Health Problem : ప్రతిరోజు గుడ్లను తింటున్నారా.. అసలు ఇది ఆరోగ్యానికి మంచిదా..! కాదా..!
Health Problem : గుడ్లు Eggs అనేక పోషకాలతో నిండి ఉంటుంది. అయితే కొంతమంది దీంట్లో కొలెస్ట్రాల్ Cholesterol ఎక్కువగా ఉంటాయని భావిస్తారు. ఇక దీంతో గుడ్డు Egg తినడం మంచిదా కాదా అని సందేహం చాలా మందిలో ఉంది. ఈ నేపథ్యంలోనే 1968 లో అమెరికన్ హార్ట్ అసోసియేషన్ గుడ్లు తినడం తగ్గించాలని చెప్పింది. ఎందుకంటే ఇందులో కొలెస్ట్రాల్ Cholesterol ఎక్కువగా ఉంటాయట దీంతో చాలామంది ఈ సలహాలు పాటించారు. అయితే 2015 వ సంవత్సరంలో ఈ సలహాలు మార్చారు. ఓ అధ్యయన ప్రకారం గుడ్లు తినడం కాలానుగుణంగా మారుతూ వచ్చిందని తెలిపింది. 1970వ సంవత్సరంలో ప్రజలు వారానికి సగటున 3.6 గుడ్లు తినేవారట. అయితే 1990లో అది 1.8 కి పడిపోగా 2021 సంవత్సరంలో తిరిగి 3.5 కి పెరగడం జరిగింది. ఈ క్రమంలోనే ఆహారపు అలవాట్లు కాలానుగుణంగా మారుతున్న సూచన కారణంగా మారుతాయి గాని వ్యక్తిగత అవసరాల వలన కాదు అని చూపిస్తుంది.
గుడ్లు కొలెస్ట్రాల్.
గుడ్లు తినక పోవడానికి ముఖ్య కారణం కొలెస్ట్రాల్. గుడ్లను తినడం వలన రక్తంలోని కొలెస్ట్రాల్ సాయి పెరుగుతుందని దీని వల్ల కొన్ని సమస్యలు Problems వస్తాయని చాలామంది భావిస్తారు. అయితే ప్రస్తుతం గుడ్ల లోని కొలెస్ట్రాల్ , రక్తంలోని కొలెస్ట్రాలను పెంచదని చెబుతున్నారు. 2021 నాటికి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు కూడా గుడ్లు తినడానికి తగ్గించలేదు.
గుడ్ల పోషణ విలువలు..
గుడ్లలో లభించే విటమిన్లు, ప్రోటీన్లు ,ఖనిజాలు , లుటీన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా లభిస్తాయి. ఇది కంటి ఆరోగ్యాని Eye health కి చాలా మంచిదని చెబుతున్నారు. అంతేకాకుండా గుడ్లలో కొవ్వు తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది ఆరోగ్యకరమైన ఆహారం. ముఖ్యంగా గుడ్లు కండరాల బలం కోసం మరియు వృద్ధులకు ప్రోటీన్ Protein చాలా అవసరం కాబట్టి ఇది మంచిది.
![Health Problem ప్రతిరోజు గుడ్లను తింటున్నారా అసలు ఇది ఆరోగ్యానికి మంచిదా కాదా](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/Eggs.jpg)
Health Problem : ప్రతిరోజు గుడ్లను తింటున్నారా.. అసలు ఇది ఆరోగ్యానికి మంచిదా..! కాదా..!
గుడ్లు ఎందుకు తగ్గించి తింటారు..?
2025 వ సంవత్సరంలో కొలెస్ట్రాల్ ఆకాంక్షలను తొలగించినప్పటికీ కొంతమంది గుడ్లు అనారోగ్యకరమైనవి అని నమ్ముతారు. ఒక అధ్యయనం ప్రకారం చూసుకున్నట్లయితే పాత సమాచారం కారణంగా 22 శాతం మంది గుడ్లు తినడం తగ్గించారట. అయితే డాక్టర్లు చెప్పినప్పటికీ పాత సలహాలు అనుసరించి గూడ్లను తినడం లేదు. మరికొందరైతే గుడ్లలో కొలెస్ట్రాల్ ఉంటుందని అవి ఆరోగ్యానికి హానికరమైనవి అని భావిస్తున్నారు.
గుడ్లు ఆరోగ్యానికి మంచిదేనా..?
ఇది మీ ఆహారం మరియు ఆరోగ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే గుడ్లు పోషకాహారం Eggs Nutrition. అలాగే వీటిని నిజంగా తినవచ్చు. అదేవిధంగా డయాబెటిస్ లేదా గుండె జబ్బులు ఉన్నవారు ముందుగా డాక్టర్ నీ సంప్రదించిన తర్వాత గుడ్లు ను తినాలి. ఇక తాజా పరిశోధనల ప్రకారం గుడ్లు ఒకప్పుడు ఉన్నంత హానికరకావని సమతుల్యమైన ఆహారంలో భాగంగా తీసుకున్నట్లయితే పోషకాలు మంచి మూలకమని తెలియజేసింది.