Child Brain: తల్లిదండ్రులు… మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే… ఈ తప్పులు అస్సలు చేయకండి… కారణం తెలుసా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Child Brain: తల్లిదండ్రులు… మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే… ఈ తప్పులు అస్సలు చేయకండి… కారణం తెలుసా…?

 Authored By ramu | The Telugu News | Updated on :14 June 2025,10:00 am

ప్రధానాంశాలు:

  •  Child Brain : తల్లిదండ్రులు... మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే... ఈ తప్పులు అస్సలు చేయకండి... కారణం తెలుసా...?

Child Brain : పాతకాలంలో తల్లిదండ్రులు పిల్లల్ని బుజ్జగించాలన్నా.. వారికి అన్నం తినిపించాలన్నా… ఆకాశంలోని చందమామను చూపించి వారిని బుజ్జగించేవారు. కానీ నేటి కాలంలో.. పిల్లలు నిశ్శబ్దంగా ఉండుటకు లేదా అన్నం తినిపించాలంటే మొబైల్ ఫోన్లు తల్లిదండ్రులు వారి చేతికి అందిస్తున్నారు.. కానీ ఈ అలవాటు వారి భవిష్యత్తుని పాడు చేస్తుంది అనే విషయం ఏ మాత్రం గ్రహించడం లేదు.. ఫలితంగా పిల్లల భవిష్యత్తులో వారి ఆరోగ్యానికి తీవ్రభంగం కలిగించే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా ఈ విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు…

Child Brain తల్లిదండ్రులు మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఈ తప్పులు అస్సలు చేయకండి కారణం తెలుసా

Child Brain: తల్లిదండ్రులు… మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే… ఈ తప్పులు అస్సలు చేయకండి… కారణం తెలుసా…?

Child Brain స్మార్ట్ ఫోన్లు పిల్లల భవిష్యత్తు పై

నేటి కాలంలో చిన్న వయసులోనే పిల్లలు స్మార్ట్ఫోన్లో వాడకం సర్వసాధారణంగా మారిపోయింది. ఎంతమంది తల్లిదండ్రులు చేసే పొరపాటు తమ పిల్లలు ఎక్కువ సమాచారం తెలుసుకోవాలని ఆశతో.. చిన్న వయసులోనే మొబైల్ వాడే అలవాటు చేస్తున్నారు. మరికొందరైతే వారి అల్లరి తట్టుకోలేక లేదా ఏడుస్తున్నప్పుడు, అన్నం తినిపించేటప్పుడు, ఫోన్లు ఇవ్వడం అలవాటు చేస్తున్నారు. దాని పరిణామాలు పిల్లలపై ఎటువంటి ప్రభావం చూపుతుందో.. పిల్లల మెదడు అభివృద్ధిని ఎంత తీవ్రంగా దెబ్బతీయగలదో తెలియకపోవచ్చు..

మొబైల్స్ ని ఎక్కువ సేపు చూస్తే చిన్నపిల్లలకు ఎటువంటి ప్రభావాలు చూపుతాయి

మొబైల్స్ ఎక్కువ సేపు చూస్తే చిన్నపిల్లల మెదడు అభివృద్ధిపై దీర్ఘకాలిక ప్రభావాలు పడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఈ అలవాటు పెరుగుతూ వస్తే పిల్లల్లో దృష్టి నిలుపుకునే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. ఇంకా,నిద్రలేమి, ఊబకాయం,కోప స్వభావం లాంటి సమస్యలు కూడా ఎక్కువ అయ్యే,ప్రమాదం ఉంది. అంతేకాదు, ఎక్కువ శబ్దంతో వీడియోలు చూడడం వల్ల వారి చెవులకు నష్టం కలిగే ప్రమాదం ఉంది. మొబైల్స్ స్క్రీన్ ల నుండి వెలువడే నీలి కాంతి వల్ల కళ్ళ ఆరోగ్యం పై ప్రభావం పడే అవకాశం కూడా ఉంది. ఇది చిన్న విషయమే కదా అనుకుంటే పొరపాటే… పిల్లల భవిష్యత్తులో పెద్ద సమస్యలుగా మారే పెను ప్రమాదం ఉంది. పిల్లలు మొబైల్ ఫోన్స్ చూడటానికి మారం చేస్తే లేదా ఏడిస్తే ఫోను ఇవ్వడం తాత్కాలిక పరిష్కారం మాత్రమే. దీనివల్ల వారిలో దైనందిన జీవితంలో కూడా డిజిటల్ డిపెండెన్స్ పెరుగుతుంది. సారీ అలవాటు పడ్డాక,ఫోన్ లేకపోతే మానసిక,అసంతృప్తి ఆందోళన మొదలవుతుంది.

కాబట్టి తల్లిదండ్రులు మొదట నుంచే మొబైల్ వాడకాన్ని నియంత్రిస్తే మంచిది. వారి ఆత్మవిశ్వాసాన్ని, చురుకుదనాన్ని పెంపొందించే ఆటలు,కథలు,నేచర్ ఆక్టివిటీలు లాంటివి వాటిలో వారి దృష్టిని మళ్లిస్తే, వారి భవిష్యత్తు బాగుంటుంది. తల్లిదండ్రులు తీసుకోవలసిన ముందు జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
-మూడు సంవత్సరాల లోపు పిల్లలకు ఫోన్లు ఇవ్వకూడదు.
– పిల్లలకు మొబైల్స్ బదులు పుస్తకాలు, డ్రాయింగ్, స్టోరీ టెల్లింగ్ లాంటి సృజనాత్మక పనులలో వారిని ఆలోచించేలా చేయండి.
– పెద్ద వయసు పిల్లలకు కూడా రోజుకు కొన్ని నిమిషాలు మాత్రమే మొబైల్స్ వినియోగాన్నికి అనుమతించండి.
– పిల్లలతో కూర్చొని వాడే కంటెంట్ను మీరు స్వయంగా పరిశీలించాలి.
– టెక్నాలజీ తప్పదు. కానీ, అది నియంత్రితంగా ఉండాలి.
తల్లిదండ్రులు పిల్లలు ఏడుస్తున్నారని కారణంతో వారికి మొబైల్ ఇవ్వడం పొరపాటు చేసినట్లే, దీని ప్రభావం వారి ఆరోగ్యం పై,వారి అభివృద్ధిపై దీర్ఘకాలంగా ప్రభావం చూపుతుంది. కాబట్టి, ఈ విషయంలో తల్లిదండ్రులు బాగా ఆలోచించి, వారీ భవిష్యత్తు కోసం సరైన నిర్ణయం తీసుకుంటే మంచిది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది