Rudraksha : రుద్రాక్షను ధరించండి… ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టండి…!
ప్రధానాంశాలు:
Rudraksha : రుద్రాక్షను ధరించండి... ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టండి...!
Rudraksha : రుద్రాక్ష అనేది ఆయుర్వేదంలో ఔషధ గుణాల గని అని చెబుతారు. అయితే ఇది ఎన్నో సమస్యలను నుండి కూడా ఉపశమనం కలిగించగలదు. ఈ రుద్రాక్ష అనేది వృక్ష శాస్త్రపరంగా ఎలియోకార్పాస్ గానిట్రస్ అని పిలవబడే ఔషధ మొక్క యొక్క విత్తనం. ఇది మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఇది భారతీయ సాంప్రదాయ ఔషధం అని చెప్పొచ్చు. అయితే ఈ ఆయుర్వేద వైద్యంలో ఎన్నో రకాల వ్యాధులను నయం చేయడానికి దీనిని ఎక్కువగా వాడతారు.అయితే ఆయుర్వేద ప్రకారం చూసినట్లయితే, ఈ రుద్రాక్ష మానసిక ఆరోగ్యాన్ని మరియు గుండె సమస్యలు, ఎన్నో ఇతర శారీరక సమస్యలను కూడా దూరం చేస్తుంది. అలాగే రుద్రాక్షను ఆయుర్వేదంలో మహా ఔషధ సంజీవినిగా చెబుతూ ఉంటారు…
ఈ రుద్రాక్ష భయానక సమస్యలను కూడా నయం చేయగలదు. అలాగే ఇతర రకాల రుద్రాక్షలను వాడడం వలన ఎన్నో సంక్లిష్ట సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. అంతేకాక ఈ రుద్రాక్ష ను ధరించటం వలన ఎన్నో సమస్యలు కూడా దూరం అవుతాయి. అలాగే ఇది పురాతన కాలం నుండి ఇతర శారీరక, మానసిక రుగ్మతల చికిత్స చేసేందుకు కూడా బాగా వాడేవారు. ఈ రుద్రాక్షను ప్రతి రోజు తీసుకోవడం వలన నాలుగు నుండి ఐదు రోజులలో మీ ఆరోగ్యం లో ఎంతో తేడా కూడా కనిపిస్తుంది. అలాగే ఈ రుద్రాక్ష చూర్ణంలో బ్రహ్మిణి కలిపి తీసుకొన్నట్లయితే తలనొప్పి నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది అని అంటున్నారు. అంతేకాక రుద్రాక్షని పాలలో మరిగించి రోజుకు ఒకసారి తీసుకున్నట్లయితే కొలెస్ట్రాల్ కూడా తొందరగా తగ్గుముఖం పడుతుంది. ఈ రుద్రాక్ష ను రోజు వాటర్ లో రాత్రంతా నానబెట్టుకొని ఆ నీటిని కంటి చుక్కలుగా పూసుకోవడం వలన కంటి ఇన్ఫెక్షన్లు కూడా తొందరగా నయం అవుతాయి…
ఈ రుద్రాక్ష కంకణాలను చేతులకు మరియు మెడ చుట్టూ వేసుకోవడం వలన ఆందోళన, భయం లాంటివి తొందరగా తొలగిపోతాయి. అలాగే రుద్రాక్షను రాగి పాత్రలో రాత్రంతా నానబెట్టుకొని ఉదయం లేవగానే ఆ నీటిని తీసుకోండి. ఎంతో మంచి ఫలితం ఉంటుంది. ఈ నీటిని తీసుకోవడం వలన డయాబెటిస్ లక్షణాలు కూడా తొందరగా తగ్గుతాయి. అలాగే రుద్రాక్ష అధిక రక్తపోటు మరియు మధుమేహం మరియు జ్వరం, మసూచి, క్షయ, దీర్ఘకాలిక దగ్గు, ఉబ్బసం, సయాటికా, గుండె సమస్యలు,మతిమరుపు, క్యాన్సర్ లాంటి వాటిని తగ్గించే విషయంలో ఎన్నో గుణాలు దీనిలో ఉన్నాయి. ఈ రుద్రాక్ష చూర్ణం తీసుకోవడం వలన ముర్చా వ్యాధికి ఎంతో మేలు చేస్తుంది అని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు…