Lymphoma : రాత్రిపూట విపరీతంగా చెమటలు పడుతున్నాయా… అయితే దీనికి సంకేతం కావచ్చు…!
ప్రధానాంశాలు:
Lymphoma : రాత్రిపూట విపరీతంగా చెమటలు పడుతున్నాయా... అయితే దీనికి సంకేతం కావచ్చు...!
Lymphoma : ప్రస్తుత కాలంలో ఎంతో మంది ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే రాత్రిపూట అధికంగా చెమటలు పట్టడం లేక ఆకస్మిక బరువు తగ్గటం లాంటి సమస్యలు కనుక మీకు ఎదురైతే జాగ్రత్తగా ఉండాలి అని నిపుణులు అంటున్నారు. నిజం చెప్పాలంటే మన శరీరానికి ఏదైనా వ్యాధిని ముందుగానే పసిగట్టే సామర్థ్యం కలిగి ఉంటుంది. దాని గురించి మనకు ముందుగానే కొన్ని సంకేతాలను కూడా పంపిస్తుంది. దాని యొక్క సంకేతాలను గనుక మనం సరైన టైంలో అర్థం చేసుకుంటే సమస్యల నుండి ఈజీగా బయటపడవచ్చు. అలాంటి సంకేతాలలో రాత్రులు చెమటలు పట్టడం మరియు వేగంగా బరువు తగ్గడం లాంటివి కూడా ఉన్నాయి. ఇలా కొన్నిసార్లు జరగటం సాధారణం. కానీ ఇలాంటి సమస్య తరచుగా సంభవిస్తే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఎందుకు అంటే ఇది లింఫోమా సంకేతాలు కావచ్చు అంటున్నారు. ఇది ఒక క్యాన్సర్ రకం. అయితే వాతావరణం సాధారణంగా ఉన్నప్పుడు కూడా కొందరికి రాత్రి టైమ్ లో చెమటలతో తడిసిపోతూ ఉంటారు. అలాగే చలి ప్రాంతంలో నివసించే వారికి కూడా ఈ సమస్య అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కావున విపరీతంగా రాత్రులు చెమటలు రావడం అలసిపోయిన సందర్భాల్లో కూడా జరుగుతూ ఉంటుంది. అయితే మీకు ఇలా తరచూ జరుగుతూ ఉన్నట్లయితే దానిని నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. ఎందుకు అంటే ఇది లింఫోమా క్యాన్సర్ కావచ్చు. ఇది లింఫోసైట్లు అనగా ఎర్ర రక్త కణాలను ఎంతో ప్రభావితం చేస్తుంది…
Lymphoma లింఫోమా అంటే ఏమిటి
మన శరీరంలో శోషరాస వ్యవస్థ అనేది ఉంటుంది. దీనిలో శోషరస కణుపులు మరియు ప్లిహాము,థేమస్, ఎముక మజ్జ లాంటివి ఉంటాయి. అయితే ఇక్కడ ఇతర రక్త కణాలు అనేవి ఏర్పడతాయి. ఇవి ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లతో పోరాటంలో ఈ కారకాలు చాలా ముఖ్యమైనవి. అయితే వీటికి సంబంధించిన క్యాన్సర్లలో దేనినైనా సరే లింఫోమా అని అంటారు…
లింఫోమా కారణాలు : లింఫోమా ఎందుకు వస్తుందో చెప్పేందుకు ఇప్పటికీ కూడా స్పష్టమైన ఆధారాలు అనేవి లేవు. అయితే లింఫోసైట్లు అని పిలవబడే కొన్ని కణాల వలన ఈ క్యాన్సర్ అనేది వస్తుంది. అయితే ఇది బ్యాక్టీరియా వైరస్ లతో పోరాటం లో కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇది లింపోసైట్ అభివృద్ధికి సంబంధించిన ఇతర దశలలో సంభవించే జన్యు మార్పుల కారణం చేత ఉత్పరివర్తనలు కూడా సంభవిస్తాయి…
దీని లక్షణాలు : మెడ లేక గజ్జల్లో నొప్పి లేక వాపు రావడం.
-నిరంతరం అలసట.
– రాత్రిపూట విపరీతమైన చమట.
-కారణం లేకుండా వేగంగా బరువు తగ్గడం.
– శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది.
దీని చికిత్స :
– కీమెథెరపీ లేక కెమె ఇమ్యూనో థేరఫీతో చికిత్స.
– కొన్ని సందర్భాలలో ఎముక మజ్జ.
– చికిత్స విఫలమైన తర్వాత ఇమ్యున్ చెక్ పాయింట్ ఇహి బిటర్, CAR -T థెరపీ కూడా చేస్తారు…