Vrushaba Rasi : వృషభ రాశి వారు ఈ రాశి వారిని పెళ్లి చేసుకుంటే మంచిది.. దాంపత్య జీవితం బాగుంటుంది…!

 Authored By ramu | The Telugu News | Updated on :13 July 2024,8:00 am

Vrushaba Rasi : వృషభ రాశి వారు ఎవరిని వివాహం చేసుకుంటే మంచి జరుగుతుంది…? ఎవరిని వివాహం చేసుకోకూడదు… ?వివాహం జరగడానికి చేయవలసిన పరిహారాలు ఏమిటి..? ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారు చాలా సున్నితమైన మనసు ఉన్నవారు. ఏ విషయమైనా వారికి ప్రేమతో చెబితే చేయగల సత్తా ఉన్నవారు అలాగే ఏదైనా గట్టిగా మాట్లాడిన దానిని చేయలేరు. వృషభ రాశి వారికి వివాహం జరిగి విడాకులు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే చాలామంది పెళ్లికి ముందు వారి జాతకాలు చూపించి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఆ జాతకంలో పాయింట్స్ చూసుకొని పెళ్లి చేస్తారు. ఒకవేళ మంచి పాయింట్స్ వచ్చిన కానీ వీళ్ళు విడిపోతున్నారు.

దానికి కారణం మనస్తత్వాలు కలవకపోవడం. మనస్తత్వాలు ఎప్పుడు కలుస్తాయో అప్పుడు వారి వివాహ జీవితం బాగుంటుంది. జాతకం ఉన్న వాళ్ళు లగ్నాలు చూసుకుంటారు. మరియు ఏ రాశి వారిని చూసుకోవచ్చు ఏ రాశి వారిని చేసుకోకూడదు అంటేే వృషభ రాశి వారికి సాధారణంగా మిధున రాశి మరియు మేష రాశి వారితో దాంపత్య జీవితం బాగోదు. ఎందుకంటే ఇటు మిధున రాశిలో ఉండే అమ్మాయిలు అబ్బాయిలు ఏ విషయంలోనైనా కొంచెం గట్టిగా మాట్లాడతారు. అలాగే వీరి మనసు మెత్తగా ఉంటుంది మాటలు కఠినంగా ఉంటాయి. అది వృషభ రాశికి అర్థం కావడానికి కాస్త సమయం పడుతుంది. అందుకనే వారు వివాహం చేసుకోకూడదు. అలాగే వృషభ రాశి వారు కన్యా రాశి వారిని మరియు తులారాశి వారిని వివాహం చేసుకోవచ్చు. తులా రాశికి అధిపతి శుక్రుడు మరియు వృషభ రాశి కి అధిపతి శుక్రుడు అలాగే వీరికి కావాల్సింది ప్రేమగా మాట్లాడడం. కాబట్టి వీరి వివాహం చేసుకోవచ్చు.

Vrushaba Rasi : వృషభ రాశి వారు ఈ రాశి వారిని పెళ్లి చేసుకుంటే మంచిది.. దాంపత్య జీవితం బాగుంటుంది...!

Vrushaba Rasi : వృషభ రాశి వారు ఈ రాశి వారిని పెళ్లి చేసుకుంటే మంచిది.. దాంపత్య జీవితం బాగుంటుంది…!

అలాగే కన్య రాశి వారికి ఎదుటివారి మనసుని ముందే అర్థం చేసుకునే తత్వం ఉంటుంది. ప్రతిదీ వారు మార్చుకొని సిద్ధంగా ఉంటారు కాబట్టి వారిని వివాహం చేసుకోవడం మంచిది. అలాగే మిగతా రాశి వారు లగ్నాలు జాతకాలు కలిస్తే వివాహం చేసుకోవచ్చు. వృషభ రాశిలోని అమ్మాయిలకు క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యం. ఒకవేళ అబ్బాయి క్యారెక్టర్ బాగోకపోయినా మీరు ఒక్క నిమిషం కూడా ఉండలేరు. వారిని వదిలేస్తామంటారు. వదిలేసిన తర్వాత వీరు వేరే వివాహం చేసుకోవడానికి ఇష్టపడరు. కాబట్టి వీరు జాతకాలు రాశులు లగ్నాలు చూసుకొని వివాహం చేసుకోవడం వలన వీరికి మంచి జరుగుతుంది. వృషభ రాశిలో కొంతమంది ఆరోగ్యం మంచిగా ఉంటుంది మరి కొంత మంది జాతకంలో చంద్రబలం దక్కకుండా గురు బలం తక్కువ ఉన్న కొంతమందికి మాటలు సరిగ్గా రావు. అలాగే మరి కొంతమంది చేతిలో డబ్బులు నిలువ ఉండదు. ఇంట్లోనే ఆహారం తీసుకోవడం ద్వారా వీరి ఆరోగ్యం బాగుంటుంది.

Vrushaba Rasi పరిహారాలు.

వృషభ రాశి భార్య భర్తలు దుర్గాదేవి ఆరాధన చెయ్యడం మంచిది.

ramu

Ramu ( Tandu Ramalingaiah ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి