Kitchen Hacks : స్టీల్ పాత్రలలో ఈ పదార్థాలు ఉంచారో… మీ ప్రాణాలకే ప్రమాదం… జాగ్రత్త…?
ప్రధానాంశాలు:
Kitchen Hacks : స్టీల్ పాత్రలలో ఈ పదార్థాలు ఉంచారో... మీ ప్రాణాలకే ప్రమాదం... జాగ్రత్త...?
Kitchen Hacks : ఈరోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో స్టీల్ పాత్రలు ఉండడం సర్వసాధారణం. కడిగినప్పుడు చాలా శుభ్రంగా ఉంటాయి.ఇంకా గట్టిగా ఉంటాయి. కాబట్టి,వీటిని సులువుగా శుభ్రంగా చేయడానికి వీలుగా ఉంటుందని ఎక్కువగా వినియోగిస్తుంటారు. పాత్రలలో ఆహారాలని నిల్వ ఉంచకూడదు అంటారు. మరి ఇప్పుడు స్టీలు పాత్రలో కూడా పదార్థాలను ఉంచకూడదు అంటున్నారు. మరి ఏ పాత్రలో ఉంచాలి అనే డౌట్ నీకు రావచ్చు.స్టీల్ పాత్రలో కొన్ని పదార్థాలను మాత్రమే ఉంచకూడదు.మిగతావీ ఉంచవచ్చు. స్టీల్ పాత్రలలో ఉంచకూడని పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం. స్టీల్ పాత్రలలో పప్పులు, పచ్చళ్ళు టిఫిన్ కూరలు,ఇలా అన్నిటిని స్టోర్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. కానీ కొన్ని పదార్థాలు ఈ స్టీల్ పాత్రలకు సరిపోవు. ఈ స్టీలు పాత్రలో ఆహార పదార్థాలు ఉంచడం వలన కెమికల్ చర్య జరుగుతుంది. కాలక్రమమైన వాటి రుచి,ఆకృతి,పోషక విలువలు కోల్పోవచ్చు. మరి స్టీల్ గిన్నెలో పొరపాటున కూడా ఈ పదార్థాలను అసలు ఉంచకండి. అవి ఏంటో తెలుసుకుందాం…

Kitchen Hacks : స్టీల్ పాత్రలలో ఈ పదార్థాలు ఉంచారో… మీ ప్రాణాలకే ప్రమాదం… జాగ్రత్త…?
Kitchen Hacks స్టీల్ పాత్రలో ఉంచకూడని పదార్థాలు
స్టీల్ పాత్రలో పొడి పదార్థాలు నిల్వ ఉంచవచ్చు. అయితే, కొన్నిటిని స్టీల్ గిన్నెలో నిల్వ ఉంచితే, అవి పాడైపోయే అవకాశం ఉంటుంది. అంతేకాదు,ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. స్టీలు గిన్నెలలో ఇలాంటి పదార్థాలు స్టోర్ చేసే అలవాటు మీకు కూడా ఉంటే, ఆ అలవాటు మార్చుకోవాలి. లేదంటే పొట్టకు సంబంధించిన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. స్టీల్ లోహానికి సరిపోయే పదార్థం కోసం మాత్రమే వీటిని వినియోగించాల్సి ఉంటుంది. ఈ గిన్నెలో ఎలాంటి పదార్థాలు ఉంచకూడదో తెలుసుకుందాం…
పచ్చళ్ళు : భారతీయ పచ్చల్లో,ఉప్పు, నూనె, నిమ్మ,వెనిగర్, చింతపండు లాంటి వాటి నుంచి వచ్చే సహజ ఆమ్లాలు ఉంటాయి. స్టీల్ లోహంతో చర్య జరపవచ్చు. ముఖ్యంగా మంచి నాణ్యత లేని స్టీల్ అయితే,ఈ ప్రభావం ఎక్కువగా చూపుతుంది. దీనివల్ల రుచి మారుతుంది. స్వల్పంగా లోహపురుచే వస్తుంది. పచ్చళ్ళ నిల్వ కాలం తగ్గుతుంది. మీ ఆవకాయల నిల్వకు గాజు సీసాలను వినియోగిస్తే మంచిది. ఇంకా, పింగాణి జాడీని కూడా వినియోగించవచ్చు.
పెరుగు : పెరుగు సహజంగా పుల్లగా ఉంటుంది. స్టీలు పాత్రల్లో ముఖ్యంగా,ఎక్కువ గంటలు నిల్వ చేస్తే దానికి విచిత్రమైన రుచి కూడా వస్తుంది. పులియటం కొనసాగవచ్చు.ఆకృతి మారవచ్చు. ఉత్తమ ఫలితాలకు పెరుగును సిరామిక్ లేదా గాజు పాత్రలో ఉంచండి. అవి పెరుగును చల్లగా శుభ్రంగా ఉంచుతాయి.
నిమ్మ ఆధారిత వంటకాలు : స్టీల్ పాత్రలలో నిమ్మ పదార్థాలు సరిగా కలవవు అంటే,నిమ్మ పచ్చళ్ళు లేదా పులుపు పచ్చళ్ళు. నిమ్మ అన్నం,నిమ్మరసం, ఆమ్చూర్ అంటే మామిడిపొడి లేదా చింతపండుతో చేసిన ఏ వంటకమైనా, స్టీలు డబ్బాలో నిలువ చేస్తే దాని పులుపు తగ్గుతుంది. ఈ వంటకాలు గాజు లేదా ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ పాత్రలో ఉంచితే మంచి రుచి ఇస్తుంది.అవి వాటి పులుపుకు అంతరాయం కలిగించవు.
టమాటో అధికంగా ఉన్న ఆహారాలు : టమాటో అధికంగా ఉన్న గ్రేవీ వంటకాలు,పన్నీర్ బటర్ మసాలా లేదా రాజ్మా లాంటివి లోహం లేని పాత్రలలో నిలువ చేస్తే మంచిది. టమాటాలో సహజ ఆమ్లాలు ఉంటాయి.ఇవి కాలక్రమమైన స్టీల్ తో చర్య జరపవచ్చు. ఈ వంటకం రుచి పోషక విలువలు రెండిటిని ప్రభావితం చేస్తుంది. మిగిలిపోయిన ఆహారం సిరామిక గిన్నెలో లేదా గాజు పెట్టిలో ఉంచండి.
పండ్లు,పండ్ల సలాడ్లు : కోసిన పండ్లు లేదా మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్లు,స్టీలు పాత్రలో ఎక్కువసేపు ఉంచితే మెత్తగా మారుతాయి. వింత రుచి కూడా వస్తుంది. వాటి సహజరసాలు ఉపరితలంలో కొద్దిగా చర్య జరుపుతాయి. ముఖ్యంగా, అరటి పండ్లు లేదా నారింజలాంటి మొత్తాన్ని పండ్ల విషయంలో ఇది జరుగుతుంది. గాలి చొరబడని గాజు కంటైనర్లు లేదా ఆహార సురక్షిత ప్లాస్టిక్ డబ్బాలు వాటిని తాజాగా రసభరితంగా ఉంచుతాయి.
తప్పక స్టీల్ పాత్రలు వినియోగించాల్సి వస్తే,నాణ్యమైన స్టీల్ పాత్రలని వినియోగించండి. నాస్తి రకం స్టీలు వినియోగాన్ని తగ్గించండి. మంచి ప్లాస్టిక్ కంటైనర్లు,గాజు సీసాలని ఎక్కువగా వినియోగించండి.