Night Walking : రాత్రి తిన్న తర్వాత వాకింగ్ చేయడం అలవాటు చేసుకుంటే… అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం…?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Night Walking : రాత్రి తిన్న తర్వాత వాకింగ్ చేయడం అలవాటు చేసుకుంటే… అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం…??

 Authored By ramu | The Telugu News | Updated on :28 November 2024,2:30 pm

ప్రధానాంశాలు:

  •  Night Walking : రాత్రి తిన్న తర్వాత వాకింగ్ చేయడం అలవాటు చేసుకుంటే... అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం...??

Night Walking : ప్రతి ఒక్కరికి నిద్రపోయే ముందు తేలికపాటి నడక అనేది శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. అలాగే ఇది మంచి నిద్రకు కూడా చాలా అవసరమైనది. అలాగే సాయంత్రం వెళలో నడవడం వల్ల ఒత్తిడి మరియు ఆందోళన అనేది తగ్గిపోతుంది. ఇది మాసిక స్థితిని ఎంతగానో మెరుగుపరుస్తుంది. ప్రతిరోజు పడుకునే ముందు నడవడం వలన కొన్ని కేలరీలు అనేవి కరిగిపోతాయి. ఇది బరువు ను తగ్గించుకోవటానికి కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. అలాగే సాయంత్రం నడవడం వల్ల ఒత్తిడి మరియు ఆందోళన అనేది కూడా తగ్గిపోతుంది. ఇది మానసిక స్థితిని ఎంతగానో మెరుగుపరుస్తుంది. అయితే సాయంత్రం నడవడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

Night Walking రాత్రి తిన్న తర్వాత వాకింగ్ చేయడం అలవాటు చేసుకుంటే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం

Night Walking : రాత్రి తిన్న తర్వాత వాకింగ్ చేయడం అలవాటు చేసుకుంటే… అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం…??

Night Walking : గుండె ఆరోగ్యం

సాధారణంగా సాయంత్రం వేళలో నడవడం అనేది గుండె కార్యకలాపాలను క్రమబద్ధీకరించడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే రక్తపోటును కంట్రోల్లో ఉంచుతుంది. అంతేకాక కండరాలను బలంగా చేస్తుంది. అలాగే నడక వలన కాళ్ళ కండరాలు కూడా బలంగా తయారవుతాయి. దీంతో కీళ్లకు ఎంతో బలం లభిస్తుంది. ఇకపోతే సాయంత్రం వాకింగ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయాలు ఏమిటి అంటే… రాత్రి టైంలో భోజనం చేసిన తర్వాత కనీసం అరగంట పాటు వాకింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి. అలాగే ఎక్కువ వేగంగా నడవడం కూడా మంచిది కాదు. తేలికపాటి వేగంతో నడిస్తే మంచిది.

అలాగే వాకింగ్ చేసేటప్పుడు సౌకర్యవంతమైన బూట్లు మరియు బట్టలను ధరించాలి. మీకు ఏదైనా ఆరోగ్య సమస్య గనక ఉంటే వాకింగ్ కి వెళ్లే ముందు మీరు కచ్చితంగా వైద్యులను సంప్రదించాలి. అయితే ఈవినింగ్ వాకింగ్ అనేది ఏ వయసు గల వారైనా చేయగలిగే ఒక సులభమైన వ్యాయామం అని చెప్పొచ్చు . వీటికి ప్రత్యేకమైన తయారీ లేదా పరికరాలు కూడా అవసరం ఉండదు. ఈ రోజు నుండి పడుకునే ముందు నడవడం అలవాటు చేసుకుంటే చాలా మంచిది. దీంతో ఎన్నో రకాల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను లభిస్తాయి

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది