Oil : ఈ నూనె దొరికితే అసలు వదలొద్దు… దీనిలో బోలెడు లాభాలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Oil : ఈ నూనె దొరికితే అసలు వదలొద్దు… దీనిలో బోలెడు లాభాలు…!

 Authored By ramu | The Telugu News | Updated on :12 July 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Oil : ఈ నూనె దొరికితే అసలు వదలొద్దు... దీనిలో బోలెడు లాభాలు...!

Oil : మునగ చెట్టు ఉపయోగాలు గురించి ఎన్నో సందర్భాల్లో మనం చెప్పుకున్నాం. అయితే మునగ ఆకులు మరియు కాయలు మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తాయి. అయితే మునగ నూనె గురించి మీరు ఎప్పుడైనా విన్నారా. లేదు కదా. మునగ నూనెను మునగ కాయల విత్తనాల నుండి తీస్తారు. ఈ నూనెలో ఎన్నో అద్భుతమైన పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే. దీనిలో విటమిన్ ఏ, ఇ, సి,బి, యాంటీ ఆక్సిడెంట్లు, కొవ్వు పదార్థాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ నూనె ఆరోగ్యంతో పాటు జుట్టు సమస్యలకు కూడా మేలు చేస్తుంది. ఈ నూనె వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం…

మునగాకు నూనెలో ఉన్న పోషకాలు జుట్టు ఫోలికల్స్ కు బలన్ని ఇస్తాయి. జుట్టు రాలే సమస్యలను కూడా తగ్గిస్తుంది. అలాగే స్కాల్ఫ్ కు రక్త ప్రసరణకు కూడా మేలు చేస్తుంది. అంతేకాక జుట్టు పెరుగుదలకు కూడా ఎంతో మేలు చేస్తుంది. మునగ నూనె అనేది జుట్టుకు ఎంతో తేమను ఇస్తుంది. అలాగే జుట్టును మెరిసేలా కూడా చేస్తుంది. చుండ్రు సమస్యతో బాధపడుతున్న వారు ఈ మునగ నూనెను వాడడం వలన సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ మునగ నూనెలో యాంటీ మైక్రో బయల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి అనేవి చుండ్రు కలిగించే శిలీంద్రాలను నాశనం చేయడంలో ఎంతో మేలు చేస్తుంది. ఈ మునగా నునే లో ఉన్న ప్రోటీన్లు జుట్టును ఎంతో బలంగా చేస్తాయి. దీనిలో ఉన్న పోషకాలు అనేవి జుట్టు కుదుళ్లకు పోషణను అందిస్తాయి. జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది.ఈ నూనెను వాడడం వలన జుట్టు ను హైడ్రేట్ చేస్తుంది. అలాగే దీనిని బలంగా మరియు దృఢంగా కూడా చేస్తుంది. అయితే తలలో దురద మరియు చికాకుగా ఉన్నవారికి ఈ మునగ నూనె దివ్య ఔషధంలా పనిచేస్తుంది.

Oil ఈ నూనె దొరికితే అసలు వదలొద్దు దీనిలో బోలెడు లాభాలు

Oil : ఈ నూనె దొరికితే అసలు వదలొద్దు… దీనిలో బోలెడు లాభాలు…!

మునగ నూనెను తలకు అప్లై చేసుకొని 10 నుండి 15 నిమిషాల పాటు మసాజ్ చేసుకోండి. ఆ తరువాత షాంపూ తో మీ జుట్టును క్లీన్ చేసుకోండి. అయితే జుట్టుకు మునగ నూనెను రాసిన తర్వాత 30 నిమిషాలు లేక రాత్రంతా అలా వదిలేసి మరునాడు ఉదయాన్నే జుట్టును క్లీన్ చేసుకోండి. మీ జుట్టును షాంపూ తో క్లీన్ చేసిన తర్వాత మునగ నూనెను కండీషనర్ గా కూడా వాడవచ్చు. ఇలా చేయటం వలన మునగ నూనె అనేది జుట్టుకు ఎంతో తేమను ఇస్తుంది. అలాగే జుట్టును కూడా మెరిసేలా చేస్తుంది. మునగ వంట నూనెలో స్థిరాల్స్ అనేవి ఉంటాయి. ఇది మన శరీరంలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించడంలో కూడా సహాయం చేస్తాయి. ఈ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే దీనిలో యాంటీ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలు ఉండడం వలన చర్మానికి అప్లై చేసి మర్దన చేయటం వలన చర్మం యాక్నె సమస్య అనేది తొందరగా తగ్గుతుంది…

Advertisement
WhatsApp Group Join Now

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది