Helth Tips : నోటిపూత ఇబ్బంది పెడుతోందా.. ఇలా చేయండి వెంటనే రిలీఫ్
Helth Tips : నోటి పూత సాధారణంగా నాలుక, చిగుళ్లు, దవడ లోపల, పెదవుల లోపల ఏర్పడతాయి. ఇవి నొప్పిని కలిగించడంతో పాటు చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది. దీంతో కారంగా, వేడిగా ఏం తినాలన్నా, కాస్తా పులుపు తగిలినా తట్టుకోలేం. నోటి శుభ్రత పాటించకపోవడం, మలబద్ధకం, హార్మోన్‌లలో మార్పులు, ఎసిడిటీ, విటమిన్ బీ కాంప్లెక్స్, బీ 12 లోపం, జింక్ లోపం, విటమిన్ బీ, సీ, ఐరన్, ఇతర పోషకాల లోపాల వల్ల నోటి పుండ్లు ఏర్పడే అవకాశం ఉంది. పురుషుల కంటే ఎక్కువగా మహిళల్లో, యువతలో నోటిపుండ్లు వస్తుంటాయని ఓ పరిశోధనలో వెల్లడైంది.సమ్మర్ లో కూడా బాడీలో అధిక వేడి వల్ల తరుచూ నోటిపూత వస్తుంది. నాలుక ఎర్రగా మారడం, నాలుక కింద, బుగ్గలోపల పుండ్లు ఏర్పడుతుంటాయి. దీని వల్ల తలనొప్పి, జ్వరం, గవద బిల్లలు కూడా వచ్చే అవకాశం ఉంది.
అయితే నోటిపుండ్లను తేలికగా నయం చేయవచ్చు. మౌత్ అల్సర్లకు హోం రెమిడీస్ కంటే మెరుగైన చికిత్స లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. తేనె తీసుకోవడం వల్ల అందులో ఉండే తేమ నోటిని పొడిబారకుండా నిరోధిస్తుంది. తేనెను తీసుకుని సమస్యాత్మక ప్రాంతాల్లో రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల నొప్పి తగ్గి ఉపశమనం లభిస్తుంది. తేనెలో ఆమ్లా పౌడర్ (ఉసిరికాయతో చేసిన పొడి) కాస్త కలుపుకుని నోటి పూతపై రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పసుపులో తేనెను కలిపి నోటిపుండ్లపై రాసుకున్నా ప్రయోజనం ఉంటుంది.నోటి పూతకి వెల్లుల్లి మంచి ఉపషమనం. వెల్లుల్లిలో యాంటి బయాటిక్ గుణాలు ఉండటం వల్ల నోటిపూతత్వరగా తగ్గిపోతుంది. వెల్లుల్లి దంచి ఆ రసంని పూతపై క్రమం తప్పకుండా రాస్తే తగ్గిపోతుంది.

mouth ulcers kitchen remedies to heal canker sores
Helth Tips : ఈ చిట్కాలు ట్రై చేయండి
బియ్యం కడిగిన నీళ్లలో కాస్త పటికబెల్లం వేసి తాగినా మంచి ఫలితం ఉంటుంది. అలాగే 1/2 టీస్పూన్ త్రిఫల చూర్ణాన్నిఒక కప్పు నీటితో కలిపి డికాషన్ తయారు చేయాలి. దీనిని రోజుకు ఒక్కసారి నోటితో పుక్కిలించాలి. ఇలా చేసినా ప్రయోజనం ఉంటుంది. 8 గ్రాముల పటిక బెల్లం, ఒక గ్రాము కర్పూరం తీసుకుని వీటిని మెత్తగా పౌడర్ చేసి ఈ పొడిని నోటి పుండ్ల మీద రాస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ మిశ్రమం నోటి పుండ్ల వల్ల కలిగిన వాపులను తగ్గిస్తుందన్నారు.ఆవు నెయ్యి కూడా నోటిపూతను తగ్గిస్తుంది. అలాగే కొత్తిమీర కషాయం పుక్కిలించడం వల్ల కూడా నోటిపూత తగ్గుతుంది. గోరువెచ్చని నీటిలో కాస్త సాల్ట్ వేసి పుక్కిలించినా ఫలితం ఉంటుంది. ప్రెష్ కొబ్బరి నూనే నోటిపూత, పుండ్లపై అప్లై చేస్తే తొందరగా తగ్గిపోతాయి. నోటి పుండ్లతో బాధపడుతున్న వారు కలబంద రసాన్ని ప్రతిరోజూ రెండు సార్లు తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.