Olive Oil : ఆలివ్ ఆయిల్ లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా…!
ప్రధానాంశాలు:
Olive Oil : ఆలివ్ ఆయిల్ లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా...
Olive Oil : ప్రస్తుత కాలంలో మన ఆహార అలవాట్ల వలన ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాము. మన ఆరోగ్య విషయం లో ఏమాత్రం రాజీ పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవాలి అని అనుకుంటారు. ఈ తరుణంలో తినే ఆహార విషయములో ఎంతో జాగ్రత్త తీసుకుంటారు. దీంతో ఏ వంట నూనె ఆరోగ్యానికి మంచిది అని ఆలోచిస్తారు. దీనిలో భాగంగా ఆలివ్ ఆయిల్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని తెలుసుకోండి..
ప్రస్తుత కాలంలో చాలా మంది కూడా గుండె సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యలు రాకుండా ఉండాలి అంటే ముందు నుంచే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆలివ్ ఆయిల్ లో ఒలిక్ యాసిడ్, పాలిఫైనల్స్ అధికంగా ఉండటం వలన బీపీని కూడా కంట్రోల్ చేయగలదు. దీనితో పాటుగా గుండె సమస్యలను కూడా తగ్గించటంతో పాటు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. ఆలివ్ ఆయిల్ వాడటం వలన జీర్ణ సమస్యలను దూరం చేసుకోవచ్చు. దీనిలో మెనోశాచురేటెడ్ కొవ్వులను జీర్ణ సమస్యలను దూరం చేసి ప్రేగు కదలికలను కూడా ప్రోత్సహిస్తుంది. దీనిని తీసుకోవటం వలన ప్రేగుకు సంబంధించిన వ్యాధులు మరియు పూతల లాంటి సమస్యలు దూరం అవుతాయి. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ జ్ఞాపకశక్తి లాంటి సమస్యలు కూడా వస్తాయి. ఆలివ్ ఆయిల్ వాడటం వలన బ్రెయిన్ హెల్త్ గా మారి మతిపరపు లాంటి సమస్యలు దూరం అవుతాయి. ఆలివ్ ఆయిల్ లో యాంటీ ఇన్ ఫ్ల మెంటరీ, యాంటీ ఆక్సిడెంట్లు గుణాల వలన ఇలా జరుగుతుంది అని తెలిపారు…
రక్త పోటును తగ్గించటంలోనూ ఆలివ్ ఆయిల్ ముందు ఉంటుంది. మెనోశాచురేటెడ్ ఫ్యాట్స్ ధమనుల పని తీరును మెరుగ్గా చేసి రక్తనాళాల్లో వచ్చే మంటను తగ్గించి రక్తపోటుని నియంత్రిస్తుంది. ప్రస్తుత కాలంలో చాలా మంది క్యాన్సర్ తో బాధపడుతున్నారు. క్యాన్సర్ ను దూరం చేయటంలో ఆలివ్ ఆయిల్ యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ ఫ్లమెంటరీ గుణాలు ముందు ఉంటాయి. రొమ్ము, పెద్దపేగు,ప్రెస్టేట్ క్యాన్సర్ సహా క్యాన్సర్ తో ఆలివ్ ఆయిల్ పోరాడుతుంది. ఈ సమ్మేళనం ఫ్రీ రాడికల్స్ ని బ్యాలెన్స్ చేస్తాయి. క్యాన్సర్ కణాల పెరుగుదలను కూడా కంట్రోల్ చేస్తాయి. క్యాలరీలు అధికంగా ఉన్నప్పటికీ కూడా ఈ ఆలివ్ ఆయిల్ వాడితే బరువు తగ్గుతారు. ఆలివ్ ఆయిల్ తీసుకోగానే కడుపు నిండిన ఫీల్ వస్తుంది. దీని వలన బరువు తగ్గటానికి మంచి హెల్ప్ అవుతుంది..