Child : మీకు ఆడపిల్లలు ఉన్నారా..? అయితే కేంద్ర పథకాన్ని అస్సలు మరచిపోకండి..!
ప్రధానాంశాలు:
Child : మీకు ఆడపిల్లలు ఉన్నారా..? అయితే కేంద్ర పథకాన్ని అస్సలు మరచిపోకండి..!
Child : ప్రస్తుతం తల్లిదండ్రులు తమ కుమార్తెకు ఉన్నత విద్య, మంచి స్థిరమైన భవిష్యత్తు, వివాహ ఖర్చులు వంటి ఎన్నో బాధ్యతల్ని ఎదుర్కొంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న “సుకన్య సమృద్ధి యోజన” (SSY) అనేది చిన్న పెట్టుబడి ద్వారా పెద్ద మునాఫా పొందే గొప్ప అవకాశంగా నిలుస్తోంది. ఇది ప్రత్యేకంగా ఆడపిల్లల భవిష్యత్తు కోసం రూపొందించబడిన ప్రభుత్వ ప్రోత్సాహిత పొదుపు పథకం. ప్రస్తుతం ఇది 8.20% చక్రవడ్డీ రేటుతో, ఏటా వడ్డీ లెక్కించే విధానంలో పనిచేస్తుంది. పదేళ్ళ వయస్సులోపు ఉన్న ఆడపిల్ల పేరున తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకుల ద్వారా ఈ ఖాతాను ప్రారంభించవచ్చు.

Child : మీకు ఆడపిల్లలు ఉన్నారా..? అయితే కేంద్ర పథకాన్ని అస్సలు మరచిపోకండి..!
Child : సుకన్య సమృద్ధి యోజన పథకంలో sukanya samriddhi yojana scheme డబ్బులు పొదుపు చేస్తే మీకు ఏ దిగులు ఉండదు
ఈ పథకం ప్రకారం ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.250 నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకూ పెట్టుబడి పెట్టొచ్చు. ఈ మొత్తం మొత్తంగా ఒకేసారి లేదా నెలల వారీగా డిపాజిట్ చేయొచ్చు. 15 సంవత్సరాల పాటు ఈ డిపాజిట్ కొనసాగించాలి. తర్వాత ఆడపిల్ల 18 ఏళ్ల వయస్సు వచ్చాక, లేదా 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఖాతాలో ఉన్న మొత్తంలో సగాన్ని అవసరాలకు ఉపసంహరించుకోవచ్చు. 21 సంవత్సరాల తర్వాత పూర్తి మెచ్యూరిటీ పొందేందుకు అవకాశం ఉంటుంది. ఇది విద్యా ఖర్చులు, పెళ్లి ఖర్చులకు మంచి భద్రతనిచ్చే విశ్వసనీయమైన మార్గం.
ఉదాహరణకు మీరు నెలకు రూ.12,500 చొప్పున లేదా సంవత్సరానికి గరిష్టంగా రూ.1,50,000 చొప్పున 15 సంవత్సరాలు డిపాజిట్ చేస్తే మొత్తం పెట్టుబడి రూ.22.5 లక్షలు అవుతుంది. ఇందులో వడ్డీ ద్వారా మీరు సుమారు రూ.46.77 లక్షలు అదనంగా పొందగలుగుతారు. మొత్తం మెచ్యూరిటీ అమౌంట్ దాదాపు రూ.70 లక్షలుగా ఉంటుంది. ఇది తక్కువ పెట్టుబడితో భారీ నిధిని సమకూర్చే అవకాశాన్ని కలిగించడంతో పాటు, పన్ను మినహాయింపులను కూడా అందిస్తుంది. కాబట్టి, మీ కుమార్తె భవిష్యత్తును నిర్మించడంలో ఇది అత్యంత విశ్వసనీయమైన మరియు ప్రయోజనకరమైన పథకంగా చెప్పవచ్చు.