Kive Weight Loss : అయ్యబాబోయ్… కివీ తొక్కలో కూడా ఇంత మ్యాజిక్ ఉందా.. తెలిస్తే అస్సలు పడేయరుగా…?
ప్రధానాంశాలు:
Kive Weight Loss : అయ్యబాబోయ్... కివీ తొక్కలో కూడా ఇంత మ్యాజిక్ ఉందా.. తెలిస్తే అస్సలు పడేయరుగా...?
Kiwi Weight Loss : మనం నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి సి విటమిన్ ఎంతో ముఖ్యం. ఈ సి విటమిన్ లభించాలంటే ఎక్కువగా నారింజ, బత్తాయిలు తింటూ ఉంటారు. దీనిలో కంటే కూడా శ్రీ విటమిన్ కివీ పండులో ఎక్కువ రెట్టింపు మోతాదులో లభిస్తుంది. ఈ కివి ఫ్రూటు 5 రెట్లు ఆపిల్ కంటే కూడా ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుంది. పీచు పదార్థం, విటమిన్ ఇ, పొటాషియం, ఫోలిక్ యాసిడ్, కెరోటిన్ నాయిడ్స్, ఆంటీ ఆక్సిడెంట్లు అంటే ఎన్నో పోషకాలు ఇందులో ఉన్నాయి. పోషకాలనిద్ధి. వండర్ ఫ్రూట్ గా పిలిచే కివీ తొక్కలు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కివీ తొక్కలతో లాభాలేంటో మరి తెలుసుకుందాం..

Kive Weight Loss : అయ్యబాబోయ్… కివీ తొక్కలో కూడా ఇంత మ్యాజిక్ ఉందా.. తెలిస్తే అస్సలు పడేయరుగా…?
గత కొన్నేళ్లుగా మార్కెట్లలో అనేక రకమైన విదేశీ ఫ్రూట్లో అందుబాటులోకి వచ్చాయి. ఇలాంటి ఫ్రూట్స్లో కివీ కూడా ఒకటి. చైనీస్ గూస్బెర్రీస్ అని కూడా పిలుస్తారు. కివీ లో విటమిన్ లు A,E,C పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, కాపర్, ఐరన్, మ్యాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో మంచి మొత్తంలో విటమిన్ బి6 కూడా ఉంటుంది. ఒక కప్పు కివీ ముక్కలలో.. మనకు రోజు మొత్తం సరిపడా విటమిన్ సి లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలో కణజాలాల పెరుగుదలకు, మరమ్మతుకు చాలా అవసరం. కివీ లో ఫైబర్ మెండుగా ఉంటుంది. ఇది పేగుల పనితీరును మెరుగుపరుస్తుంది. మలబద్దకానీ దూరం చేస్తుంది. ఈ అద్భుతమైన పండును మీ ఆహారంలో చేర్చుకుంటే చాలా ప్రయోజనాలను ఇస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కివీ ఫ్రూట్ మాత్రమే కాదు, దాని తొక్కలు కూడా మరింత ఆరోగ్య ప్రయోజనాన్ని కలిగి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయం తెలిస్తే తొక్కలను కూడా మీరు ఎప్పుడు పడేయరు.ఈ తొక్కలతో ఎటువంటి లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం…
Kiwi Weight Loss కివీ పండు తొక్కతో లాభాలు
కివీ పండు తొక్కలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కివీ తొక్కలో ఇతర పండ్ల కంటే మూడు రెట్లు ఎక్కువ ఫైబర్ ఉందని పరిశోధనలో తేలింది. పైబర్ ఉంటే జీర్ణ క్రియ జరుగుతుంది. మీకు కడుపు నిండిన అనుభూతి కూడా కలుగుతుంది. ఇది జీర్ణ క్రియను వేగవంతం చేస్తాయి. శరీరాన్ని నిర్వీకరణ చేయడానికి కూడా పనిచేస్తుంది. ఇవి తొక్కలో పాలిఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇది కొవ్వును కరిగించడానికి పనిచేస్తుంది. దీనివల్ల కడుపు ఎక్కువ సేపు నిండినట్లు కూడా ఉంటుంది. ఇది అనవసరంగా తినకుండా ఉండటానికి సహాయపడుతుంది . కివీ తొక్క శరీరంలో ఇన్సులిన్ ను కూడా సమతుల్యం చేస్తుంది. దీనివల్ల అతిగా తినాలని కోరిక శాంతిస్తుంది . దీన్ని తినడం వల్ల మీ బరువు త్వరగా తగ్గుతుంది. కడుపు ఉబ్బరం,వాపు కూడా తగ్గుతాయి. అయితే, కివీ తొక్కను వాడేందుకు ముందుగా బాగా కడగాలి. తర్వాత దాన్ని జ్యూస్ లా చేసుకుని తినొచ్చు. మీకు కావాలంటే మీరు నమ్మలవచ్చు. కానీ దాని ఆకృతి కొంచెం ముల్లగా ఉండటం వల్ల మీకు అది నచ్చకపోవచ్చు. అందువల్ల షేక్ లేదా స్మృతితో కలిపి కూడా తాగవచ్చు. ఇది కాకుండా, తొక్కను ఎండబెట్టి మెత్తగా చేసుకుని పొడి రూపంలో కూడా ఉపయోగిస్తే మంచిది అంటున్నారు నిపుణులు.