Passion Fruit : ఈ పండు యొక్క ప్రయోజనాలు తెలిస్తే… షాక్ అవుతారు…!
ప్రధానాంశాలు:
Passion Fruit : ఈ పండు యొక్క ప్రయోజనాలు తెలిస్తే... షాక్ అవుతారు...!
Passion Fruit : మీరు ఫ్యాషన్ ఫ్రూట్ గురించి వినే ఉంటారు. ఈ పండులో విటమిన్లు మరియు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు లాంటి పోషకాలు ఎన్నో సమృద్ధిగా ఉంటాయి. వీటిని ప్రతిరోజు తీసుకోవటం వలన బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. అలాగే ఊబకాయం లాంటి సమస్యల నుండి కూడా దూరంగా ఉంచుతుంది. ప్రస్తుత కాలంలో కివి, అవకాడో, బ్లూ బెర్రీ లాంటి పండ్ల వినియోగం బాగా పెరిగింది. అలాగే ఈ ఫ్యాషన్ ఫ్రూట్ కూడా బాగా డిమాండ్ పెరిగింది. మరి దీనిని తీసుకోవడం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.
డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు ఫ్యాషన్ ఫ్రూట్ అనేది ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఇది చాలా తక్కువ గ్లైసోమిక్ కలిగి ఉండటం వలన రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిని పెంచకుండా చేస్తుంది. అంతేకాక దీనిలో ఫైబర్ కూడా ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. అయితే ఈ పండులో పొటాషియం మరియు ఎలక్ట్రోలైట్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండెను ఎంతో ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. అంతేకాక దీనిలో ఉన్నటువంటి పీచు చెడు కొలస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో మేలు చేస్తుంది…
ఈ పండులో ఉండే పిసెటానా ల్ మరియు సిర్పూసిన్ బి అనే సమ్మేళనం గుండె సమస్యల ప్రమాదాల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఇది రక్త ప్రసరణను కూడా క్రమబద్ధీకరిస్తుంది.ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్ లు కూడా అధికంగా ఉన్నాయి. ఇది బరువును నియంత్రించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే వీటిని తీసుకోవడం వలన శరీరంలో జీవక్రియ అనేది ఎంతో వేగంగా జరగటంతో ఆహారం అనేది వేగంగా జీర్ణమై బరువు అనేది కంట్రోల్ లో ఉంటుంది. ఈ పండు అనేది రోగనిరోధక శక్తిని ఎంతగానో పెంచుతుంది. దీనిలో ఉండే విటమిన్ సి, ఏ మరియు బీటా కెరోటిన్ లాంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని కూడా ఎంతో బలంగా చేస్తాయి. ఇది ఎన్నో రకాల వ్యాధుల నుండి కూడా మనల్ని రక్షిస్తుంది…