Passion Fruit : ఈ పండు షుగర్ కు మాత్రమే కాదు కొలెస్ట్రాల్ కు కూడా దివ్య ఔషధం…!
Passion Fruit : మన రోజువారి జీవితంలో ఎన్నో రకాల పండ్లను తీసుకుంటూ ఉంటాం. అయితే ఈ పండ్ల లలో పాషన్ ఫ్రూట్ కూడా ఒకటి. ఈ ఫ్రూట్ గురించి పెద్దగా ఎవరికి తెలిసి ఉండదు. కానీ ఈ ఫ్రూట్ మధుమేహ బాధితులకు ఎంతో మేలు చేస్తుంది. దీనిలో గ్లైసోమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకే దీనిని ప్రతి రోజు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుదల రేటు అనేది చాలా తక్కువ మోతాదులో […]
ప్రధానాంశాలు:
Passion Fruit : ఈ పండు షుగర్ కు మాత్రమే కాదు కొలెస్ట్రాల్ కు కూడా దివ్య ఔషధం...!
Passion Fruit : మన రోజువారి జీవితంలో ఎన్నో రకాల పండ్లను తీసుకుంటూ ఉంటాం. అయితే ఈ పండ్ల లలో పాషన్ ఫ్రూట్ కూడా ఒకటి. ఈ ఫ్రూట్ గురించి పెద్దగా ఎవరికి తెలిసి ఉండదు. కానీ ఈ ఫ్రూట్ మధుమేహ బాధితులకు ఎంతో మేలు చేస్తుంది. దీనిలో గ్లైసోమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకే దీనిని ప్రతి రోజు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుదల రేటు అనేది చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. అలాగే షుగర్ ఉన్నవారు తక్కువగా తీసుకుంటే మంచిది. దీనిలో ఫైబర్ శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ కారణం చేత రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు కూడా తగ్గిపోతాయి. ఈ ఫ్రూట్ లో శరీరానికి ఎంతో అవసరమైన పొటాషియం మరియు మెగ్నీషియం మరియు ఫాలిఫైనల్స్ కూడా ఉంటాయి. ఇది షుగర్ ఉన్నవారికి చాలా మంచిది. ఈ ఫ్రూట్ అనేది షుగర్ ఉన్న వారికి మాత్రమే కాకుండా కొలెస్ట్రాల్ ఉన్నవారికి కూడా దివ్య ఔషధంగా పనిచేస్తుంది…
పాషన్ ఫుట్ మాత్రమే కాదు దాని యొక్క ఆకుల రసాన్ని తీసుకున్న కూడా నిద్రలేమి సమస్య దూరం అవుతుంది. అలాగే రాత్రి పడుకునే ముందు ఈ ఆకుల యొక్క రసాన్ని తాగితే దానిలో ఉన్న ఆల్కలాయిడ్ నిద్ర నాణ్యతను పెంచుతుంది. అంతేకాక శరీరంలోని జీవక్రియను ఎంతో బలంగా చేస్తుంది. దీంతో మీరు ఈజీగా బరువు తగ్గుతారు. దీనిలో క్యాన్సర్ నిరోధక గుణాలు కూడా ఉన్నాయి. అలాగే దీనిలో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. దీనివలన రక్తహీనత సమస్య దూరం అవుతుంది. అలాగే ఈ పండులో పొటాషియం మరియు ఎలక్ట్రోలైట్స్ అనేవి ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
ఈ పండు ను తీసుకోవడం వలన రక్త ప్రసరణ కూడా ఎంతో మెరుగ్గా ఉంటుంది. అలాగే దీనిలో ఉన్నటువంటి పిసెటానాల్ మరియు స్కిర్పు సిన్ బి అనే సమ్మేళనం గుండె సమస్యలను నియంత్రిస్తుంది. అలాగే ఈ పండులో విటమిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఈ పండును ప్రతిరోజు తీసుకోవటం వలన రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. అలాగే ఊబకాయం లాంటి సమస్యలకు కూడా ఈజీగా చెక్ పెడుతుంది