెర్లు ఉన్న వ్యాధిగ్రస్తులు మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిలో కొద్దిగా బార్లీని వేసి బాగా మరిగించి ప్రతిరోజు తీసుకోవాలి..
*కామెర్లు ఉన్నవారు వేపరసాన్ని తాగడం వలన కామెర్ల నుంచి త్వరగా కోలుకుంటారు..

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp